DailyDose

గాలిపటం చుట్టుకుని ఇంజనీర్ మృతి-నేరవార్తలు–08/17

Engineer dies due to kite flying-telugu crime news today-08/17

*గత నెల 26న తార్నాకలో నివాసం ఉండే సతీస్ రెడ్డి ఇంట్లో జరిగిన దొంగతనం కేసును పోలీసులు చేదించారు. మధ్యప్రదేశ్లో చెందినాపార్దీ గ్యాంగ్ ఈ నేరానికి పాల్పడినట్లు సీపీ అంజనీ కుమార్ తెలిపారు.
* ఎయిమ్స్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఎమర్జెన్సీ వార్డు మొదటి, రెండు అంతస్తుల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ వ్యాపించింది. అగ్ని ప్రమాదంతో ఆస్పత్రిలోని వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పొగతో రోగులు ఇబ్బంది పడ్డారు.అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి, మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని తెలుస్తోంది.
*ఢిల్లీ మెట్రో రైలు కిందపడి జహంగీర్‌పూరికి చెందిన ఓ వివాహిత(25) ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ఇవాళ ఉదయం 7:25 గంటలకు చోటు చేసుకుంది.
* పార్దీ గ్యాంగ్‌ సభ్యులను అరెస్టు చేసినట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ముగ్గురు దొంగలను అరెస్టు చేశాం. నిందితుల నుంచి కారు, 60 తులాల బంగారం, రెండు కిలోల వెండి స్వాధీనం చేసుకున్నాం. పార్దీ గ్యాంగ్‌కు ఒక మహిళ నాయకత్వం వహిస్తున్నది. గత నెల 26వ తేదీన తార్నాకలో ఓ ఇంట్లో దోపిడీ జరిగింది.
*సిద్దిపేట జిల్లా కేంద్రంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. భార్య కాపురానికి రావట్లేదని యాదగిరి అనే యువకుడు ట్యాంకు పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు.
* ఇటుక బట్టీలో పనిచేసే ఒరిస్సాకు చెందిన మహిళ పై అదే రాష్ట్రానికి చెందిన నలుగురు యువకులు అత్యాచారం చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో జరిగింది. మహేశ్వరం మండలం ఎన్.డి తాండ గ్రామానికి పక్కన ఇటుక బట్టి కర్కాణ లొ పనిచేస్తున్న ఆ మహిళను.. శుక్రవారం రాత్రి బట్టిలో పనిచేసే రాహుల్, మనోజ్, దుర్గ, దయ అనే నలుగురు యువకులు కలిసి అత్యాచారం చేసి పరారయ్యారు. నిందితులంతా తేథిల్ కుట్టి గ్రామం, తుర్కెల మండలం, బలంగిర్ జిల్లా, ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వారు. మాహేశ్వరం పోలీస్ స్టేషన్ లో వారిపై కేసు నమోదైంది. పరారీలో ఉన్న నిందితుల కోసం మహేశ్వరం పొలీసులు గాలిస్తున్నారు.
*కృష్ణా జిల్లా కంచికచెర్ల మండలం చెవిటికల్లు వద్ద వాగులో నాటుపడవ బోల్తాపడి గల్లంతైన తులసి ప్రియ అనే బాలిక మృతి చెందింది. నిన్నటి నుంచి ఆమె కోసం గాలించిన ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలకు మృతదేహం లభ్యమైంది. బాలిక తల్లిదండ్రుల్ని నందిగామ ఎమ్మెల్యే జగన్మోహన్‌రావు ఓదార్చారు.
*పటాన్చెరు మండలం పాశమైలారం వద్ద ఓ కెమికల్ ఫ్యాక్టరీలో ఇవాళ ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. ఈ ఫ్యాక్టరీలో చెలరేగిన మంటలు.. పక్కనే ఉన్న మరో రెండు పరిశ్రమలకు వ్యాపించాయి. ఘటనాస్థలికి చేరుకున్న 5 అగ్నిమాపక యంత్రాలు మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నాయి. భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు ఫ్యాక్టరీల యజమానులు తెలిపారు.
