Devotional

యదాద్రి తరహాలో భద్రాద్రి అభివృద్దికి మాస్టర్ ప్లాన్

Development Master Plan For Bhadradri As Yadadri-యదాద్రి తరహాలో భద్రాద్రి అభివృద్దికి మాస్టర్ ప్లాన్

1. యదాద్రి తరహాలో భద్రాద్రి అభివృద్దికి మాస్టర్ ప్లాన్ – ఆద్యాత్మిక వార్తలు – 08/21
భద్రాద్రి రామాలయంపై కేసీఆర్ ప్రత్యెక ద్రుష్టి సారించారని తెలిపారు. ఎంపీ నామ నాగేస్వరర్వు ఖమ్మం జిల్లా భద్రాచలం సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకున్నా నామా నాగేశ్వరరావు ప్రత్యెక పూజలు చేశారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడిన ఆయన యదాద్రి తరహాలో రూ.100 కొట్లతో మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు తెలిపారు. భద్రాద్రికి రైల్వే లైన్ మంజూరు కోసం కృషి చేస్తానన్నారు. ఏపీలో కలిసిన ఐదు పంచాయతీల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్ళి వాటిని తిరిగి తెలంగాణాలో కలిసేలా కృషి చేస్తానని నామా తెలిపారు.
2. యాదాద్రి రాబడి రూ.87.85 లక్షలు
యాదాద్రి పుణ్యక్షేత్రంలోని లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో భక్తులు సమర్పించిన నగదు, నగల హుండీ కానుకలను మంగళవారం లెక్కించారు. రాబడి మొత్తం రూ. 87,85,728 అని దేవస్థానం కార్యనిర్వహణాధికారిణి గీతారెడ్డి తెలిపారు.
3. శ్రీశైలంలో సద్దుమణిగిన ‘అన్యమతస్థుల’ వివాదం
శ్రీశైల మహాక్షేత్రంలో 5 రోజులుగా కొనసాగిన అన్యమతస్థుల వివాదం సద్దుమణిగింది. దేవస్థానం ఈవో బదిలీ, వేలం పాటల రద్దుతో ఉద్రిక్తతలకు తెరపడింది. మంగళవారం భాజపా, హిందూ సంస్థలు తలపెట్టిన ధర్నాను విరమించుకున్నాయి. ఈనెల 16న శ్రీశైల మహాక్షేత్రంలోని లలితాంబా వాణిజ్య దుకాణ సముదాయాల వేలాల్లో 36 మంది అన్యమతస్థులు పాల్గొనడంపై వివాదం మొదలయ్యింది. భాజపా, పలు హిందూ సంస్థల ఆధ్వర్యంలో మంగళవారం చలో శ్రీశైలం పేరుతో క్షేత్ర పరిధిలో ధర్నాకు సమాయత్తమయ్యారు. శివాజీ స్ఫూర్తికేంద్రం చేరుకున్న ఆందోళనకారులను ధర్నాలో పాల్గొనకుండా డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకున్నారు. చివరకు చర్చల అనంతరం సాధు పెద్దల సమక్షంలో 15 మంది నాయకులు ఈవో కార్యాలయానికి చేరుకొని నూతన ఈవో కేఎస్ రామారావుకు వినతిపత్రం అందజేయడంతో గొడవ సద్దుమణిగింది.
4. 23న సామూహిక వరలక్ష్మీ వ్రతాలు-ముగిసిన ఉచిత టిక్కెట్ల దరఖాస్తులు
శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రత పూజకు రెండు రోజుల్లోనే రికార్డు స్థాయిలో రెండు వందల దరఖాస్తులు మంగళవారం నాటికి వచ్చాయి. ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రత పూజకు దరఖాస్తులు స్వీకరిస్తున్న విషయం తెలుసుకున్న మహిళలు రెండు రోజులుగా సమాచార కేంద్రంలో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ నెల 23న శ్రావణ మాసం మూడో శుక్రవారాన్ని పురస్కరించుకొని సామూహిక వరలక్ష్మీ వ్రతాలను నిర్వహిస్తున్నట్లు దేవస్థానం అధికారులు ప్రకటించారు. వ్రతానికి రూ.1500 టిక్కెట్టు ధర నిర్ణయించారు. నాలుగు వందల మంది మహిళలు పూజలో పాల్గొనేందుకు వీలుగా దేవస్థానం అధికారులు మల్లికార్జున మహామండపం ఆరో అంతస్తులో ఏర్పాట్లు చేశారు. నాలుగు వందల మందిలో టిక్కెట్లు విక్రయాల ద్వారా 200మందికి, తెల్లకార్డు కలిగి ఆర్థిక స్థితి సరిగా లేని పేద మహిళలకు 200 మందికి దేవస్థానం ఏటా అవకాశం కల్పిస్తోంది. ఇప్పటి వరకు 60మంది భక్తులు రూ.1500 టిక్కెట్టుకు రుసుము చెల్లించారు. టిక్కెట్టు రుసుము చెల్లించిన భక్తులకు పులిహోర, పూర్ణాలు, లడ్డు, కుంకుమ భరిణ, మెట్టెలు అందజేస్తారని వైదిక కమిటీ సభ్యులు తెలిపారు.
5. శుభమస్తు-తేది : 21, ఆగష్టు 2019
