WorldWonders

టిప్పు సుల్తాన్ కాలం నాటి రాతప్రతుల వేలం

Writings From Tippu Sultan's Time To Be Auctioned

టిప్పు సుల్తాన్ కాలం నాటి అరుదైన పుస్తకాలు, రాతప్రతులు, మ్యాప్‌లను ముంబయికి చెందిన ప్రిసెప్స్ ఆన్‌లైన్‌లో వేలానికి ఉంచబోతోంది. టిప్పు సుల్తాన్‌పై వెలువడిన ‘ఎ నేరేటి వ్ ఆఫ్ ది క్యాంపైన్ ఇన్ ఇండియా’ వంటి పుస్తకాలు, సుల్తాన్ రాజ్యం సరిహద్దులకు సంబంధించిన రెండు మ్యాపులు కూడా ఈ వేలంలో ఉంటాయి. ఈ మ్యాప్‌లు 1792, 1799 నాటివి. ఈపుస్తకం రూ.3,90,000, మ్యాప్‌లు ఒక్కొక్కటి రూ. 90,000 నుంచి 1,20,000వరకు ధర పలకవచ్చని భావిస్తున్నారు.సెప్టెంబర్ 4,5 తేదీల్లో జరిగే ఈ వేలంలో దాదాపు 400 ఏళ్ల కిందటి పుస్తకాల్లో దేన్నయినా ఎంపిక చేసుకోవచ్చు. అతి ప్రాచీనమైన పుస్తకం ‘డి విటా కేసరమ్’(ది ట్వల్వ్ సీజర్స్). ఇది 1605 సంవత్సరం నాటిది. రోమ్ సీజర్స్ జీవితంసౌ ఈ పుస్తకానికి విశేష చారిత్రక ప్రాధాన్యముంది. పుస్తకం రూ.40,000 నుంచి రూ. 50,000 ధర పలకవచ్చనుకుంటున్నారు. పురాతన వస్తువుల్ని సేకరించడంలో పేరుపొందిన సునీల్ బాబూ నుంచి వీటిని సేకరించాము’అని వేలంసంస్థ ఒక ప్రకటనలో తెలిపింది