*కడప జిల్లా పులివెందులలో తెదేపా నేత కారుకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. పులివెందుల తెదేపా కార్యాలయం వద్ద పార్టీ నేత ప్రసాద్రెడ్డి తన కారును ఉంచారు. ఈరోజు రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆ కారుకు నిప్పు పెట్టి అక్కడి నుంచి పరారయ్యారు.
*పులికాట్ సరస్సులో ఘోర ప్రమాదం తప్పింది. సరస్సు మధ్యలో ఉన్న ఇరకం దీవి నుంచి మహిళా కార్మికులతో బీవీపాళెం రేవుకు వస్తున్న పడవ శుక్రవారం నీటిలో బోల్తా పడింది.
*నిబంధనలు అతిక్రమించి ఒక పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం జరిపిన కేసులో..మత బోధకుడు బ్రదర్ అనిల్కుమార్కు శుక్రవారం ఖమ్మం కోర్టు వారెంట్ జారీచేసింది.
*టైరు పేలి ఇన్నోవా వాహనం బోల్తా పడిన ఘటనలో ఇద్దరు మృతిచెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం సత్వార్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
*విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువులే.. అభంశుభం తెలియని చిన్నారుల పట్ల పైశాచికంగా ప్రవర్తించారు. పవిత్రమైన వృత్తికి కళంకం తెచ్చారు. విశాఖపట్నం పరిధి పెద్దిపాలెం ప్రాథమికోన్నత పాఠశాలలో ఇద్దరు విద్యార్థినులపై ఉపాధ్యాయుల అసభ్య ప్రవర్తనకు సంబంధించి గురువారం పోలీసులు లోతుగా విచారించారు.
*సెల్ఫీ సరదా తల్లీకూతుళ్ల ప్రాణం తీసింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నదులు, కాలువలు ఉప్పొంగుతున్నాయి. ఈ ప్రకృతి అందాలను తిలకించేందుకు ప్రజలు అక్కడికి వెళ్లి ఆ అందాలను తమ కెమెరాల్లో బంధిస్తున్నారు. ఈ క్రమంలో ఓ తల్లీ, కూతురు వరద కాలువ పక్కన సెల్ఫీ తీసుకోబోయి నీటిలో కొట్టుకుపోయారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని మండ్సార్ జిల్లాలో బుధవారం చోటు చేసుకుంది.
*రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మొయినాబాద్ మండలం నక్కలపల్లి వద్ద ద్విచక్ర వాహనాన్ని జేసీబీ ఢీకొట్టిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు.
*ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల మహిళా హాస్టల్లోకి ఓ ఆగంతకుడు చొరబడి ఓ విద్యార్థినిని కత్తితో బెదిరించి అసభ్యంగా ప్రవర్తించాడు.
*తొమ్మిదేళ్ల నుంచి సరైన పంటల్లేవు… అప్పులు పెరిగి ఆ రైతు ఆయువు తీశాయి. దేవనకొండ మండలం పల్లెదొడ్డిలో కరిడికొండ లక్ష్మన్న(48) అనే రైతు గురువారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
*పొలానికి నీరు పెట్టేందుకు మోటారు వేసే క్రమంలో విద్యుదాఘాతానికి గురై కర్నూలు జిల్లా బండిఆత్మకూరు మండలం వెంగళరెడ్డిపేటకు చెందిన రైతు అంబటి ఈశ్వర్రెడ్డి(38) ప్రాణాలు కోల్పోయారు. గురువారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
*అప్పులు పెరిగి వాటిని తీర్చే దారి కానరాక రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు రైతులు తనువు చాలించారు. ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలం కొణికి గ్రామానికి చెందిన వెంకటరవి (35) ఏడేళ్లుగా వ్యవసాయం చేస్తున్నారు
*బాక్సైట్ తవ్వకాలకు సంబంధించి రస్అల్ఖైమా ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, భారత దేశానికి మధ్య కొనసాగుతున్న కేసులో లండన్ కోర్టుకు హాజరై సాక్ష్యం చెప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు అధికారులను నియమించింది.
