DailyDose

మంత్రి బొత్సకు సమన్లు-తాజావార్తలు–08/23

Minister Botsa Summoned-Telugu Breaking News Today-08/23

* దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో జరిగిన ఫోక్స్‌ వ్యాగన్‌ కేసు వ్యవహారంలో ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణకు సమన్లు జారీ అయ్యాయి. హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ కోర్టు బొత్సకు సమన్లు జారీ చేసింది. వచ్చే నెల 12న హాజరుకావాలని బొత్సకు న్యాయస్థానం సూచించింది. వైఎస్‌ సర్కారులో పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న బొత్స.. ఫోక్స్‌ వ్యాగన్‌ కేసులో కీలక సాక్షిగా ఉన్నారు.
* ఏపీ మాజీ శాసన సభాపతి కోడెల శివప్రసాద్ కుటుంబానికి చెందిన హోండా షోరూంలో అసెంబ్లీ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. షోరూంలో అసెంబ్లీ ఫర్నిచర్ ఉందనే సమాచారం మేరకు సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. హైకోర్టు ఆదేశాల మేరకు సీజ్‌ చేసిన షోరూం తాళాలను రవాణాశాఖ అధికారులు తెరిచి తనిఖీ చేశారు. అయితే షోరూంకి వచ్చిన అసెంబ్లీ, రెవెన్యూ అధికారులకు సహకరించేందుకు షోరూం సిబ్బంది నిరాకరించారు. భవనంపైకి వెళ్లేందుకు తమ వద్ద తాళాలు లేవని సిబ్బంది చెప్పడంతో అధికారులు తాళాల కోసం ఎదురుచూస్తున్నారు.
*స్వల్ప లాభాల్లో సూచీలు నమోదవుతున్నాయి. సెన్సెక్స్‌ 67 పాయింట్లు పెరిగి 36,539.84 వద్ద ట్రేడవుతోంది.
నిఫ్టీ 28 పాయింట్ల లాభంతో 10,770.20 వద్ద కొనసాగుతోంది. వేదాంత, కోల్‌ ఇండియా, విప్రో ఎస్‌ బ్యాంకు కంపెనీల షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి. ఐసిసిఐ బ్యాంక్‌, సిప్లా, మారుతీ సుజుకి, టైటాన్‌ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
* ఈ కామర్స్‌ పోర్టల్‌ ‘ భారత్‌ క్రాఫ్ట్‌ ‘ అందుబాటులోకి రావడంతో, వచ్చే 2-3 ఏళ్లలో రూ.10 లక్షల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ చెప్పారు. ‘ భారత్‌ క్రాఫ్ట్‌ దాదాపు అలీబాబా, అమెజాన్‌ తరహాలో ఉండనుంది. చిన్న, మధ్య తరహా సంస్థలు తమ ఉత్పత్తులను విక్రయించడానికి ఇది ఫ్లాట్‌ ఫాం గా ఉపయోగపడుతుంది. ‘ అని గడ్కరీ పేర్కొన్నారు. ఎంఎస్‌ఎంఈ రంగానికి సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
* జెట్‌ ఎయిర్‌వేస్‌ వ్యవస్థాపకుడు నరేశ్‌ గోయల్‌ నివాసంలో ఈడీ సోదాలు జరిపింది. ముంబయి, దిల్లీలోని ఆయన నివాసాల్లో, కార్యాలయాల్లో దాడులు చేసింది.
* చైనాలో జనాభా మళ్లీ పెరుగుతోంది. ‘వన్‌‌‌‌ చైల్డ్‌‌‌‌’ పాలసీని ఆ దేశం రద్దు చేసిన 18 నెలల్లో మామూలు కన్నా 54 లక్షల మంది పిల్లలు ఎక్కువ పుట్టినట్టు సర్వేలు చెబుతున్నాయి. ఏటా పుట్టే 2 కోట్ల మందికన్నా మరో 54 లక్షల మంది ఎక్కువ పుట్టినట్టు పెకింగ్‌‌‌‌ వర్సిటీ సర్వేలో తేలింది.
