DailyDose

రెండు రోజుల్లో స్పందిస్తా…చంద్రబాబు-రాజకీయ–08/22

I will respond in two day-Telugu Political News-08/22

* తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ రావు అసెంబ్లీ ఫర్నిచర్, ఇతర సామాగ్రిని తన సొంత అవసరాల కోసం ఇంటికి తరలించిన వ్యవహారంలో తొలి వికెట్ పడింది. చీఫ్ మార్షల్‌ గణేశ్ బాబుపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది.
ఆయనను అక్టోపస్‌కు బదిలీ చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు ఇంకా వెలువడాల్సి ఉంది. ఫర్నిచర్, ఇతర సామాగ్రి తరలింపులో గణేశ్ బాబు పాత్ర కీలకంగా మారినట్లు ప్రభుత్వం అనుమానిస్తోన్న విషయం తెలిసిందే. అసెంబ్లీ భద్రతా వ్యవహారాలను పర్యవేక్షించాల్సిన బాధ్యత గణేశ్ బాబుదే. అయినప్పటికీ- ఫర్నిచర్ ను ఆయనే దగ్గరుండి మరీ కోడెల శివప్రసాద్ రావు ఇంటికి తరలించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
* మళ్లీ తలదూర్చిన ట్రంప్
అగ్రదేశానికి ప్రెసిడెంట్ ఆయన. ప్రపంచానికి నీతులు చెబుతుంటారు. కానీ ఎప్పుడూ మాట మీద నిలబడరు. పూటకోమాట మారుస్తూనే ఉంటారు. ఇదంతా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించే. ప్రధాని నరేంద్ర మోడీ, పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్లతో ఫోన్లో మాట్లాడి, కూర్చుని సమస్యను పరిష్కరించుకోవాలని సుద్దులు చెప్పిన ట్రంప్.. తాజాగా కాశ్మీర్ విషయంలో జోక్యం చేసుకునేందుకు సిద్ధమని ప్రకటించారు. కాశ్మీర్‌‌‌‌ సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వం నిర్వహించేందుకు సిద్ధమని నెల కిందట కామెంట్ చేశారు. అప్పట్లో ఘాటుగా స్పందించిన ఇండియా.. మూడో వ్యక్తి జోక్యం అవసరం లేదని, కాశ్మీర్ తమ అంతర్గత వ్యవహారమని స్పష్టంగా తెగేసి చెప్పింది. కానీ ట్రంప్ మాత్రం మధ్యవర్తిత్వానికి రెడీ అని మరోసారి చెప్పారు.
* పాకిస్థాన్ నీళ్ల జగడం
కాశ్మీర్ విషయంలో ఎక్కడా తనకు సపోర్ట్ రాకపోయేసరికి… పాకిస్థాన్ కొత్తగా నీళ్ల తగాదాకి దిగింది. దాదాపు 60 ఏళ్ల క్రితం కుదిరిన ఇండస్ వాటర్ ఒప్పందాన్ని ఇండియా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తోంది. ప్రపంచంలో ఎక్కడైనా దిగువకు నీళ్లు వదలడం లేదన్నదే పెద్ద వివాదం. చిత్రంగా పాకిస్థాన్ మాత్రం మాకు చెప్పకుండా నీళ్లు వదుల్తున్నారని గొడవ పెడుతోంది. మన దగ్గరున్నట్లుగా వాటర్ మేనేజ్మెంట్ ఆ దేశంలో లేదు. ఒప్పందం కింద దక్కిన వాటాలో 60 శాతం నీళ్లు వృధాగా అరేబియా సముద్రంలోకి వెళ్తున్నాయి.
* చట్ట ప్రకారమే చిదంబరం అరెస్టు : కిషన్ రెడ్డి
చట్ట ప్రకారమే మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ నేత పి.చిదంబరం అరెస్టు జరిగిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. చిదంబరం అరెస్టు వెనుక బిజెపి పాత్ర గానీ, కేంద్ర ప్రభుత్వం పాత్ర గానీ లేదని ఆయన తేల్చి చెప్పారు.
