Health

బియ్యం కడిగిన నీటితో స్నానం చేస్తే చర్మం మెరుస్తుంది

Taking bath with rice washed water will enhance skin glow

బియ్యం కడిగిన నీటిని పులియబెట్టి… పలు సమస్యలకు వాడటం పురాతన కాలం నుంచీ వస్తున్నదే. ఈ నీటిని ఉపయోగించడం వల్ల కలిగే లాభాలేంటో చూద్దామా…
* బియ్యం కడిగిన నీటిని పులియబెట్టినప్పుడు అందులో బి విటమిన్లు తయారవుతాయి. దీనికి ఇతర పదార్థాలు కలిపి తీసుకుంటే తక్షణ శక్తి అందుతుంది. పేగుల ఆరోగ్యానికి, మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందడానికి, మెటబాలిజం పెరగడానికి తోడ్పడుతుంది.
* ఈ నీటితో స్నానం చేస్తే మృత కణాలు పోవడంతోపాటు చర్మం మెరుస్తుంది. దురద వల్ల వచ్చే మంటా తగ్గుతుంది. ఈ నీరు సహజ మాయిశ్చరైజర్‌గానూ పని చేస్తుంది. రోజూ దీంతో ముఖం కడుగుతూ ఉంటే మొటిమలు, మచ్చలు తగ్గుముఖం పడతాయి.
* కప్పు బియ్యం కడిగిన నీటిలో ఒక చెంచా తేనె, కొన్ని చుక్కల లావెండర్‌ నూనె కలిపి జుట్టుకు రాసుకోవాలి. పావు గంట తరువాత కడిగేసుకుంటే జుట్టు పట్టులా మెరుస్తుంది. దీన్ని నేరుగా తలకు పట్టించి మర్దన చేసుకున్నా ప్రయోజనం ఉంటుంది. దీంట్లో ఉండే బయోటిన్‌ జుట్టు ఒత్తుగా పెరగడానికి ఉపయోగపడుతుంది.
* ఈ నీటిలో ఉండే విటమిన్‌ బి3, ఇ, యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు రంగు మారడాన్ని నిరోధించడంతో పాటు తేమను అందిస్తాయి. చివర్లు చిట్లకుండానూ ఉంటాయి.