DailyDose

ఏసీబీ వలలో రెవెన్యు ఇన్స్‌పెక్టర్-నేరవార్తలు–08/20

ACB Catches Revenue Inspector-Telugu Crime Today-08/20

* పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు తహసీల్ధార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు.పట్టాదారు పాస్ పుస్తకం కోసం రూ.2 వేలు లంచం తీసుకుంటున్న చాగల్లు రెవిన్యూ ఇన్స్పెక్టర్ గాది సుబ్బారావుని పట్టుకున్న ఏసీబీ అధికారులు.చాగల్లు మండలం ఎస్.ముప్పవరం గ్రామానికి చెందిన అయినం దుర్గ ప్రసాద్ కి చెందిన 1.75 ఎకరాల పొలానికి సంభందించి పట్టాదారు పాస్ పుస్తకం కోసం డిమాండ్ చేసిన ఆర్.ఐ సుబ్బారావు.చాగల్లు తహశీల్దార్ కార్యాలయంలో అధికారులతో కొనసాగుతున్న ఏసీబీ అధికారులు విచారణ.
* ఇంజినీరింగ్‌ పరీక్ష రాసేందుకు కళాశాలకు వచ్చిన ఆ విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించాడో ఇన్విజిలేటర్. ఈ ఘటన కరీంనగర్‌లోని తిమ్మాపూర్‌లో చోటుచేసుకుంది. ఓ ఇంజినీరింగ్‌ కాలేజీలో చదువుతున్న విద్యార్థిని పరీక్ష నిమిత్తం మరో ఇంజినీరింగ్‌ కాలేజీకి వెళ్లింది. ఎగ్జామ్ రాస్తుండగా ఇన్విజిలేటర్ వెంకటేశ్‌ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఏకంగా ప్రేమిస్తున్నానని చెప్పాడు.ఇన్విజిలేటర్‌ వింత ప్రవర్తనతో ఖంగుతిన్న విద్యార్థిని బయటికి వచ్చాక స్నేహితులకు మ్యాటర్ చెప్పింది. ఆమె ఫ్రెండ్స్ ఆ ఇన్విజిలేటర్కి దేహశుద్ధి చేశారు. అనంతరం అతన్ని పోలీసులకు అప్పగించారు
* తండ్రిని హత్య చేసిన కొడుకు కిషన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 16వ తేదీన మౌలాలి ఆర్టీసీ కాలనీలో తన తండ్రి మారుతి(80)ని కిషన్ హత్య చేశాడు. స్థానికుల సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు.
*తహసీల్ధార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు.పట్టాదారు పాస్ పుస్తకం కోసం రూ.2 వేలు లంచం తీసుకుంటున్న చాగల్లు రెవిన్యూ ఇన్స్పెక్టర్ గాది సుబ్బారావుని పట్టుకున్న ఏసీబీ అధికారులు. చాగల్లు మండలం ఎస్.ముప్పవరం గ్రామానికి చెందిన అయినం దుర్గ ప్రసాద్ కి చెందిన 1.75 ఎకరాల పొలానికి సంభందించి పట్టాదారు పాస్ పుస్తకం కోసం డిమాండ్ చేసిన ఆర్.ఐ సుబ్బారావు. చాగల్లు తహశీల్దార్ కార్యాలయంలో అధికారులతో కొనసాగుతున్న ఏసీబీ అధికారులు విచారణ.
* శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విదేశీ కరెన్సీ పట్టుబడింది. రూ.1.5 కోట్ల విలువైన విదేశీ కరెన్సీని డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన అధికారులు కరెన్సీని అక్రమంగా దుబాయ్‌కి తీసుకెళ్లేందుకు యత్నించిన ఇద్దరు వ్యక్తులకు పోలీసులకు అప్పగించారు. విదేశీ కరెన్సీని మిఠాయి, బిస్కెట్ డబ్బాల్లో నిందితులు ప్యాక్ చేశారు.
*పాచిపెంట మండల పరిధి పి.కోనవలస చెక్ పోస్ట్ వద్ద 1000 కిలోల గంజాయి పట్టుకున్నారు. ఒడిశా నుంచి విజయనగరం వైపు వ్యాన్ లో గంజాయిని తరలిస్తుండగా పి.కోనవలస చెక్ పోస్ట్ పోలీసులు వాహానాన్ని తనిఖీలు నిర్వహించగా 1000కిలోల గంజాయి బయటపడింది. డ్రైవర్ పారిపోగా గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితులని అదుపులోకి తీసుకుని గంజాయితో పాటు వాహానాన్ని స్వాధీనం చేసుకున్నారు.
*కర్నూలు జిల్లాలోని ఆదోని మండలం విరుపాపురం గ్రామానికి చెందిన న్యాయమూర్తి దేవదాసు (43) విద్యుద్ఘాతంతో మృతి చెందారు.
