Movies

నాకు త్వరగా పెళ్లిచేయాలని ప్రజల కోరిక

I dont understand these stupid baseless rumors - Prabhas

‘మీరు అనుష్కతో డేటింగ్‌లో ఉన్నారా? మీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారా?’… ప్రభాస్‌ ఎక్కడికి వెళ్లినా మీడియా, అభిమానుల నుంచి ఎక్కువగా ఎదురయ్యేది ఈ రెండు ప్రశ్నలే. తాను, అనుష్క కేవలం స్నేహితులమేనని ప్రభాస్‌ ఇప్పటికి వంద సార్లు చెప్పుంటారు. అయినా ఈ ప్రశ్నలకు, వదంతులకు ఫుల్‌స్టాప్‌ పడటం లేదు. ‘సాహో’ సినిమా ప్రచార కార్యక్రమంలో ప్రభాస్‌కు తాజాగా మరోసారి ఇదే ప్రశ్న ఎదురైంది. దాంతో ఆయనకు చిర్రెత్తుకొచ్చింది.దాంతో ఆయన స్పందిస్తూ.. ‘ఈ వదంతులకు ఫుల్‌స్టాప్‌ పడాలంటే అనుష్క అయినా త్వరగా పెళ్లిచేసుకోవాలి. లేదా నేనన్నా ఓ ఇంటివాడిని అవ్వాలి. ఈసారి అనుష్కను కలిస్తే త్వరగా ఎవర్నో ఒకరిని చూసుకుని పెళ్లిచేసుకోమని చెబుతాను. అప్పుడే మా ఇద్దరి మధ్య ఇలాంటి వదంతులు రాకుండా ఉంటాయి. మేమిద్దరం రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు మాకు నిజం దాచాల్సిన అవసరం ఏంటో నాకు ఇప్పటికీ అర్థంకావడంలేదు. నేను చెప్పేది మీరు నమ్మకపోతే ఇక నేనేం చేయలేను. అసలు ఇలాంటి రూమర్స్‌ ఎక్కడి నుంచి వస్తాయో తెలీదు. బహుశా నాకు త్వరగా పెళ్లి చేయాలని ప్రజలు అనుకుంటున్నారేమో. అందుకే ఇలాంటి లింక్స్‌ పెడుతున్నారని అనిపిస్తోంది’ అని వ్యాఖ్యానించారు ప్రభాస్‌.