DailyDose

ఇమ్రాన్‌కు షాక్…బ్లాక్‌లిస్ట్‌లో పాక్-రాజకీయ–08/23

Imran Khan Shocked By UNO-Telugu Political News Today-08/23-ఇమ్రాన్‌కు షాక్...బ్లాక్‌లిస్ట్‌లో పాక్-రాజకీయ–08/23

* ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోన్న దాయాది దేశం పాకిస్తాన్‌కు అంతర్జాతీయంగా మరో ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్తాన్‌ కేంద్రంగా పనిచేస్తోన్న తీవ్రవాద సంస్థలకు నిధుల సరఫరాను నివారించడంలో విఫలమైనందుకు ఫినాన్షియల్‌ యాక్షషన్‌ టాస్క్‌ ఫోర్స్‌ (ఎఫ్‌ఏటీఎఫ్‌) పాక్‌కు భారీ షాకిచ్చింది. ఉగ్రవాదులకు నిధులను సమకూరుస్తున్నందున పాకిస్తాన్‌ను బ్లాక్‌ లిస్ట్‌లో పెడుతున్నట్లు ఎఫ్‌ఏటీఎఫ్‌ శుక్రవారం ప్రకటించింది. ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రాలో సమావేశమైన కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఉగ్రవాద సంస్థలపై చర్యలకు 11 అంశాలను పాక్‌కు వివరించామని, వాటిలో ఏ ఒక్కటీ ఇమ్రాన్‌ ప్రభుత్వం పాటించలేదని సంస్థ పేర్కొంది. 26/11 ముంబై పేలుళ్ల నిందితుడు హఫీజ్ సయీద్ సహా పలు పాక్ ప్రేరేపిత ఉగ్రమూకలకు పాకిస్తాన్ కొమ్ముకాస్తోందంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
* వైకాపా కార్యాలయంలోని వ్యక్తే దొంగిలించాడు: కోడెల
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని తన నివాసంలో కంప్యూటర్ల చోరీ విషయమై ఏపీ మాజీ సభాపతి కోడెల స్పందించారు. తన నివాసంలోని ప్రభుత్వ ఫర్నిచర్‌ దుర్వినియోగం అవుతోందంటూ వస్తున్న వార్తలను ఖండించారు. గుంటూరు వైకాపా కార్యాలయంలో పని చేసే వ్యక్తే తన నివాసంలోని కంప్యూటర్ల చోరీకి పాల్పడినట్లు ఆయన తెలిపారు. ఈ విషయమై డీఎస్పీతో మాట్లాడానని, సదరు వ్యక్తి తన ఇంట్లోని కంప్యూటర్‌ పరికరాలను ఎందుకు తీసుకెళ్లాడో, అతడి వెనుక ఎవరున్నారో తనకు తెలియాలని అన్నారు. తనపై కక్షతోనే అధికార పక్షం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. దీనిని ఓ దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. అసెంబ్లీలో ప్రతి వస్తువుకు లెక్క ఉంటుందని చెప్పారు. కొందరు వ్యక్తులు మీడియా సంస్థలు ఫర్నిచర్‌ చోరీ, దుర్వినియోగం అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఒక్క తప్పుకూడా చేయలేదని ముందే చెప్పానని, ఫర్నిచర్‌కు సంబంధించిన అన్ని వివరాలు తన వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు.
* అమరావతిని కదిలించొద్దు!-భాజపా అధ్యక్షుడు కన్నాకు రైతుల విజ్ఞప్తి
ఆంధ్రప్రదేశ్‌ రాజధానిని మార్చేస్తారంటూ పలు ఊహాగానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అమరావతి రాజధాని ప్రాంతరైతులు భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను కలిశారు. గత ప్రభుత్వం అడిగితేనే తమ భూములు ఇచ్చామని, ప్రభుత్వం మారిన తర్వాత ఇబ్బందులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయని వాపోయారు. రాజధానిలో పనులు పూర్తిగా ఆగిపోయాయని, భూములిచ్చిన రైతులకు ఇప్పుడు కౌలు కూడా ఇవ్వడం లేదని ఆయన దగ్గర వాపోయారు. సీఆర్‌డీఏ అధికారులను కలిసినప్పటికీ వాళ్లు ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదని కన్నా దృష్టికి తీసుకెళ్లారు.రాజధాని అమరావతిని మార్చకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.