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : శ్రావణమాసం
ఋతువు : వర్ష ఋతువు
కాలము : వర్షాకాలం
వారము : బుధవారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : పంచమి
(నిన్న తెల్లవారుజాము 3 గం॥ 32 ని॥ నుంచి
ఈరోజు తెల్లవారుజాము 5 గం॥ 30 ని॥ వరకు)
నక్షత్రం : అశ్విని
(నిన్న రాత్రి 10 గం॥ 28 ని॥ నుంచి
మర్నాడు తెల్లవారుజాము 0 గం॥ 45 ని॥ వరకు)
యోగము : గండము
కరణం : తైతిల
వర్జ్యం : (ఈరోజు రాత్రి 8 గం॥ 22 ని॥ నుంచి ఈరోజు రాత్రి 10 గం॥ 7 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు సాయంత్రం 4 గం॥ 51 ని॥ నుంచి ఈరోజు రాత్రి 6 గం॥ 36 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 11 గం॥ 53 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 43 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 12 గం॥ 18 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 52 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 10 గం॥ 44 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 18 ని॥ వరకు)
మగండం : (ఈరోజు ఉదయం 7 గం॥ 34 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 8 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 0 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 38 ని॥ లకు
సూర్యరాశి : సింహము
చంద్రరాశి : మేషము
6. చరిత్ర ఈ రోజు/ఆగస్టు 21*-జాతీయ వృద్ధుల దినోత్సవం.
1914 : ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకుడు మరియు నిర్మాత పి.ఆదినారాయణరావు జననం (మ.1991).
1927 : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, నిజాం విమోచనోద్యమకారుడు భీంరెడ్డి సత్యనారాయణరెడ్డి జననం (మ.2012).
1940 : ప్రముఖ చిత్రకారుడు, ముద్రణ మరియు డ్రాఫ్టింగ్ దిట్ట లక్ష్మా గౌడ్ జననం.
1978 : ప్రముఖ తెలుగు సినిమా నటీమణి భూమిక జననం.
1986 : జమైకా దేశానికి చెందిన ప్రముఖ పరుగు వీరుడు మరియు మూడు సార్లు ఒలింపిక్ స్వర్ణ పతకాన్ని సాధించిన ఉసేన్ బోల్ట్ జననం.
1992 : కె.ఆర్.నారాయణన్ ఉప రాష్ట్రపతి గా బాధ్యతలు స్వీకరించాడు.
2006 : భారత దేశానికి చెందిన, ప్రఖ్యాత షెహనాయ్ విద్వాంసుడు ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ మరణం (జ.1916).
7. తిరుమల సమాచారం*ఓం నమో వేంకటేశాయ*
ఈరోజు బుధవారం *21-08-2019* ఉదయం *5* గంటల సమయానికి.
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ ……శ్రీవారి దర్శనానికి *2* కంపార్ట్ మెంట్లలలో వేచి ఉన్న భక్తులు…. శ్రీవారి సర్వ దర్శనానికి *6* గంటల సమయం పడుతోంది….. ప్రత్యేక ప్రవేశ (300/-) దర్శనానికి, కాలినడక భక్తులకు, టైమ్ స్లాట్ సర్వ దర్శనానికి *3* గంటల సమయం పడుతుంది…. నిన్న ఆగస్టు *20* న *81,315* మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది. నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు *3.02* కోట్లు.
8. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనం కోసం 2 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. టైమ్‌స్లాట్‌ టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటల సమయం పడుతోంది.
9. గోశాలలో చనిపోయిన గోవుల ఆత్మ శాంతి కోసం మరియు రాష్ట్ర సర్వారిష్ట నివారణ కోసం ఈ రోజు కొత్తూరు తాడేపల్లి గోశాల నందు శ్రీ శైవ క్షేత్ర పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ శివ స్వామీజీ వారి మంగళా శాసనము ల తో “చతుర్వేద స్వాహా కార హవనం” జరుగును. సమయం: ఉదయం11గం”ల నుండి మధ్యాహ్నం 1గం”ల వరకు జరుగును.