గురువారం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరాన్ని సిబిఐ బుధవారం రాత్రి అరెస్టు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఐఎన్ఎక్స్ మీడియా విదేశాల నుంచి పెట్టుబడులు పొందేందుకు చిదంబరం సహకరించి, ముడుపులు తీసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో చిదంబరంపై సిబిఐ, ఇడిలు కేసులు నమోదు చేశాయి.
అయితే చిదంబరం విషయంలో చట్టం తన పని తాను చేసుకెళుతుందని, ఆయన విషయంలో కోర్టులు నిర్ణయం తీసుకుంటాయే తప్ప ప్రభుత్వం, బిజెపి కాదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
* అప్పట్లో అమిత్ షా.. ఇప్పుడు చిదంబరం
సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. అప్పట్లో అమిత్ షా.. ఇప్పుడు చిదంబరం. పేర్లు మాత్రమే వేరు.. మిగతాదంతా సేమ్ టు సేమ్. తొమ్మిదేళ్ల క్రితం తన అరెస్ట్ కు ప్రతిగానే ఇప్పుడు చిదంబరం అరెస్ట్ జరిగిందా..? రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఇవే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పొలిటికల్ పిక్చర్ లో అన్ని సాధ్యమే. ఆసక్తికర ట్విస్టులు, పగతీర్చుకునే ఉద్రిక్త సన్నివేశాలు, పతనం శాసించే ఘట్టాలకు కొదువ ఉండదు. అధికారంలో ఎవరు ఉంటే వాళ్లే రింగ్ మాస్టర్. ఆడించినట్టు ఆడాల్సి అవసరం వస్తుంది. గతంలో కేంద్ర హోంమంత్రిగా పవర్ పాలిటిక్స్ తనదైన వేలో నడిపించిన చిదంబరం.. తాను సంధించిన సీబీఐ ఆస్త్రం రివర్స్‌ అయి ఇప్పుడు తననే బందీని చేసింది. అప్పట్లో అమిత్ షా మీదకు సీబీఐని ఉసిగొల్పగా.. ఇప్పుడు కేసుల రూపంలో అది చిదంబరం మెడకే చుట్టుకుంది.INX ముడుపుల కేసులో ఇంద్రాణి ముఖర్జీ అప్రూవర్ గా మారినప్పుడే చిదంబరం భవిష్యత్తు డిసైడ్ అయ్యింది. అంతలా చిదంబరాన్ని కేంద్రం టార్గెట్ చేయటం వెనక అమిత్ షా రీవేంజ్ ఉందనే ఆరోపణలు ఉన్నాయి. తొమ్మిదేళ్ల క్రితం కేంద్ర హోం మంత్రిగా ఉన్న చిదంబరం.. గుజరాత్ హోంమంత్రిగా ఉన్న అమిత్ షాను అరెస్ట్ చేయించారు. అదే కసితో చిదంబరాన్ని కూడా అరెస్ట్ చేయించారనే ప్రచారం జరుగుతోంది.
* కేసీఆర్‌ నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వడం లేదు – ఉత్తమ్‌
తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్సేనని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా దేవరకొండలో నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఉత్తమ్‌ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సీనియర్‌ నేత జానారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాలునాయక్‌తోపాటు పలువురు హస్తం నేతలు హాజరయ్యారు. తెలంగాణలో బీజేపీ ఎప్పటికీ బలపడదని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. గత ఐదేళ్లలో తెలంగాణకు బీజేపీ చేసిందేమీలేదన్నారు. 2023లో టీఆర్‌ఎస్‌ను ఓడిస్తామని ఉత్తమ్‌ ప్రకటించారు. కేసీఆర్‌ అసమర్థత వల్లే గిరిజనులకు రిజర్వేషన్లు అమలు కావడంలేదని విమర్శించారు. కేసీఆర్‌ ఇప్పటివరకు ఏ ప్రాజెక్టులు పూర్తిచేశారో చెప్పాలని ఉత్తమ్‌ డిమాండ్ చేశారు. కాళేశ్వరం, మిషన్‌ భగీరథ, కాకతీయ కమీషన్ల కోసమేనని విమర్శించారు. మళ్లీ అధికారంలోకి రాగానే నిరుద్యోగ భృతి ఇస్తానన్న కేసీఆర్‌.. ఎందుకు ఇవ్వడం లేదని ఉత్తమ్‌ ప్రశ్నించారు.
