DailyDose

గూగుల్‌పై హైకోర్టు సీరియస్-తాజావార్తలు–08/20

High Court Serious On Goodle-Telugu Breaking News-08/20-గూగుల్‌పై హైకోర్టు సీరియస్-తాజావార్తలు–08/20

* పోర్న్‌ వెబ్‌సైట్లపై చర్యలు తీసుకోవాలని దాఖలైన పిటిషన్‌పై రాష్ట్ర హైకోర్టు విచారణ చేపట్టింది. అశ్లీల వెబ్‌సైట్ల బరితెగింపుపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫేస్‌బుక్‌లో ఉన్న పేర్లు, ఫొటోలను తీసుకుని పోర్న్‌ వెబ్‌సైట్లలో పెడుతున్నారని ఓ యువతి హైకోర్టును ఆశ్రయించారు. తన పేరు, ఫోటోలను పోర్న్‌ వెబ్‌సైట్ల నుంచి తొలగించాలని గతంలో గూగుల్ సంస్థకు ఫిర్యాదు చేసినట్టు ఆమె కోర్టు దృష్టికి తెచ్చారు.
* ఉల్లి ధర మరోసారి వినియోగదారుల కంట కన్నీరు పెట్టించనుంది. భారీ వర్షాలు, వరదలు కారణంగా ఉల్లిపాయ ధరలు పెరగనున్నాయి. ముఖ్యంగా ఉత్తర కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో ఎడ తెరిపిలేని వర్షాలు ఖరీఫ్ పంటను ప్రభావితం చేశాయి. ఇప్పటికే లాసాల్‌గావ్, బెంగళూరు వంటి ప్రధాన మార్కెట్లలో గత పదిహేను రోజులుగా టోకు ధరలు పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న కాలంలో ఉల్లి ధరలు పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.
* అయోధ్యలోని వివాదస్పద భూమికి నిజమైన హక్కుదారుడిగా తనను గుర్తించాలని సుప్రీంకోర్టును కోరారు మొఘల్ వారసుడు హబీదుద్దీన్ ట్యూకీ. అలా జరిగితే రామాలయ నిర్మాణానికి తానే తొలి బంగారు ఇటుకను ఇస్తానని అన్నారు. ఈ భూమిపై నిజమైన హక్కుదారులమని ఇప్పటి వరకూ ఎవరూ నిరూపించలేకపోయాని పేర్కొన్నారు. ఈనేపథ్యంలో తననే నిజమైన హక్కుదారుని గుర్తించాలని కోరుతున్నారు. అయోద్య భూవివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో ట్యూకీ ఈవ్యాఖ్యలు చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
*చెన్నైలో గత పది రోజులుగా కురిసిన భారీ వర్షాలకు భూగర్భ జలాలు పెరిగినట్లు స్థానిక వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు, రెవెన్యూ అధికారులు తెలిపారు. మూడు రోజులకు ముందు అయిదు అడుగుల మేర నీటి మట్టం పెరిగిందని, శని, ఆదివారాల్లో కురిసిన వర్షానికి మరో రెండు అడుగుల ఎత్తుకు భూగర్భ జలాలు పెరిగాయని తెలిపారు. భూగర్భ జలాలు పెరగడంతో పలు చోట్ల నగర వాసులు విద్యుత్‌ మోటార్లను ఉపయోగించి బోరు బావుల ద్వారా నీటిని వాడుకుంటున్నారు.
* టీ20 సిరీస్‌లో సత్తా చాటిన యువ పేసర్‌ నవ్‌దీప్‌ సైనిని మరింత సానబట్టే ప్రయత్నంలో భాగంగా అతణ్ని టెస్టుల్లో నెట్‌ బౌలర్‌గా వినియోగించుకోవాలని భారత జట్టు యాజమాన్యం నిర్ణయించింది. వెస్టిండీస్‌తో రెండు టెస్టు సిరీస్‌లో పాల్గొనే భారత జట్టుకు సైని ప్రత్యామ్నాయ బౌలర్‌గానే కాక, నెట్‌ బౌలర్‌గా అందుబాటులో ఉండనున్నాడు.
* వెస్టిండీస్‌-ఎతో మూడు రోజుల సన్నాహక మ్యాచ్‌లో భారత్‌ ఆధిపత్యాన్ని కొనసాగించింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో రాణించిన భారత్‌.. ప్రత్యర్థి ముందు 305 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. తొలి ఇన్నింగ్స్‌లో 116 పరుగుల ఆధిక్యం సంపాదించిన భారత్‌.. చివరి రోజు, సోమవారం 188/5 వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది.
* ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ మాజీ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అఖిలేష్‌ సింగ్‌ ఇకలేరు. గత కొద్ది కాలంగా కాన్సర్‌తో బాధపడుతున్న ఆయన మంగళవారం ఉదయం కన్నుమూశారు.
* దేశంలోని పలు రాష్ర్టాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వానలతో ఆయా రాష్ర్టాలు అతలాకుతలమవుతున్నాయి. రాజస్థాన్‌లోని కొన్ని జిల్లాల్లో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. రాష్ట్రంలో 33జిల్లాలుండగా, వాతావరణ కేంద్రం ప్రకటన మేరకు 13జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదయింది. నాలుగు జిల్లాల్లో ఓ మోస్తరు వానలు పడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చూసినైట్లెతే.. 546.84 మి. మీటర్ల వర్షపాతం నమోదయింది. ఇది సాధారణ వర్షపాతం కన్నా 44.8 శాతం ఎక్కువ. సాధారణ వర్షపాతం 377.52 మిల్లి మీటర్లు.
* నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌‌కి వరద తగ్గింది. దీంతో క్రస్ట్ గేట్లను అధికారులు మూసివేశారు. ప్రాజెక్ట్ ఇఫ్లో 68,450 క్యూసెక్కులు కాగా… ఔట్ ఫ్లో… 53,757 క్యూసెకులు.పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 587.50 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 312 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 305.8030 టీఎంసీలుగా ఉంది.
* ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 22నుంచి ఐదు రోజులపాటు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఫ్రాన్స్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లలో మోఈ పర్యటిస్తారు. ముందుగా ఫ్రాన్స్‌ లో పర్యటిస్తారు. ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్‌ మాక్రోన్‌తో మోడీ సమావేశమై పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారు.
* రాయబరేలి రాబిన్‌ హుడ్‌ ‘ గా ప్రజలంతా ఆప్యాయంగా పిలుచుకునే రాయబరేలి మాజీ ఎమ్మెల్యే అఖిలేష్‌ సింగ్‌ మంగళవారం ఉదయం సుదీర్ఘ అస్వస్థతతో లక్నో లో కన్నుమూశారు. 59 ఏళ్ల అఖిలేష్‌ సింగ్‌ రాయబరేలి (సదర్‌) నియోజకవర్గం నుంచి అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
* దండుగోపాల పురం గ్రామాన్ని కుక్కల భయం వెంటాడుతోంది. మండలంలోని దండుగోపాల పురం గ్రామంలో మంగళవారం ఉదయం కుక్కల దాడిలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.
* చెన్నైలో గత పది రోజులుగా కురిసిన భారీ వర్షాలకు భూగర్భ జలాలు పెరిగినట్లు స్థానిక వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు, రెవెన్యూ అధికారులు తెలిపారు. మూడు రోజులకు ముందు అయిదు అడుగుల మేర నీటి మట్టం పెరిగిందని, శని, ఆదివారాల్లో కురిసిన వర్షానికి మరో రెండు అడుగుల ఎత్తుకు భూగర్భ జలాలు పెరిగాయని తెలిపారు. భూగర్భ జలాలు పెరగడంతో పలు చోట్ల నగర వాసులు విద్యుత్‌ మోటార్లను ఉపయోగించి బోరు బావుల ద్వారా నీటిని వాడుకుంటున్నారు.
* అన్ని జిల్లాల కలెక్టర్లతో హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమావేశమయ్యారు. కొత్త రెవెన్యూ చట్టంపై వారి అభిప్రాయాలను తీసుకోనున్నారు. పంచాయతీ, పురపాలక చట్టాల అమలు, 60 రోజుల కార్యాచరణ ప్రణాళిక తదితర అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం.
* విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన ఓ అధ్యాపకుడిని చితక్కొట్టిన ఘటన కరీంనగర్‌లో సంచలనం సృష్టించింది. ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం అడ్వాన్స్‌డ్ సఫ్లమెంటరీ పరీక్ష రాస్తున్న విద్యార్థినితో లెక్చరర్ వెంకటేష్ అసభ్యంగా ప్రవర్తించాడు.
* ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధానిపై ప్రభుత్వంలో చర్చ జరుగుతోందని, త్వరలోనే దీనిపై నిర్ణయాన్ని ప్రకటిస్తామని బొత్స వెల్లడించారు.
* పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు తహసీల్ధార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు.పట్టాదారు పాస్ పుస్తకం కోసం రూ.2 వేలు లంచం తీసుకుంటున్న చాగల్లు రెవిన్యూ ఇన్స్పెక్టర్ గాది సుబ్బారావుని పట్టుకున్న ఏసీబీ అధికారులు.
* చాగల్లు మండలం ఎస్.ముప్పవరం గ్రామానికి చెందిన అయినం దుర్గ ప్రసాద్ కి చెందిన 1.75 ఎకరాల పొలానికి సంభందించి పట్టాదారు పాస్ పుస్తకం కోసం డిమాండ్ చేసిన ఆర్.ఐ సుబ్బారావు.చాగల్లు తహశీల్దార్ కార్యాలయంలో అధికారులతో కొనసాగుతున్న ఏసీబీ అధికారులు విచారణ.
* గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలకు ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికలు చేసింది. గుజరాత్ ఏటీఎస్ ను ఐబీ అప్రమత్తం చేసింది. దేశంలోకి నలుగురు చొరబడినట్లు సమాచారం. అప్ఘాన్ నుంచి గుజరాత తీరం ద్వారా చొరబడినట్లు తెలుస్తోంది. ఈనెల మొదటి వారంలోనే దేశంలోకి చొరబడ్డారని కీలక సమాచారం. ఆగస్టు 15సందర్భంగానే దాడులకు పాల్పడే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. తదుపరి కూడా ఐబీ హెచ్చరికలు కొనసాగిస్తోంది.
* ఇంత సుదీర్ఘ కాలం అంతర్జాతీయ క్రికెటర్‌గా కొనసాగుతానని కలలో కూడా అనుకోలేదని భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అన్నాడు. అంతర్జాతీయ క్రికెటర్‌గా 11 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో విరాట్‌ ఉద్వేగ పూరిత ట్వీట్‌ చేశాడు. ‘‘టీనేజర్‌గా 2008లో ఇదే రోజు కెరీర్‌ ప్రారంభించిన నేను.. ఈ 11 ఏళ్లలో ఈ స్థాయికి చేరుకుంటానని ఊహించలేదు. దేవుడి ఆశీస్సులతోనే ఇది సాధ్యమైంది. మీ కలను నెరవేర్చుకునే శక్తి సామర్థ్యాలు సొంతం కావాలంటే సరైన మార్గంలో నడవాలి’’ అని విరాట్‌ ట్వీట్‌ చేశాడు. ఈ పోస్టులో శ్రీలంకపై తన అరంగేట్ర మ్యాచ్‌ నాటి ఫొటోతో పాటు తాజా చిత్రం కూడా ఒకటి జోడించాడు విరాట్‌.
*ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 22నుంచి ఐదు రోజులపాటు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఫ్రాన్స్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ లలో మోఈ పర్యటిస్తారు. ముందుగా ఫ్రాన్స్‌లో పర్యటిస్తారు. ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్‌ మాక్రోన్‌తో మోడీ సమావేశమై పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారు.
*నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌‌కి వరద తగ్గింది. దీంతో క్రస్ట్ గేట్లను అధికారులు మూసివేశారు. ప్రాజెక్ట్ ఇఫ్లో 68,450 క్యూసెక్కులు కాగా… ఔట్ ఫ్లో… 53,757 క్యూసెకులు.పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 587.50 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 312 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 305.8030 టీఎంసీలుగా ఉంది.
*శైలం జలాశయానికి తగ్గిన వరద మొత్తం గేట్లు మూసివేత ఇన్ ఫ్లో : 2.07 లక్షల క్యూసెక్కులు ఔట్ ప్లో : 1.06 లక్షల క్యూసెక్కులు నీటి నిల్వ సామర్థ్యం : 215 టిఎంసిలు ప్రస్తుతం : 209.5948 టిఎంసిలు.పూర్తి స్థాయి నీటిమట్టం : 885 అడుగులు ప్రస్తుతం : 883.90 అడుగులు కుడి , ఎడమగట్టు విద్యుత్ కేంద్రాల్లో పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి
*కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ రాజస్థాన్‌నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. శాసనసభలో తగిన సంఖ్యాబలం లేకపోవడంతో బిజెపి అభ్యర్థిని నిలబెట్టకపోవడంతో మన్మోహన్‌ సింగ్‌ విజయం సాధించారని అధికారులు ప్రకటించారు.
*ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న మూడో, నాలుగోతరగతి ఉద్యోగులను తెలంగాణకు పంపడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. ఆ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలంగాణ సీఎస్ ఎస్కే జోషికి సోమవారం లేఖ రాశారు.
*ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ఛైర్మన్గా భూగర్భ గనులశాఖ ప్రభుత్వ కార్యదర్శిని నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
*సమీకృత సహకార అభివృద్ధి ప్రాజెక్టు-2 (ఐసీడీపీ) కమిటీల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. మన రాష్ట్రంలో తూర్పుగోదావరి, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో వీటిని అమలు చేస్తున్నారు.
*ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం..డిప్లొమాలతో పాటు వ్యవసాయ, వెటర్నరీ, ఉద్యాన డిగ్రీ కోర్సుల ఎన్సీసీ కేటగిరీ సీట్ల భర్తీకి ఈ నెల 22న కౌన్సెలింగ్ నిర్వహించనుంది.
*కరీంనగర్ జిల్లాలోని మధ్య మానేరు జలాశయానికి రాజ రాజేశ్వరి పేరును నిర్ణయిస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి లక్ష్మీ, అన్నారానికి సరస్వతి, సుందిళ్లకు పార్వతి, లక్ష్మీపూర్ పంపుహౌస్కు గాయత్రి పంపుహౌజ్ పేరును, నంది మేడారం జలాశయం, పంపు హౌస్లకు నంది పేరును నిర్ణయించిన విషయం తెలిసిందే.
*ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో(పీహెచ్సీ) ఉన్న ఆయుష్ వైద్యుల సేవలకు వీలుగా సకల వసతులూ కల్పించాలని వైద్య ఆరోగ్య శాఖ భావిస్తోంది. అల్లోపతి వైద్యులతో పాటు రాష్ట్రంలో సుమారు 500 మంది ఆయుష్ డాక్టర్లు పనిచేస్తున్నారు.
* తెలంగాణ రాష్ట్ర ప్రణాళికలు దేశానికి ఆదర్శంగా ఉండాలని, ప్రణాళికలన్నీ ఫలవంతమయ్యేలా కార్యాచరణ ఉండాలని ప్రముఖ ఆర్థికవేత్త, కేంద్ర ప్రణాళిక సంఘం మాజీ సభ్యుడు ఆచార్య చెన్నమనేని హన్మంతరావు సూచించారు.
*నాగార్జునసాగర్కు ఎగువ నుంచి వరద ప్రవాహం తగ్గిపోయింది. ఆదివారం సాయంత్రం శ్రీశైలం వైపు నుంచి 4.23 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చింది. సోమవారం సాయంత్రానికి అది 70 వేలకు పడిపోయింది.
*ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల జమ్మూకశ్మీర్కు జరగబోయే ప్రయోజనం గురించి పార్టీ తరఫున దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలని భాజపా అధినాయకత్వం నిర్ణయించింది.
*ప్రభుత్వరంగ సంస్థ కోల్ ఇండియాలో భారీగా ఉద్యోగాల భర్తీ పేరుతో ఓ వెబ్సైట్ నిర్వాహకులు నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టారు.
*తెలంగాణలో తెరాస రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్ ప్రారంభించిన హరిత సవాల్ దేశమంతటికీ విస్తరిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా మహారాష్ట్ర ఎంపీ సుప్రియా సూలె కాంగ్రెస్ మాజీ జాతీయ అధ్యక్షుడు రాహుల్గాంధీకి హరిత సవాల్చేశారు.
*మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సోమవారం రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. భాజపా తన అభ్యర్థిని నిలబెట్టకపోవడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయినట్టు అధికారులు ప్రకటించారు.
*దేశరాజధానిలో నేరాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. సామాన్యులే కాదు ప్రముఖులు కూడా దుండగుల బారిన పడుతున్నారు. తాజాగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా భార్య అపర్ణ మెహతాపై దాడి జరగడం గమనార్హం.
*తెలంగాణ పీజీఈసెట్ రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ఆగస్టు 29వ తేదీ నుంచి మొదలవుతుందని సెట్ కన్వీనర్ రమేశ్బాబు తెలిపారు.
*భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జర్మనీ రాజధాని బెర్లిన్లో తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో సాంస్కృతిక ఉత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. దాదాపు 600 మంది భారతీయ కుటుంబాల వారు ఇందులో పాల్గొన్నారు. జర్మనీలోని భారత రాయబార కార్యాలయ అధికారిణి మీరా త్రిపాఠి, ఎంపీ మనూలాలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. భారతీయ సాంస్కృతిక సంఘాధ్యక్షుడు వైద్యనాథన్, జర్మనీ తెలంగాణ సంఘం అధ్యక్షుడు చలిగంటి రఘు పాల్గొన్నారు.
*కర్ణాటక రాజకీయాలను టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కుదిపేసింది. వారం క్రితం జనతాదళ్ బహిష్కృత నేత, మాజీ మంత్రి విశ్వనాథ్ చేసిన చిన్న ఆరోపణ చినికిచినికి గాలివానగా మారి.. సీబీఐ దర్యాప్తుదాకా తీసుకెళ్లింది.
*పశు ఉత్పత్తుల్లో ప్రపంచ నాయకుడిగా ఎదిగే సత్తా భారత్కు ఉందని తమిళనాడు పశువైద్య విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ బాలచంద్రన్ అన్నారు. ప్రపంచ అవసరాలకు అనుగుణంగా పశు వైద్యంలో కృత్రిమ మేధ, రోబోటిక్స్ పరిజ్ఞానం వాడాల్సిన ఆవశ్యకత ఉందని వివరించారు.
*పారిశ్రామిక రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడంలో విద్యార్థులు తమవంతు పాత్ర పోషించాలని ‘నిట్’ పూర్వ విద్యార్థి- బ్యాంకాక్లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఏఐటీ) సంచాలకులు నితిన్కుమార్ త్రిపాఠి కోరారు.
*రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు సెప్టెంబరు నెలలో నిర్వహించే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి తెలిపారు. బడ్జెట్ ప్రతిపాదనలపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు.
* తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన విమానాశ్రయ స్థలాల పరిశీలన రెండో దశకు ముగ్గురు అధికారుల బృందాన్ని ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) నియమించింది. ఏఏఐలో వివిధ హోదాల్లో పని చేస్తున్న అధికారులు అమిత్కుమార్, నీరజ్గుప్తా, కుమార్ వైభవ్ ఈ బృందంలో ఉన్నారు.
*తమిళనాడు తీరంలోని బంగాళాఖాతంలో 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ అధికారి రాజారావు తెలిపారు. మరోవైపు పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ ప్రాంతాల్లో 7.6 కిలోమీటర్ల ఎత్తున మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.
*ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఈ నెల 28న విశాఖపట్నం రానున్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొని 29వ తేదీన తిరుగుప్రయాణం కానున్నారు. ఉపరాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో అవసరమైన ఏర్పాట్లను యంత్రాంగం చేస్తోంది.
*రాజీవ్గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాలకు రెండో విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ను కన్వీనర్ ప్రొఫెసర్ గోపాలరాజు విడుదల చేశారు. ఈ కౌన్సెలింగ్కు ఎంపికైన విద్యార్థుల జాబితాను ఆదివారం నుంచి వెబ్సైట్www.rgukt.in లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. విద్యార్థులు కాల్లెటర్లు డౌన్లోడ్ చేసుకొని నూజివీడు క్యాంపస్లో కౌన్సెలింగ్కు హాజరు కావాలన్నారు. 26న మొదట విడతలో భర్తీకాని సీట్లు, దివ్యాంగులు, క్రీడా కోటా సీట్లను భర్తీ చేయనున్నారు. 27న ఆర్థిక బలహీన వర్గాల(ఈడబ్ల్యూఎస్) కోటా కింద అర్హులైన వారు హాజరు కావాలన్నారు. ఈడబ్ల్యూఎస్ ధ్రువీకరణ పత్రాలను www.admissions@rgukt.in కు మెయిల్ చేయాలని సూచించారు.
*ఎంబీఏ, ఎంసీఏల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీఐసెట్ రెండో విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ను విడుదల చేశారు. ఈ నెల 29, 30న ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు. పూర్తి వివరాలను వెబ్సైట్ https://apicet.nic.in లో ఉంచారు.