* మహబూబాబాద్ జిల్లా కురవి మండలం మూడు గుడిసెల తండా వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిన్నారి రహదారిని దాటుతుండగా ఆటో వచ్చి ఢీకొని బోల్తాపడింది. చిన్నారి అక్కడిక్కడే మృతి చెందగా… ఏడుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
*భార్య టికెట్‌పై ప్రియురాలిని తీసుకుని జాలీగా వెళ్లి తాజ్‌మహల్‌ చూసొద్దామనుకున్న ఆ వ్యక్తికి ఎయిర్‌పోర్టులో చుక్కెదురైంది. లింగసూర్‌కు చెందిన దౌల్‌సాబ్‌ అతడి పేరుతో పాటు భార్య ఫాతిమా పేరిట శంషాబాద్‌ ఎయి ర్‌పోర్టు నుంచి ఢిల్లీ వెళ్లడానికి రెండు టికెట్‌లు బుక్‌ చేశాడు. భార్య స్థానంలో ప్రియురాలుతో కలిసి ఈ నెల 16 శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వచ్చాడు. తనిఖీలు నిర్వహిస్తున్న సిబ్బంది సదరు మహిళను పేరు చెప్పమని అడగడంతో ఫాతిమా చోట మరో పేరు చెప్పడంతో సిబ్బంది అవాక్కయ్యారు. పూర్తిగా ఆరాతీయడంతో టికెట్‌కు సంబంధం లేని మహిళ ప్రయాణించేందుకు ప్రయత్నించినట్లు గుర్తించారు. వెంటనే సీఐఎస్‌ఎఫ్‌ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ఆర్‌జీఐఏ పోలీసులకు అప్పగించారు. ఎయిర్‌లైన్స్‌తో పాటు ఎయిర్‌పోర్టు అధికారులను మోసం చేయడానికి యత్నించినందుకు గాను వారిపైకేసు నమోదు చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు.
*దేశరాజధానిలో నేరాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. సామాన్యులే కాదు ప్రముఖులు కూడా దుండగుల బారిన పడుతున్నారు. తాజాగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా భార్య అపర్ణ మెహతాపై దాడి జరగడం గమనార్హం.
*జగిత్యాల జిల్లా కేంద్రంలోని భవానీనగర్లో సాంఘిక సంక్షేమశాఖ బాలికల గురుకుల పాఠశాల కొనసాగుతున్న అద్దె భవనంలో సోమవారం సాయంత్రం వంటగ్యాస్ సిలిండర్ పేలింది.
*నిత్యం తాగొచ్చి వేధింపులకు గురిచేస్తున్న భర్తను తల్లిదండ్రులు, సోదరుల సహాయంతో భార్య హతమార్చిన ఘటన పెద్దపల్లి జిల్లా చందపల్లిలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.
*ఓ కంటైనర్ లారీ అదుపు తప్పి ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో… అందులో ప్రయాణిస్తున్న 13 మంది మృతిచెందారు.
*విశాఖ మన్యంలో సోమవారం మధ్యాహ్నం పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
* ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఎ.పాల్పై నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ మహబూబ్నగర్ ప్రత్యేక సెషన్స్కోర్టు న్యాయమూర్తి అజితసింహారావు సోమవారం ఉత్తర్వులిచ్చారు.
*అసెంబ్లీలో ఫర్నీచర్ చోరీపై పోలీసుల ప్రాథమిక దర్యాప్తు కొనసాగుతోంది. రాజధాని పరిధిలోని తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి సోమవారం అసెంబ్లీ కార్యదర్శి, ఇతర ఉద్యోగులను కలిసి సమాచారం సేకరించినట్లు తెలిసింది.
* భువనేశ్వర్ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న విశాఖ ఎక్స్ప్రెస్కు సోమవారం ప్రమాదం తప్పింది. విశాఖ జిల్లా నర్సీపట్నం రోడ్ రైల్వేస్టేషన్ సమీపంలోని రైల్వేగేటు వద్ద ఆకస్మాత్తుగా ఇంజిన్ను బోగీలను కలిపే లింక్ ఊడిపోయింది.
*బ్యాంకుల నుంచి రూ.25.50 కోట్ల రుణం పొంది కొల్లగొట్టిన ఆంధ్రప్రదేశ్కు చెందిన గన్నె శ్రీనివాసరావుకు చెందిన పలు స్థిరాస్తులను ఈడీ అధికారులు జప్తు చేశారు. ఈ మేరకు హైదరాబాద్ ఈడీ కార్యాలయం సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
*హిమాచల్ ప్రదేశ్ను భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురస్తుల వర్షంతో పలు ప్రాంతాలను వరదలు చుట్టుముట్టాయి. వర్షాలతో ఇప్పటి రాష్ట్రవ్యాప్తంగా 18 మంది ప్రాణాలు కోల్పోయారు.
*ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో చికిత్స పొందుతున్న ఖైదీ రోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఎస్సార్ నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది.
*శంకర్పల్లి మండలం హుస్సేన్పూర్ కూడలి వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన అంబులెన్స్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 67 ఏళ్ల మహిళ మృతి చెందింది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
*ఉత్తర్ ప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లాలో వివాహ బంధానికి మచ్చ తెచ్చే ఓ ఘటన జరిగింది. గొర్రెలను తీసుకొని అందుకు బదులుగా తన భార్యను ఆమె మాజీ ప్రియుడితో పంపేందుకు ఓ భర్త అంగీకరించాడు. ఈ ఒప్పందం గ్రామ పంచాయతీ సమక్షంలోనే జరగడం గమనార్హం.