*ఈ ఎమ్మెల్యే జీతం తీసుకోరు
తాజాగా యూపీ మంత్రివర్గంలో కొలువుదీరిన రవీంద్ర జైశ్వాల్కు ఓ ప్రత్యేకత ఉంది. వారణాసి (ఉత్తర) అసెంబ్లీ స్థానం నుంచి 2012, 2017ల్లో గెలుపొందిన ఈ భాజపా ఎమ్మెల్యే ఇంతవరకు జీతం తీసుకోలేదు. సంపన్న కుటుంబానికి చెందిన ఆయనకు సచ్ఛీలుడుగా కూడా పేరుంది. అభివృద్ధికి తన సొంత నిధులను కూడా వినియోగిస్తుంటారు. తన నియోజకవర్గంలో విద్యుత్తు స్తంభాలను, సౌరశక్తి లైట్లను ఏర్పాటు చేయించారు.
*పార్టీ కార్యాలయాలు వెలవెల..
రాజకీయ నాయకులను నిర్బంధంలో ఉంచడంతో శ్రీనగర్లోని ప్రధాన పార్టీల కార్యాలయాలు బోసిపోతున్నాయి. కాపలాదారులు తప్ప నేతలు, కార్యకర్తలు, సందర్శుకులెవరూ కనిపించడం లేదు. నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, పీపుల్స్ కాన్ఫరెన్స్, జేకే పీపుల్స్ మూమెంట్.. అన్ని పార్టీల కార్యాలయాల వద్ద ఇదే పరిస్థితి కనిపిస్తోంది. 370 అధికరణాన్ని తొలగించిన తర్వాత ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, వహీద్ ఉర్ రెహమాన్ పారా, సాజద్ లోన్ వంటి ప్రధాన నేతలను నిర్బంధంలో ఉంచారు. మరికొన్ని రోజులు ఈ నిర్బంధం కొనసాగించనున్నట్లు సమాచారం.
*పోలవరంపై ప్రయోగాలు వద్దంటూనే ఉన్నాం
‘పోలవరంపై ప్రయోగాలు వద్దని మేము ముందు నుంచి చెబుతూనే ఉన్నాం. అయినప్పటికీ జగన్మోహన్రెడ్డి మూర్ఖంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు’ అని తెదేపా అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. గుంటూరులోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘పోలవరంపై ప్రభుత్వం ఇప్పుడేం చెబుతుంది? ఈ జాప్యం ఇక్కడితో ఆగదు. ప్రాజెక్టుపై పడుతుంది. వైకాపా ప్రభుత్వానికి పిచ్చి అనుకోవాలో, ఏపికి పట్టిన శని అనుకోవాలో అర్థం కావడం లేదు’ అని విమర్శించారు. ‘ఓ వైపు కేంద్రం చెబుతున్నా, ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి అర్థం కావడం లేదు. లేని అవినీతిని నిరూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. రివర్స్ టెండర్ల వల్ల నష్టమే తప్ప ఒరిగేదేమీ ఉండదు’ అని పేర్కొన్నారు. టెండర్ల విషయంలో కేంద్ర మంత్రి గడ్కరీ ఎన్నోసార్లు వద్దని చెప్పారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
*భద్రాద్రిలో ఎమ్మార్పీఎస్ జాతీయ సమావేశాలు ప్రారంభం
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఎమ్మార్పీఎస్) జాతీయ కార్యవర్గ సమావేశాలు గురువారం భద్రాచలంలో ప్రారంభమయ్యాయి. జిల్లా నేతలు తమ ప్రాంతంలో ఎమ్మార్పీఎస్ ప్రగతి గురించి వివరించారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఎంతటి త్యాగాలకైనా సిద్ధమని తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఒకరోజు ముందుగానే భద్రాచలం చేరుకున్న ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ కాలికి గాయమైంది. ఉదయం నడుస్తుండగా కాలికి గాయం కావడంతో ఆసుపత్రిలో చేర్పించారు. సాయంత్రం కార్యకర్తలనుద్దేశించి మాట్లాడతారని భావించినప్పటికీ కాలి నొప్పి ఎక్కువ కావడంతో విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. శుక్రవారం ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసే అవకాశం ఉంది.
