ScienceAndTech

ఈ కళ్లజోడు పెట్టుకుంటే అంతా 3డీమయం

Snapchat Spectacles3 Will Shoot In 3D-ఈ కళ్లజోడు పెట్టుకుంటే అంతా 3డీమయం

చూసింది చూసినట్టుగా 3డీలో చిత్రీకరణ చేయాలంటే? అబ్బో.. దానికి తగిన కెమెరా సెటప్‌ అంతా ఓ రేంజ్‌ అనుకోనక్కర్లేదు. సింపుల్‌గా కళ్లజోడు పెట్టుకుని షూట్‌ చేయొచ్చు. స్నాప్‌ సంస్థ అలాంటి కళ్లజోడునే అందుబాటులోకి తెచ్చింది. పేరు ‘స్పెక్టకిల్స్‌ 3’. కళ్లజోడుకి రెండు వైపులా రెండు హెచ్‌డీ కెమెరాల్ని నిక్షిప్తం చేశారు. మనం ఎలాగైతే చూస్తామో అదే యాంగిల్‌లో అగ్మెంటెడ్‌ రియాలిటీ సపోర్టుతో ఫొటోలు, వీడియోల్ని 3డీలో షూట్‌ చేయొచ్చు. ఇలా చిత్రీకరించిన వాటిని స్మార్ట్‌ఫోన్‌కి సింక్‌ చేసేలా, కళ్లజోడు వైర్‌లెస్‌ నెట్‌వర్క్‌తో పని చేస్తుంది. మీకు నచ్చినవాటిని ‘స్నాప్‌ఛాట్‌’ వేదికగా ప్రపంచంతో పంచుకోవచ్చు. అందుకు తగిన సపోర్టు సిస్టమ్‌ కళ్లజోడుకి బిల్ట్‌ ఇన్‌గా ఏర్పాటు చేశారు. ధర రూ.27,000