NRI-NRT

బాధ్యతలు చేపట్టిన ఏపీ ఎన్నార్టీ చైర్మన్ వెంకట్

బాధ్యతలు చేపట్టిన ఏపీ ఎన్నార్టీ చైర్మన్ వెంకట్   - Medapati Venkat Takes Charge As APNRT Chairman

ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రవాస సంఘం (ఏపీఎన్నార్టీ) నూతన అద్యక్షుడిగా ఇటీవల నియమితులైన మేడపాటి వెంకట్ శుక్రవారం నాడు బాధ్యతలు చేపట్టారు. అనంతరం వెంకట్ మాట్లాడుతూ విదేశాల్లో నివసిస్తున్న ప్రవాసాంధ్రులకు అవసరమైన సహాయ సహకారాలను అందించడంతో పాటు వారిని రాష్ట్ర అభివృద్దిలో భాగస్వాములు చేసే విధంగా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఎన్నార్టీ సిఈవో కొడాలి భవాని శంకర్ తదితరులు పాల్గొన్నారు.