*సీఎంకు చేతనైతే అవినీతిని అరికట్టాలి
అవినీతిరహితంగా తెలంగాణ ఉండాలంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఐదేళ్ల పాలనలో ఆ పని ఎందుకు చేయలేకపోయారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ప్రశ్నించారు. ఇన్నాళ్లు తన వ్యవసాయక్షేత్రంలో నిద్రపోయిన ముఖ్యమంత్రి.. అవినీతి జరుగుతోందని ఎట్టకేలకు ఒప్పుకోవడం సంతోషకరమన్నారు. బుధవారమిక్కడ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై భాజపా ప్రశ్నిస్తే ప్రభుత్వం ఎదురుదాడి చేసిందన్నారు.
*అక్టోబరులో హుజూర్నగర్ ఉపఎన్నిక!
హుజూర్నగర్ శాసనసభ నియోజకవర్గానికి అక్టోబరులో ఉపఎన్నిక జరిగే అవకాశముందని టీపీసీసీ అధ్యక్షుడు, నల్గొండ ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. బుధవారం నల్గొండ జిల్లా దేవరకొండలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉప ఎన్నికలో పోలీసులు అధికార తెరాసకు అనుకూలంగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అవినీతి పాలన కొనసాగిస్తూ వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని, దీనిపై కేంద్ర ప్రభుత్వం సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డిని కార్యకర్తలు గజమాలతో ఘనంగా సన్మానించారు.
*మండల్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలి
ఓబీసీల అభ్యున్నతి కోసం మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని వక్తలు డిమాండ్ చేశారు. ఓబీసీల సమస్యల పరిష్కారంపై వెనుకబడిన తరగతుల సాధికార సంఘం (బీసీసీఈ), అఖిల భారత వెనుకబడిన తరగతుల సమాఖ్య (ఏఐబీసీఎఫ్) సంయుక్తాధ్వర్యంలో దిల్లీలో బుధవారం రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇందులో కేంద్ర మాజీ మంత్రి శరద్యాదవ్ మాట్లాడుతూ.. ఓబీసీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిన్న చూపు చూస్తున్నాయన్నారు.
*కాంగ్రెస్ను వీడే యోచనలో మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్సాగర్రావు
మాజీ ఎమ్మెల్సీ, ఏఐసీసీ సభ్యుడు కొక్కిరాల ప్రేమ్సాగర్రావు కాంగ్రెస్ను వీడే యోచనలో ఉన్నారు. లోక్సభ ఎన్నికల అనంతరం నుంచే తెరాస, భాజపా నాయకులు ఆయనతో మంతనాలు జరుపుతుండగా కాంగ్రెస్ను వీడేది లేదంటూ వారికి చెబుతూ వచ్చారు. ప్రస్తుతం ఆయన మనసు మార్చుకున్నట్లు తెలిసింది. మంగళవారం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే శ్రీధర్బాబు హైదరాబాద్లోని ప్రేమ్సాగర్రావు నివాసానికి వెళ్లి పార్టీని వీడవద్దంటూ కోరగా కాంగ్రెస్లో కొనసాగలేనని ఆయన తేల్చిచెప్పినట్లు సమాచారం.
