DailyDose

డెక్కన్ క్రానికల్‌లో ఈడీ సోదాలు-వాణిజ్యం-08/23

ED Raids Deccon Chronicle Offices-Telugu Business News Today-08/23

*బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని తిరిగి చెల్లించని కేసులో డెక్కన్‌ క్రానికల్‌ హోల్డింగ్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ కార్యాలయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు. సికింద్రాబాద్‌, ఢిల్లీలలో ఉన్న ఆ సంస్థ కార్యాలయాల్లో సోదాలు జరిగాయి. 2006 నుంచి 2012 వరకూ వివిధ బ్యాంకుల నుంచి రూ.1200 కోట్లు రుణాలు తీసుకొని ఎగ్గొట్టిన ఆరోపణలపై డెక్కన్‌ క్రానికల్‌ సంస్థపై అప్పట్లో సీబీఐ కేసులు నమోదు చేసింది.
* స్వల్ప లాభాల్లో సూచీలు నమోదవుతున్నాయి. సెన్సెక్స్‌ 67 పాయింట్లు పెరిగి 36,539.84 వద్ద ట్రేడవుతోంది.
నిఫ్టీ 28 పాయింట్ల లాభంతో 10,770.20 వద్ద కొనసాగుతోంది. వేదాంత, కోల్‌ ఇండియా, విప్రో ఎస్‌ బ్యాంకు కంపెనీల షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి. ఐసిసిఐ బ్యాంక్‌, సిప్లా, మారుతీ సుజుకి, టైటాన్‌ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 8 ఏళ్ల కనిష్టానికి చేరి రూ.71.81 గా నమోదైంది.
*ప్రీమియం ప్లే స్కూళ్ల సంస్థ కంగారూ కిడ్స్ ఎడ్యుకేషన్ ఏడాదిలో 15-20 కొత్త పాఠశాలలను ఏర్పాటు చేసేందుకు సిద్ధపడుతోంది.
*బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని తిరిగి చెల్లించని కేసులో డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ ప్రైవేటు లిమిటెడ్ కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు.
*బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని తిరిగి చెల్లించని కేసులో డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ ప్రైవేటు లిమిటెడ్ కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు.
*ఎన్ఎండీసీకి కర్ణాటకలోని ఇనుప గనుల లీజు విషయంలో ఊరట లభించింది. కేంద్ర గనుల మంత్రిత్వ శాఖలోని ట్రైబ్యునల్ తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని కర్ణాటక ప్రభుత్వానికి సూచించింది.
*దేశంలో గతంతో పోలిస్తే వృద్ధి రేటు తగ్గినప్పటికీ ఆర్థిక మాంద్యం వచ్చేసిందని ఇప్పుడే స్పష్టంగా చెప్పలేమని కోటక్ మహీంద్రా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ హర్షా ఉపాధ్యాయ పేర్కొన్నారు.
*దక్షిణకొరియా సంస్థ కియా మోటార్స్, ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం ప్లాంటులో తయారు చేసిన మధ్యశ్రేణి స్పోర్ట్స్ వినియోగ వాహనం (ఎస్యూవీ) సెల్టోస్ను గురువారం ఇక్కడ విపణిలోకి విడుదల చేసింది.
*పరుపులను తయారు చేసే సెంచురీ మ్యాట్రెసెస్ తన ప్రచారకర్తగా టెన్నిస్ తార సానియా మిర్జాను నియమించుకుంది. గత ఏడాదికాలంగా సానియా ఈ సంస్థకు ప్రచార కర్తగా వ్యవహరిస్తున్నారు.