DailyDose

ఆటోమొబైల్‌ పరిశ్రమకు భారీ ఊరట-వాణిజ్య-08/22

Indian Automobile Industry Receives Support-Telugu Business News-08/22

* దేశీయ ఆటో పరిశ్రమకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శుభవార్త చెప్పారు. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్పిడికి ఎలాంటి గడువు లేదని తేల్చి చెప్పారు. ఇ-వాహనాల పరివర్తన సహజంగా జరుగుతుందని స్పష్టం్ చేశారు. దాదాపు ఏడాది కాలంగా మందగమనంలో విలవిల్లాడుతూ, విక్రయాలు 19ఏళ్ల గరిష్ఠానికి పడిపోయిన నేపథ్యంలో ఆటోమొబైల్ పరిశ్రమ వర్గాలుకు గడ్కరీ ప్రకటన భారీ ఊరటనివ్వనుంది.
* దేశీయ కరెన్సీ రూపాయి బలహీనత కొనసాగుతోంది. డాలరు మారకంలో ఆరంభంలోనే 17పైసలు నష్టపోయిన రూపాయి మిడ్‌ సెషన్‌ తరువాత ఈ ఏడాదిలో అత్యంత కనిష్టాన్ని నమోదు చేసింది. 37 పైసలు నష్టపోయి 71.92 స్థాయికి చేరింది. ప్రస్తుతం 71.97 వద్ద కొనసాగుతూ రూపాయి 72 స్థాయి దిశగా కదులుతోంది. ఇతర కరెన్సీలతో పోలిస్తే డాలరు బలం, చములు ధరల క్షీణత, దేశీయ ఈక్విటీ మార్కెట్ల పతనం రూపాయ రికార్డు పతనానికి కారణమని ట్రేడరు చెబుతున్నారు. అటు దేశీయ స్టాక్‌మార్కెట్లు 440 పాయింట్లకు పైగా కుదేలయ్యాయి. బ్యాంకింగ్‌, ఆటో, రియల్టీ షేర్లలో అమ్మకాలుకొనసాగుతున్నాయి.
* టూ వీలర్ బైక్‌లంటే ఇష్టం వుండే వారికోసం హీరో సంస్థ మార్కెట్లోకి లిథియం బ్యాటరీతో నడిచే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసింది. ఆప్లిమా ఈఆర్, ఎన్‌వైఎక్స్ ఈఆర్ పేరిట వీటిని మార్కెట్‌లోకి తీసుకు వచ్చింది. వీటి ధరలను వరుసగా రూ.68,721, రూ.69,754గా నిర్ణయించినట్లు కంపెనీ సీఈవో సోహిందర్ గిల్ వెల్లడించారు.
* క్లాస్మేట్ బ్రాండ్పై నోట్ పుస్తకాలను విక్రయించే ఐటీసీ సంస్థ, మరింత ఆకర్షణీయంగా 3డీ కవర్తో పల్స్ 3డీ నోట్బుక్స్లను విపణిలోకి విడుదల చేసినట్లు ఐటీసీ విద్య, స్టేషనరీ విభాగాల చీఫ్ ఎగ్జిక్యూటివ్ శైలేంద్ర త్యాగి చెప్పారు.
*ఆర్థిక మందగమనం సెగ సూచీలను కిందకు లాగుతోంది. వరుసగా రెండో రోజూ సూచీలు డీలా పడ్డాయి. అంతర్జాతీయంగానూ పరిస్థితులు అంతంత మాత్రమే ఉండటంతో దేశీయ మార్కెట్లపై మదుపర్లలో విశ్వాసం రోజురోజుకూ సన్నగిల్లుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
*ప్రపంచ స్థాయి కారును భారత్ నుంచి ఉత్పత్తి చేస్తున్నందుకు గర్వపడుతున్నామని కియా మోటార్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కూక్యున్ షిమ్ అన్నారు. తమ మధ్య శ్రేణి ఎస్యూవీ సెల్టోస్ వాహన రంగంలో ఒక ప్రామాణికంగా మారుతుందని పేర్కొన్నారు.
*క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల ద్వారా తరచూ చేసే లావాదేవీల (రికరింగ్ ట్రాన్సాక్షన్స్)పై ఇ-మాండేట్ ప్రక్రియకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) అనుమతులు ఇచ్చింది. అయితే రూ.2000ను గరిష్ఠ పరిమితిగా నిర్ణయించింది.
*పార్లే-జి 10,000 మంది వరకు ఉద్యోగులను తొలగించే అవకాశం కనిపిస్తోంది. ఆర్థిక వ్యవస్థ మందగమనం ప్రభావంతో బిస్కెట్ల అమ్మకాలు తగ్గడం ఇందుకు ప్రధాన కారణం. ముఖ్యంగా పార్లే-జికి ఎంతో కీలకమైన గ్రామీణ ప్రాంతాల్లో బిస్కెట్ల అమ్మకాలు గణనీయంగా క్షీణించడం వల్ల ఉత్పత్తిని తగ్గించుకోనున్నట్లు పార్లే విభాగ అధిపతి మయాంక్ షా వెల్లడించారు.
*చిన్న కార్ల విభాగంలో తిరుగులేని మారుతీ సుజుకీ.. పెద్ద కార్లతోనూ దుమ్మురేపేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా బుధవారం బహుళ వినియోగ వాహనం (ఎంపీవీ) ‘ఎక్స్ఎల్6’ కారును విపణిలోకి తీసుకొచ్చింది.