*సీఎంకు చేతనైతే అవినీతిని అరికట్టాలి
అవినీతిరహితంగా తెలంగాణ ఉండాలంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఐదేళ్ల పాలనలో ఆ పని ఎందుకు చేయలేకపోయారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ప్రశ్నించారు. ఇన్నాళ్లు తన వ్యవసాయక్షేత్రంలో నిద్రపోయిన ముఖ్యమంత్రి.. అవినీతి జరుగుతోందని ఎట్టకేలకు ఒప్పుకోవడం సంతోషకరమన్నారు. బుధవారమిక్కడ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై భాజపా ప్రశ్నిస్తే ప్రభుత్వం ఎదురుదాడి చేసిందన్నారు. కలెక్టర్ల సదస్సులో సీఎం వ్యాఖ్యలు చూస్తుంటే.. అవినీతి మరకను అధికారులకు రుద్దేసి చేతులు దులుపుకోవాలని ప్రయత్నిస్తున్నట్లుందని అన్నారు.
*భాజపాకు అదనపు బలం -లక్ష్యాన్ని మించిన సభ్యత్వ నమోదు
కమల దళంలో 3.78 కోట్ల మంది కొత్తగా చేరారు. భాజపా జులై 6 నుంచి నిర్వహిస్తున్న సభ్యత్వ నమోదు కార్యక్రమం మంగళవారం ముగిసింది. కొత్తగా 3,78,67,753 మందికి సభ్యత్వం కల్పించారు. 11 కోట్ల మందికి సభ్యత్వం ఉన్నట్లు పార్టీ చెబుతుండగా, దీనికి 20 శాతం (2.2 కోట్లు) అదనంగా చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అనుకున్న లక్ష్యానికి మించి 1.6 కోట్ల మందిని అదనంగా భాజపా ఛత్రఛాయలోకి తీసుకొచ్చారు.
*కక్ష సాధింపుతోనే ఈ బురద: కోడెల
‘తెలుగుదేశం పార్టీలో చేరిన వైకాపా ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని గతంలో సభాపతిగా ఉన్న నన్ను అప్పటి ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అడిగారు. ఆ పని చేయలేదన్న కక్షతోనే ఇప్పుడు నాపై బురద జల్లుతున్నారు..’ అని శాసనసభ మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు విమర్శించారు. హైదరాబాద్లోని పాత అసెంబ్లీ స్పీకర్ కార్యాలయంలోని ఫర్నిచర్ వ్యవహారంలో అధికార పార్టీ నేతలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. గుంటూరులో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘పార్టీలు మారిన ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయలేదన్న అక్కసుతోనే ఇదంతా చేస్తున్నారు. శాసనసభను దేవాలయంగా భావించి పూజారిలా పని చేశా. చిత్తశుద్ధితో బాధ్యతలు నిర్వర్తించా. ఫర్నిచర్ తీసుకువెళ్లాలని, లేదంటే డబ్బు చెల్లిస్తానని అసెంబ్లీ కార్యదర్శికి జూన్ 6, 7 తేదీల్లోనే ఉత్తరాలు రాశాను. విషయాన్ని స్పీకర్ దృష్టికి సైతం తీసుకువెళ్లా’.. అని గుర్తుచేశారు.
*రేషన్ కార్డుల తొలగింపునకు ఎత్తుగడ: లోకేశ్
రేషన్ కార్డుల తొలగింపునకు ప్రభుత్వం ఎత్తుగడలు వేస్తోందని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. మంగళగిరి నియోజకవర్గ తెదేపా కార్యాలయంలో కార్యకర్తలు, నాయకులతో బుధవారం ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. వైకాపా ప్రభుత్వం అన్నక్యాంటీన్లు మూసేసి నిరుపేదలకు అన్యాయం చేసిందని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా వాటిని వెంటనే తెరవాలని డిమాండ్ చేశారు. పాలన లోపాలను కప్పిపుచ్చుకోవడానికి తెదేపాపై రోజుకో ఆరోపణ చేస్తున్నారన్నారు. తెదేపా కార్యకర్తలపై దాడులు చేస్తే సహించేది లేదన్నారు. వరద బాధితులను ఆదుకోవటంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు.