Movies

రాతిరి చదువులు

Puja Hegde Is Awake All Night Trying To Read Dialogues

కథానాయికల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. పర భాష నుంచి వస్తారు కదా, ముందు తెలుగు నేర్చుకోవాలి. హీరోలతో పాటు పోటీ పడుతూ డైలాగులు చెప్పాలి. వాళ్లతో సమానంగా స్టెప్పులు కూడా వేయాలి. దానికి తగ్గట్టే కథానాయికలు శ్రమిస్తున్నారు. డ్యాన్సులు ముందుగానే ప్రాక్టీస్ చేసేస్తున్నారు. సెట్కి రాకముందే డైలాగులు బట్టీ పట్టేస్తున్నారు. పూజా హెగ్డే కూడా ఈ జాబితాలో ఉంటుంది. ‘‘ఎన్టీఆర్, మహేష్, అల్లు అర్జున్.. ఇలాంటి స్టార్ కథానాయకులతో పనిచేసే అవకాశం నాకు తొలి రోజుల్లోనే దక్కింది. వీళ్లు మామూలు కథానాయకులు కాదు. డైలాగులు చెప్పడంలో దిట్ట. చుట్టూ ఉన్నవాళ్లు ఏమాత్రం అలసత్వం చూపించినా సెట్లో దొరికిపోతారు. అందుకే నా వరకూ నేను జాగ్రత్తగానే ఉంటాను. ‘నా డైలాగులు ముందే ఇచ్చేయాలి’ అని దర్శకులకు చెప్పేస్తుంటాను. రాత్రంతా డైలాగులు చదువుతూ కూర్చుంటాను. లేకపోతే మన హీరోల్ని అందుకోవడం కష్టం. ఈ హోమ్వర్క్ నాకు ఉపయోగపడింది. తెలుగు తొందరగా నేర్చుకోగలిగా’’ అంది పూజ.