*మద్యానికి బానిసైన తండ్రి వేధింపులు తట్టుకోలేక ఓ కుమారుడు తండ్రిని ముక్కలుగా నరికి అతికిరాతకంగా హత్య చేసిన దారుణ సంఘటన ఆదివారం రాత్రి వెలుగులోకి వచ్చింది. ఇది మల్కాజ్గిరి పోలీస్స్టేషన్ పరిధిలోని ఆర్టీసీ కాలనీలో చోటుచేసుకుంది.
*ముమ్మారు తలాక్ చెప్పడానికి నిరాకరించిందని కట్టుకున్న భార్యను కన్నబిడ్డ కళ్లెదుటే ఓ దుర్మార్గుడు సజీవ దహనం చేశాడు. ఈ దారుణంతో ఆమె కన్నవారి కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది.
*గాజువాక దరి నాతయ్యపాలెంలో వినాయక చవితిని పురస్కరించుకుని నిర్మిస్తున్న భారీ మండపం ఆదివారం కుప్పకూలింది.
*ఓ ప్రయాణికుడి సామగ్రిలో తూటాలు లభించిన ఘటన ఆదివారం శంషాబాద్ విమానాశ్రయంలో కలకలం రేపింది. హై అలర్ట్ కొనసాగుతున్న తరుణంలో విమానాశ్రయంలో తూటాలు దొరకడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే సదరు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని ఆర్జీఐఏ ఠాణా పోలీసులకు అప్పగించారు. ఉత్తర్ప్రదేశ్లోని ఘజియాబాద్కు చెందిన అంకిత్సింగ్ మహరా(39) హైదరాబాద్లోని ఓ ఆటోమొబైల్ సంస్థలో పని చేస్తున్నాడు.
*తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలో ఆదివారం రాత్రి టాటా ఏస్ వాహనం అదుపు తప్పి, రోడ్డు పక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లిన దుర్ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.
*వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) చట్టంలో లోపాలను ఆసరాగా చేసుకుని కొందరు వ్యాపారులు ప్రభుత్వాదాయానికి భారీగా గండి కొడుతున్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఓ వ్యాపారి చేసిన మోసం ఇందుకు నిదర్శనం.
*ఇరవై రోజుల కిందటే తమిళనాడు రాష్ట్రం కుంభకోణంలోని ఓ కళాశాలలో బీటెక్లో చేరిన కర్నూలు జిల్లా బనగానపల్లికి చెందిన విద్యార్థి సందీప్ కుమార్రెడ్డి(21) చెన్నై బీచ్లో మృతిచెందాడు.
* అంతర్జాతీయ మార్కెట్లో రూ.100 కోట్ల పైచిలుకు ధర పలికే 183 కిలోల హెరాయిన్, బ్రౌన్ షుగర్లను మణిపుర్లోని థౌబల్ జిల్లాలో ఓ కర్మాగారం నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
*బిడ్డతో కలిసి తల్లి నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్నూలు జిల్లా శ్రీశైలం మండలం లింగాలగట్టులో శనివారం చోటుచేసుకుంది.
*అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలంలోని కేపీదొడ్డిలో మైనర్లను చితకబాదిన గ్రామపెద్ద లింగప్పపై కేసు నమోదైంది.
*బిహార్లో ఓ స్వతంత్ర ఎమ్మెల్యే ఇంట్లో జరిపిన సోదాల్లో ఏకే 47 తుపాకీ లభ్యమవడం కలకలం రేకెత్తించింది. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు మొకామా నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే అనంత్కుమార్ ఇంట్లో శుక్రవారం సోదాలు జరిపారు.
*అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్లో ఘోర బాంబు పేలుడు సంభవించింది. శనివారం రాత్రి జరిగిన ఓ పెళ్లి వేడుకలో ఈ పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో దాదాపు 40 మంది మృతి చెందినట్లు సమాచారం.
*వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) చట్టంలో లోపాలను ఆసరాగా చేసుకుని కొందరు వ్యాపారులు ప్రభుత్వాదాయానికి భారీగా గండి కొడుతున్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఓ వ్యాపారి చేసిన మోసం ఇందుకు నిదర్శనం
*తన భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపానికి గురైన ఓ భర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం కడవేర్గు గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన యాదగిరి కొన్ని నెలలుగా తన భార్య కాపురానికి రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
* ఖైరతాబాద్ మెట్రోస్టేషన్ సమీపంలో జరిగిన హత్యకేసును పోలీసులు ఛేదించారు. నిందితుడు ఖైరతాబాద్‌కు చెందిన ప్రకాశ్‌గా పోలీసులు గుర్తించారు. ఇరువురి మధ్య తలెత్తిన చిన్నపాటి వివాదమే హత్యకు దారితీసినట్లు గుర్తించారు. నిందితుడిని అరెస్టు చేసిన సైఫాబాద్ పోలీసులు రిమాండ్‌కు తరలించారు.