NRI-NRT

వాషింగ్టన్ డీసీ చేరుకున్న వై.ఎస్.జగన్

YS Jagan Reaches Washington DC USAmerica For 6Day Trip-వాషింగ్టన్ డీసీ చేరుకున్న వై.ఎస్.జగన్

ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ తన ఆరు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం వాషింగ్టన్ డీసీ చేరుకున్నారు. ఆయనకు స్థానిక ప్రవాసులు ఘనస్వాగతం పలికారు. ఆయన పర్యటన పూర్తి వివరాలు కింద చూడవచ్చు.

• ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ అమెరికా పర్యటన
• ఆగస్టు 16 నుంచి 22 వరకూ అమెరికాలో పర్యటించనున్న ముఖ్యమంత్రి
• ఆగస్టు 16న వాషింగ్టన్ డీసీ, 17న డల్లాస్, 18,19 తేదీల్లో వాషింగ్టన్డీసీ, 21, 22 తేదీల్లో షికాగోలో పర్యటించనున్న సీఎం
• ఆగస్టు 22న తిరిగి రాష్ట్రానికి బయల్దేరనున్న ముఖ్యమంత్రి
• ఇదే పర్యటనలో రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై ప్రముఖ వ్యాపార, వాణిజ్య సంస్థల ప్రతినిధులు, దౌత్యాధికారులతో చర్చించనున్న ముఖ్యమంత్రి
• ఆగస్టు 16, EDT ఉదయం 8:30 గంటలకు (IST 6PM) వాషింగ్టన్డీసీ చేరనున్న ముఖ్యమంత్రి
• అమెరికా ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులతో సమావేశం కానున్న సీఎం
• సాయంత్రం అమెరికాలో భారత్ రాయబారి ఆహ్వానం మేరకు విందులో పాల్గోనున్న సీఎం
• ఆగస్టు 17 CDT మధ్యాహ్నం 2గంటలకు (IST అర్థరాత్రి 12:30AM) డల్లాస్ చేరుకోనున్న సీఎం
• డల్లాస్లోని కే బెయిలీ హచిన్సన్ కన్వెన్షన్ సెంటర్లో ఆగస్టు 17 CDT సాయంత్రం 6 నుంచి 7:30 గంటల వరకూ (IST AUG 18TH 4:30AMకు ప్రారంభం)నార్త్ అమెరికా తెలుగు కమ్యూనిటీని కలుసుకుని వారినుద్దేశించి ప్రసంగించనున్న సీఎం
• ఆగస్టు 18న వాషింగ్టన్ డీసీలో మరికొందరు వ్యాపార సంస్థల ప్రతినిధులతో ముఖాముఖి చర్చలు జరపనున్న సీఎం
• ఆగస్టు 19, 20, 21 తేదీల్లో వ్యక్తిగత పనులపై సీఎం
• ఆగస్టు 22న మధ్యాహ్నం షికాగోలో మరికొందరు ప్రతినిధులను కలవనున్న ముఖ్యమంత్రి
• ఆగస్టు 22న CDT రాత్రి 8:30 గంటలకు రాష్ట్రానికి బయల్దేరనున్న సీఎం
• టూర్లో మూడు రోజులు వ్యకిగత పనులు ఉండడం వల్ల, ఉన్నత విలువలు పాటించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఖర్చులు తీసుకోకుండా, తన ఖర్చులను తానే భరించనున్న ముఖ్యమంత్రి