*అనంతపురం జిల్లా తాడిపత్రి బజారు పోస్టాఫీసులో ఉద్యోగి.. పోస్టుమాస్టరు చెన్నరాముడు ఖాతాదారుల పొదుపు సొమ్ము రూ.5 కోట్లను సొంతానికి వాడుకున్నట్లు దర్యాప్తు బృందం తేల్చింది.
*విశాఖ మీదుగా చెన్నై వెళ్లే డిబ్రూగఢ్(15930) ఎక్స్ప్రెస్కు బుధవారం పెద్ద ప్రమాదం తప్పింది. రైలులో ఎస్-3 బోగీకి ఒక చక్రం వద్ద స్ప్రింగ్ విరిగిపోయింది. ఈ క్రమంలో ఈ బండిని 4గంటల పాటు విశాఖ స్టేషన్లో నిలిపేశారు.
*వరంగల్ జిల్లాలో ఇటీవల జరిగిన దారుణ ఉదంతాన్ని మరవకముందే మరో ఘోరం చోటు చేసుకుంది. అయిదో తరగతి చదువుతున్న ఓ బాలికపై ముగ్గురు బాలురు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో వెలుగు చూసింది.
*కర్నూలు జిల్లా నంద్యాల పట్టణం ఎన్జీవో కాలనీ గోశాల వద్ద పేకాట నిర్వహిస్తున్న ఓ ఇంటిపై పోలీసులు బుధవారం రాత్రి దాడులు నిర్వహించారు.
*తన కారు ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందడంతో తీవ్ర భయాందోళనకు గురైన మోహన్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన కూకట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. గద్వాల జిల్లా రాజోలికి చెందిన ఎన్.డి.మోహన్ (24) మూడేళ్ల క్రితం నగరానికి వచ్చి కూకట్పల్లి జయానగర్లో తన మిత్రుడితో కలిసి అద్దెగదిలో ఉంటున్నాడు.
*ఆరు నెలల క్రితం శ్రీసిటీలో జరిగిన సెల్ఫోన్ లోడ్ వాహనం చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 12న ఈ ఘటన జరిగింది. దగదర్తి జాతీయ రహదారి వద్ద రూ. 4.18కోట్ల విలువజేసే సెల్ఫోన్ల వాహనాన్ని దుండగులు అపహరించారు.
*ప్రసవం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే వైద్యుల నిర్లక్ష్యంతో తల్లీబిడ్డ ప్రాణాలు కోల్పోయారంటూ బంధువులు, గ్రామస్థులు రహదారిపై 3 గంటల పాటు ఆందోళనకు దిగారు. శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం సవర బాణాపురం గ్రామానికి చెందిన గర్భిణి సవర కృష్ణవేణి(24)ని ప్రసవం కోసం చాపర ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి మంగళవారం తీసుకొచ్చారు.
*వరంగల్ జిల్లాలో ఇటీవల జరిగిన దారుణ ఉదంతాన్ని మరవకముందే మరో ఘోరం చోటు చేసుకుంది. అయిదో తరగతి చదువుతున్న ఓ బాలికపై ముగ్గురు బాలురు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో వెలుగు చూసింది.
* నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలో మహేంద్ర ఫైనాన్స్ మిద్దె పైన జనరేటర్ లో అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి షార్ట్ సర్క్యూట్ వల్ల అని అనుమానిస్తున్నారు సకాలంలో నాయుడు పేట ఎస్ఐ వెంకటేశ్వర్లు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని ఫైర్ సిబ్బంది తో కలిసి మంటలను అదుపు చేశారు.