ScienceAndTech

అణ్వాయుధాల నిబంధనలు ఎప్పుడైనా సడలించవచ్చు

Indian Home Minister Rajnadh Singh On Nuclear Weapons

అణ్వాయుధాల వినియోగంపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కొత్త కామెంట్ చేశారు.

మొద‌ట‌గా అణ్వాయుధాన్ని వాడ‌రాద‌న్న విధానం ఎప్పుడైనా మారే అవ‌కాశం ఉంద‌న్నారు.

ఎవ‌రు తొంద‌ర‌ప‌డ్డా.. తాము అణ్వాయుధాన్ని ప్ర‌యోగించ‌రాదు అన్న సిద్ధాంతానికి భార‌త్ కొన్నేళ్లుగా క‌ట్టుబ‌డి ఉంది.

కానీ భ‌విష్య‌త్తు ప‌రిణామాల దృష్ట్యా ఆ విధానం మారే అవ‌కాశం ఉంద‌ని ఇవాళ రాజ్‌నాథ్ అభిప్రాయం వ్య‌క్తం చేశారు.

పోక్రాన్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్య‌లు చేశారు. మాజీ ప్ర‌ధాని వాజ్‌పేయి ప్ర‌థ‌మ వ‌ర్థంతి ఇవాళ.

ఈ నేప‌థ్యంలో కేంద్ర మంత్రి పోక్రాన్‌లో ప్ర‌త్యేకంగా వాజ్‌పేయికి నివాళి అర్పించారు. 1998లో వాజ్‌పేయి హ‌యాంలోనే పోక్రాన్‌లో అణుప‌రీక్ష నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే.

భార‌త్ ఆ స‌మ‌యంలో ర‌హ‌స్యంగా మొత్తం అయిదుసార్లు అణుప‌రీక్ష‌లు చేసింది. పోక్రాన్‌-2 న్యూక్లియ‌ర్ ప‌రీక్ష‌ల అనంత‌రం నో ఫ‌స్ట్ యూజ్ (ఎన్ఎఫ్‌యూ) పాల‌సీకి భార‌త్ ఆమోదం తెలిపింది.

కేవ‌లం ఆత్మ‌ర‌క్ష‌ణ కోస‌మే అణ్వాయుధాల‌న్న సిద్ధాంతాన్ని మార్చే అవ‌కాశాలు ఉన్న‌ట్లు మంత్రి చెప్పారు.

ప్ర‌తిదాడి కోసం కూడా అణ్వాయుధం వాడ‌ల‌న్న విధానాన్ని అవ‌లంబించాల‌న్న ప్ర‌తిపాద‌న చేయ‌నున్న‌ట్లు మంత్రి తెలిపారు.