* విశాఖపట్నం జిల్లా భీమిలిలో ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గెస్ట్‌ హౌస్‌ కూల్చేందుకు జీవీఎంసీ అధికారులు సిద్ధమయ్యారు. ఆ భవనానికి ఎలాంటి అనుమతులు లేవని 24 గంటల్లో కూల్చేస్తామంటూ నోటీసులు జారీ చేశారు. హైకోర్టు స్టే ఇచ్చినా జీవీంఎసీ అధికారులు కూల్చివేతకు సిద్ధమవ్వడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
* కాశ్మీర్‌‌‌‌‌‌‌‌లో ప్రశాంత పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాశ్మీర్‌‌‌‌‌‌‌‌ లోయలో గురువారం చాలా చోట్ల ఆంక్షలు ఎత్తేశారు. శ్రీనగర్‌‌‌‌‌‌‌‌లోని కొన్ని ప్రాంతాల్లో బారికేడ్లను తొలగించారు. ప్రజలు నిత్యావసర సరుకుల కోసం రోడ్లపైకి వచ్చారు. గవర్నమెంట్‌‌‌‌ బస్సు సర్వీసులు ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో ప్రైవేటు క్యాబ్‌‌‌‌లు, ఆటోలపైనే ఆధారపడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం మార్కెట్లు, షాపులు తెరుచుకోలేదు. మొబైల్‌‌‌‌, ఇంటర్నెట్‌‌‌‌ సర్వీసులను వరుసగా18వ రోజు నిలిపేశారు. స్కూళ్లు, గవర్నమెంట్‌‌‌‌ ఆఫీసుల్లో ఫుల్‌‌‌‌ అటెండెన్స్‌ ఉండగా, స్టూడెంట్లు మాత్రం చాలా తక్కువ సంఖ్యలో హాజరయ్యారని అధికారులు చెప్పారు. ఎక్కడా ఎటువంటి గొడవలు జరగలేదన్నారు.
* త్రిపుల్‌ తలాఖ్‌ ఆచారాన్ని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం చేసిన ముస్లిం మహిళల(వివాహ హక్కుల పరిరక్షణ) చట్టం 2019ను సవాల్‌ చేస్తూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. త్రిపుల్ తలాఖ్ ను శిక్షార్హమైన నేరంగా పరిగణించే అంశాన్ని కోర్టు పరిశీలించాల్సిన అవసరం ఉందంటూ పిటిషన్లు దాఖలు చేశారు.
* ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమెరికా పర్యటన ముగిసింది. భారత కాలమానం ప్రకారం ఉదయం 7 గంటలకు ముఖ్యమంత్రి చికాగోనుంచి హైదరాబాద్‌ బయలుదేరారు. రేపు ఉదయం హైదరాబాద్‌ చేరుకోనున్నారు. ఈ నెల 15న అమెరికా బయలుదేరిన ఆయన వారం రోజుల పాటు అక్కడ పర్యటించారు.
* ప్రముఖ పాత్రికేయుడు ఆచంట సుదర్శన్‌రావు శుక్రవారం కన్నుమూశారు. ఈనాడు దిన పత్రికలో 30ఏళ్ల పాటు వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన పాత్రికేయుడిగా 40ఏళ్లకు పైగా సేవలందించారు. ఈనాడు జర్నలిజం పాఠశాల అధ్యాపకుడిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. 1970లో ‘సమతా రచయితల సంఘం’ సాహితీ సంస్థను స్థాపించారు. ఈ సంఘం ద్వారానే సిరివెన్నెల సీతారామశాస్త్రి, ద్వానాశాస్త్రిలు సమాజానికి పరిచయం అయ్యారు. సుదర్శనరావు మృతి పట్ల సాహితీ, పాత్రికేయ వర్గాలు విచారం వ్యక్తం చేశాయి. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపాయి.
* దక్షిణ భారతదేశంలో ఉగ్రదాడులకు కుట్ర జరుగుతోందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. పాకిస్థాన్‌ కేంద్రంగా పనిచేసే లష్కరే తోయిబా ముఠాకు చెందిన ఆరుగురు ఉగ్రవాదులు శ్రీలంక మీదుగా తమిళనాడులోకి చొరబడి కొయంబత్తూర్‌లో దాగి ఉన్నట్లు నిఘా వర్గాలకు సమాచారం రావడంతో రాష్ట్రంలో హెచ్చరికలు జారీ చేశారు.
* దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో జరిగిన ఫోక్స్‌ వ్యాగన్‌ కేసు వ్యవహారంలో ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణకు సమన్లు జారీ అయ్యాయి. హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ కోర్టు బొత్సకు సమన్లు జారీ చేసింది. వచ్చే నెల 12న హాజరుకావాలని బొత్సకు న్యాయస్థానం సూచించింది. అప్పటి పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న బొత్స.. ఫోక్స్‌వ్యాగన్‌ కేసులో సాక్షిగా ఉన్నారు.
* కాశ్మీర్ విషయంలో భారత్ తీసుకున్న నిర్ణయంతో ఉడికిపోతున్న పాక్, లోయలో ఎలాగైనా అల్లకల్లోలం సృష్టించాలని పథక రచన చేస్తోంది. ఇందుకోసం ఉగ్రవాదులను రంగంలోకి దింపాలని యోచిస్తోంది.
* ఉత్తర 24 పరగణ జిల్లాలో శుక్రవారం ఉదయం విషాదం ఘటన చోటు చేసుకుంది. కచువాలోని ఓ ఆలయంలో జరుగుతున్న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు భక్తులు భారీగా హాజరయ్యారు.
* రాజధాని దిల్లీలోని ప్రధాని కార్యాలయంలో ఏపీ రాష్ట్ర అధికారులతో కీలక భేటీ జరిగింది. ప్రధాని అదనపు ప్రిన్సిపల్‌ కార్యదర్శి నృపేంద్ర మిశ్రాతో ఆంధ్రప్రదేశ్‌ అధికారులు సమావేశమయ్యారు.
* కాకినాడ ప్రభుత్వాసుపత్రిని తూర్పుగోదావరి జిల్లా ఇన్ చార్జి మంత్రి ఆళ్ల నాని, మంత్రులు కన్నబాబు, బోసు లు ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. డెంగ్యూ ప్రత్యేక వార్డు ను పరిశీలించి అధికారులకు పలు సూచనలను చేశారు. వార్డులో పర్యటిస్తూ వైద్యసేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. ఒకే పడకపై ఇద్దరేసి రోగులుండడంపై మంత్రి ఆళ్లనాని ఆగ్రహం వ్యక్తం చేశారు…
*ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టయిన కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరాన్ని ఈనెల 26 వరకు సీబీఐ కస్టడీకి న్యాయస్థానం అప్పగించింది. లోతైన దర్యాప్తు కోసం చిదంబరాన్ని అయిదు రోజుల కస్టడీకి అప్పగించాలని సీబీఐ తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేయగా నాలుగురోజుల కస్టడీకి సమ్మతించింది.
*పింఛనుదార్లకు ఊరట కలిగించేలా ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ కీలక నిర్ణయం తీసుకొంది. పింఛను కమ్యుటేషన్ (కొంత మొత్తాన్ని ముందుగానే తీసుకునే) సౌకర్యాన్ని పునరుద్ధరించనుంది. గతంలో ఉన్న ఈ సౌకర్యాన్ని 2009లో రద్దు చేయగా, దానిని తిరిగి అమల్లోకి తీసుకురానుంది.
*చంద్రుడి కక్ష్యలో ప్రతిదశనూ విజయవంతంగా పూర్తి చేసుకుంటున్న చంద్రయాన్-2 మరో కీలక విన్యాసాన్ని చేపట్టింది. బుధవారం చంద్రుడి కక్ష్యలో రెండోదశకు చేరిన చంద్రయాన్-2లోని ఎల్-14 కెమెరా తొలి ఛాయాచిత్రాన్ని తీసింది.
*రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టానికి శ్రీకారం చుట్టేందుకు సమాయత్తమవుతున్న ప్రభుత్వం అదే తడవుగా భూ సంబంధిత వ్యవహారాలన్నీ పూర్తిగా ఆన్లైన్ ద్వారానే పూర్తయ్యే విధానాలు తీసుకురావాలని నిర్ణయించింది.
*ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వ్యవహారం క్రమంగా వేడెక్కుతోంది. అమరావతి అంతా పల్లపు ప్రాంతం కావటంతో అక్కడ నిర్మాణాలకు లక్షకు లక్ష అదనంగా ఖర్చవుతోంది, పైగా అది సురక్షిత ప్రాంతం కాదని కమిటీ ఎప్పుడో చెప్పింది కాబట్టి దీనిపై అన్నీ ఆలోచించే తుది నిర్ణయం తీసుకుంటామంటూ సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ ఇటీవల చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి.
*ప్రజలిచ్చిన అఖండ మెజార్టీ భయానక వాతావరణం సృష్టించడానికో, వ్యవస్థలను విధ్వంసం చేయడానికో కాదని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. పేరు పెట్టకుండానే మోదీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్య చేశారు.
*కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరాన్ని అవమానకర రీతిలో అరెస్టు చేశారని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఈడీలను వ్యక్తిగత కక్షలు తీర్చుకునే విభాగాలుగా మార్చిందని ఆరోపించాయి. అరెస్టుకు నిరసనగా పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ల్లో కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు జరిపారు.
*పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీదేవసేనకు అరుదైన అవకాశం లభించింది. ఈ నెల 25 నుంచి 30 వరకు స్వీడన్లోని స్టాక్హోంలో జరిగే ప్రపంచ నీటి పొదుపు వారోత్సవాల్లో పాల్గొనేందుకు ఆహ్వానం అందింది.
*వైద్యశాలల నుంచి వెలువడే బయో వ్యర్థాల నుంచి జన్యుపదార్థాన్ని వేరు చేసే కేంద్రం దేశంలో మొదటిసారిగా మౌలాలి వద్ద ఏర్పాటైంది. ఈ సమాచారాన్ని బయో సర్వ్ బయో టెక్నాలజీస్ సీఈవో రాము తెలిపారు.
*హృదయసంబంధ లోపాలతో జన్మించే పేదదేశాల పిల్లలకు ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహించే హార్ట్ టు హార్ట్ ఫౌండేషన్కు ప్రవాస భారతీయులు రూ.85 లక్షలు (1.2లక్షల డాలర్లు) విరాళంగా అందించారు. ఫౌండేషన్ తరఫున ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్కు ఈ నిధులను అందజేశారు. అమెరికా క్రికెట్ బోర్డు డైరెక్టర్ వేణుకుమార్ రెడ్డి పిసికె ఆధ్వర్యంలో ఇటీవల అట్లాంటాలో ‘హార్ట్ టు హార్ట్ విత్ సునీల్ గావస్కర్ ’ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో పలువురు ప్రవాస భారతీయులు, క్రికెట్ అభిమానులు పాల్గొన్నారు.
*ముఖ్యమంత్రి కేసీఆర్, డీజీపీ మహేందర్రెడ్డి, మాజీ ఎంపీ కవిత, మాజీ మంత్రి హరీశ్రావు, కేటీఆర్తో పాటు పలువురు మంత్రులు, ప్రముఖులకు కలుషిత జలాల నమూనాలను పార్శిల్ చేసిన వ్యవహారంలో ఎట్టకేలకు సంబంధిత వ్యక్తిని ఉత్తర మండలం టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది.
*వ్యవసాయ పీహెచ్డీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 27, 28 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ సుధీర్కుమార్ తెలిపారు. 27న పీహెచ్డీ, 28న పీజీ కోర్సులకు వర్సిటీ ఆడిటోరియంలో కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. మెరిట్లిస్ట్ను www.pjtsau.ac.in వెబ్సైట్లో పొందుపరిచామన్నారు.
*భాగస్వామ్య పింఛను పథకాన్ని(సీపీఎస్) రద్దు చేసి పాత విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబరు 1న ఫించను విద్రోహ దినంగా పాటించాలని తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్పీసీ) నిర్ణయించింది.
*కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల పుణ్యక్షేత్రంలో ఇటీవల అన్యమత ప్రచారం కలకలం రేపింది. దీన్ని నిరసిస్తూ.. ఆర్టీసీ ఆర్‌ఎం కార్యాలయం ఎదుట బీజేపీ ఆందోళన చేపట్టింది. ఆర్టీసీ టిక్కెట్లపై అన్యమత ప్రకటనలేంటంటూ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అన్యమత ప్రచారం జరగకుండా కఠిన చట్టలు తీసుకురావాలన్నారు.