Health

విఠ్ఠల విఠ్ఠల అంటే బీపీ పోతుందా?

If you keep saying viththala viththala your blood pressure have chances to be normal-విఠ్ఠల విఠ్ఠల అంటే బీపీ పోతుందా?

పుణెలోనివేద విజ్ఞాన కేంద్ర వందలాది హృద్రోగుల మీద ప్రయోగం చేసి ఈ విషయాన్ని నిరూపించింది. ఈ విషయమై ఏషియన్ జనరల్ ఆఫ్ కాంప్లిమెంటరి అండ్ ఆల్టర్నేటివ్ మీడియా అనే అంతర్జాతీయ పత్రికలో ఒక వ్యాసం కూడా ప్రచురితమైంది. విఠ్ఠల అనే పేరులో అపురూపమైన శక్తి ఉంది. విఠ్ఠల నామ స్పందన అంటే స్వరశాస్త్రం గురించి కూడా అనేక పరిశోధనలు జరపడం జరిగింది. ఈ పదాన్ని ఉచ్చరించేటపుడు ‘ఠ్ఠ’ అనే అక్షరం నుండి వెలువడే శక్తి నేరుగా గుండె మీద అద్భుత పరిణామాన్ని కలిగిస్తుంది అని అధ్యయనం ద్వారా తెలిసింది. రెండు మహాప్రాణాలు మరియు రెండు అల్ప ప్రాణాలు కలిగిన పదమైనందున గుండె మీద ప్రభావం కలుగుతుందని వేద విజ్ఞాన కేంద్ర తెలిపింది. పదిరోజులపాటు , రోజుకు 9 నిమిషాలు శాంత చిత్తంతో విఠ్ఠల నామజపం చేసినా హై బ్లడ్ ప్రెషర్ తో సహా గుండెకు సంబంధించిన సమస్యలు నివారణ అవుతాయని వేద విజ్ఞాన కేంద్ర మరియు దివంగత ఇనాందార్ హార్ట్ క్లినిక్ బృందాలు వెల్లడించాయి. కాబట్టి ఈ రోగాలున్నవారు పదిరోజులపాటు విఠ్ఠల నామస్మరణ మొదలెట్టండి. పోతే రోగం పోవచ్చు లేదా పుణ్యం వస్తుంది. ఏం జరిగినా మంచిదేకదా!