*పోలవరంపై ప్రయోగాలు వద్దంటూనే ఉన్నాం
‘పోలవరంపై ప్రయోగాలు వద్దని మేము ముందు నుంచి చెబుతూనే ఉన్నాం. అయినప్పటికీ జగన్మోహన్రెడ్డి మూర్ఖంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు’ అని తెదేపా అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. గుంటూరులోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘పోలవరంపై ప్రభుత్వం ఇప్పుడేం చెబుతుంది? ఈ జాప్యం ఇక్కడితో ఆగదు. ప్రాజెక్టుపై పడుతుంది. వైకాపా ప్రభుత్వానికి పిచ్చి అనుకోవాలో, ఏపికి పట్టిన శని అనుకోవాలో అర్థం కావడం లేదు’ అని విమర్శించారు. ‘ఓ వైపు కేంద్రం చెబుతున్నా, ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి అర్థం కావడం లేదు. లేని అవినీతిని నిరూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. రివర్స్ టెండర్ల వల్ల నష్టమే తప్ప ఒరిగేదేమీ ఉండదు’ అని పేర్కొన్నారు. టెండర్ల విషయంలో కేంద్ర మంత్రి గడ్కరీ ఎన్నోసార్లు వద్దని చెప్పారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
*చెన్నమనేని పిటిషన్ ఎందుకు పసంహరించుకున్నారు?
భారతీయ పౌరసత్వం కేసు విచారణలో ఉన్న అప్పీల్ పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నారో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్బాబు తెలపాలని కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. దిల్లీలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తప్పుడు పత్రాలతో భారతీయ పౌరసత్వం పొందిన రమేష్బాబు మరింత కాలయాపనకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. గతంలోనే కేంద్ర హోం శాఖ ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ రమేష్బాబు పౌరసత్వం చెల్లదని చెప్పిందని ఆయన పేర్కొన్నారు. రమేష్బాబు హైకోర్టును ఆశ్రయిస్తే మూడు నెలల సమయం ఇచ్చిందని.. మూడు వారాల్లో కేంద్ర హోం శాఖ వద్ద ఇరు వర్గాలు అప్పీలు చేసుకోవాలని సూచించిందని తెలిపారు.
*రుసుములు విడుదల చేయాలి: కృష్ణయ్య
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాలకు డైట్,కాస్మోటిక్స్ రుసుములు, కరెంటు ఛార్జీల బిల్లులను వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావును కోరారు. ఏప్రిల్ నుంచి రూ. 80 కోట్ల మేర బకాయిలు నిలిచిపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.
*రాజీవ్ సంస్మరణకు తరలివచ్చిన కాంగ్రెస్ నేతలు
మాజీ ప్రధానమంత్రి రాజీవ్గాంధీ 75వ జయంతిని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దిల్లీలో సంస్మరణ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షులు రేవంత్రెడ్డి, పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రులు జానారెడ్డి, షబ్బీర్ అలీ, సంభాని చంద్రశేఖర్, గడ్డం ప్రసాద్కుమార్తో పాటు పలువురు మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు హాజరయ్యారు.
*పోలవరంపై నిర్ణయం తీసుకోవాలి: సుజనా
పోలవరంపై కూలంకషంగా చర్చించి నిర్ణయం తీసుకోవాలని కేంద్ర జల్శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్కు భాజపా రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి విజ్ఞప్తి చేశారు. దిల్లీలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రివర్స్ టెండరింగ్పై హైకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రాజెక్టు త్వరితంగా పూర్తయ్యేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
*పోలవరంపై ప్రయోగాలు వద్దంటూనే ఉన్నాం: చంద్రబాబు
‘పోలవరంపై ప్రయోగాలు వద్దని మేము ముందు నుంచి చెబుతూనే ఉన్నాం. అయినప్పటికీ జగన్మోహన్రెడ్డి మూర్ఖంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు’ అని తెదేపా అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. గుంటూరులోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘పోలవరంపై ప్రభుత్వం ఇప్పుడేం చెబుతుంది? ఈ జాప్యం ఇక్కడితో ఆగదు. ప్రాజెక్టుపై పడుతుంది.
*తొందరపాటు నిర్ణయాలపై ముందే హెచ్చరించాం: కన్నా లక్ష్మీనారాయణ
పోలవరంపై తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని తాము ముందే హెచ్చరించామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. విజయవాడ గ్రామీణ మండలం కొత్తూరు తాడేపల్లిలోని గోశాల వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. పోలవరం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అడుగు ముందుకు, నాలుగడుగులు వెనక్కు వేస్తోందని పేర్కొన్నారు. ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కేంద్ర మంత్రి గడ్కరీ బాధ్యత తీసుకుని పాత ధరలకు పనులు చేసేలా గుత్తేదారును ఒప్పించారని వివరించారు. ప్రస్తుతం రివర్స్ టెండరింగ్ వల్ల పలు సమస్యలు ఉత్పన్నమవుతాయని పేర్కొన్నారు.
*తెదేపా నేతలకు ఆనందం ఎందుకో?: మంత్రి కొడాలి
పోలవరం గుత్తేదారుకు హైకోర్టులో మధ్యంతర ఉత్తర్వులు లభిస్తే తెదేపా నాయకులకు ఆనందమెందుకో? అర్థం కావడం లేదని పౌరసరఫరాల మంత్రి కొడాలి శ్రీవేంకటేశ్వరరావు(నాని) విమర్శించారు. మాజీ మంత్రి దేవినేనికి కమీషన్దారు, తెదేపా నాయకుల బంధువు గుత్తేదారుకే పోలవరం కాంట్రాక్టు వచ్చినట్లు తెదేపావారు సంబరాలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. జలవిద్యుత్ కేంద్రం ఏర్పాటు వ్యవహారంలో రివర్స్ టెండర్లను తాత్కాలికంగా ఆపమని న్యాయస్థానం చెప్పిందని వివరించారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఆ ప్రక్రియను ఆపాలని చెప్పిందని, వాళ్లకు కాంట్రాక్టు ఇచ్చేయాలనిగాని, ప్రభుత్వ విధానం తప్పనిగాని ఎక్కడా చెప్పలేదని వెల్లడించారు. రాజధాని అమరావతి విషయంలో మంత్రి బొత్స వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని, తెదేపా నాయకులు విపరీత అర్థాలు తీసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
*మీవల్ల కాకపోతే పీపీఏకు అప్పగించండి: ఎమ్మెల్సీ మాధవ్
పోలవరం నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వానికి చేతకాకపోతే పోలవరం ప్రాజెక్టు ఆథారిటీ (పీపీఏ)కి అప్పగించాలని భాజపా ఎమ్మెల్సీ మాధవ్ సూచించారు. హైకోర్టు తీర్పుతో పోలవరం పనులకు ఆటంకం ఏర్పడుతుందన్నారు. రివర్స్ టెండరింగ్, పీపీఏ విషయంలో కేంద్రం స్పష్టంగా వ్యవహరించినా విజయసాయిరెడ్డి మైండ్గేమ్ ఆడుతూ గందరగోళ వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ ప్రమేయం లేదన్నారు.
*తెదేపా నేతలకు ఆనందం ఎందుకో?: మంత్రి కొడాలి
పోలవరం గుత్తేదారుకు హైకోర్టులో మధ్యంతర ఉత్తర్వులు లభిస్తే తెదేపా నాయకులకు ఆనందమెందుకో? అర్థం కావడం లేదని పౌరసరఫరాల మంత్రి కొడాలి శ్రీవేంకటేశ్వరరావు(నాని) విమర్శించారు. మాజీ మంత్రి దేవినేనికి కమీషన్దారు, తెదేపా నాయకుల బంధువు గుత్తేదారుకే పోలవరం కాంట్రాక్టు వచ్చినట్లు తెదేపావారు సంబరాలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. జలవిద్యుత్ కేంద్రం ఏర్పాటు వ్యవహారంలో రివర్స్ టెండర్లను తాత్కాలికంగా ఆపమని న్యాయస్థానం చెప్పిందని వివరించారు.
*ముంపునకు గత ప్రభుత్వమే కారణం: బొత్స
అమరావతి ముంపునకు గత ప్రభుత్వ నిర్ణయాలే కారణమని పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. గురువారం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మాట్లాడుతూ శివరామకృష్ణ కమిటీ నివేదికను గత ప్రభుత్వం విస్మరించడం వల్లే నేడు రాజధాని ముంపు బారిన పడిందని వివరించారు. చిన్నపాటి వరదకే ఇలాంటి పరిస్థితి తలెత్తితే.. 2009నాటి వరద వస్తే ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోవచ్చని పేర్కొన్నారు.
*విజయసాయిరెడ్డి వ్యాఖ్యల్లో నిజమెంత?: తులసిరెడ్డి
ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్షాల ఆశీస్సులతోనే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి చెబుతున్న మాటల్లో నిజమెంత? అని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు ఎన్.తులసిరెడ్డి ఓ ప్రకటనలో ప్రశ్నించారు.