DailyDose

నేటి ప్రధాన వార్తలు-08/23

Telugu Top News For Today-Aug 23 2019

1. అన్ని వస్తువులకు నా దగ్గర లెక్క ఉంది- కోడెల
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని తన నివాసంలో కంప్యూటర్ల చోరీ విషయమై ఏపీ మాజీ సభాపతి కోడెల స్పందించారు. తన నివాసంలోని ప్రభుత్వ ఫర్నిచర్‌ దుర్వినియోగం అవుతోందంటూ వస్తున్న వార్తలను ఖండించారు. అసెంబ్లీలో ప్రతి వస్తువుకు లెక్క ఉంటుందని చెప్పారు. కొందరు వ్యక్తులు మీడియా సంస్థలు ఫర్నిచర్‌ చోరీ, దుర్వినియోగం అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
2. అమరావతికి అప్పుడు జగన్‌ అంగీకారం- కన్నా
వైపాకా ప్రభుత్వం చెప్పేదానికి, చేసేదానికి పొంతన లేదని భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. రాజధాని అమరావతి నిర్మాణానికి అప్పుడు జగన్‌ అంగీకరించారని గుర్తు చేశారు. తనను కలిసేందుకు వచ్చిన అమరావతి రాజధాని ప్రాంత రైతులతో ఆయన మాట్లాడారు. అనంతరం కన్నా మీడియాతో మాట్లాడుతూ.. రాజధానిపై వైకాపా ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని తప్పుబట్టారు. ‘అమరావతిలోనే రాజధాని ఉండాలన్నదే తమ భావన’ అని స్పష్టం చేశారు.
3. వైకాపాపై జనసేన ఫిర్యాదు?
తమ పార్టీపై సామాజిక మాధ్యమాల్లో వైకాపా అవాస్తవాలు ప్రచారం చేస్తోందని జనసేన ఆరోపించింది. ఈ మేరకు వైకాపా సోషల్‌ మీడియా విభాగంపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసి, లీగల్‌ నోటీసులు పంపుతామని ఆ పార్టీ ముఖ్యనేతలు పేర్కొన్నారు.
4. తిరుపతిలో భాజపా కార్యకర్తల ఆందోళన
ఆర్టీసీ బస్సు టికెట్లపై అన్యమత ప్రకటనలను నిరసిస్తూ భాజపా కార్యకర్తలు, నాయకులు ఆందోళనకు దిగారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌ మాట్లాడుతూ.. తిరుపతిలో బస్‌టికెట్ వెనుక జెరూసలెం గురించి ప్రచారం చేయడం సరికాదన్నారు. ఈ పద్ధతిని వెంటనే రద్దు చేయాలని, ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.
5. తమిళనాడులో ఉగ్రవాదుల చొరబాటు!
దక్షిణ భారతదేశంలో ఉగ్రదాడులకు కుట్ర జరుగుతోందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. పాకిస్థాన్‌ కేంద్రంగా పనిచేసే లష్కరే తోయిబా ముఠాకు చెందిన ఆరుగురు ఉగ్రవాదులు శ్రీలంక మీదుగా తమిళనాడులోకి చొరబడి కొయంబత్తూర్‌లో దాగి ఉన్నట్లు నిఘా వర్గాలకు సమాచారం రావడంతో రాష్ట్రంలో హెచ్చరికలు జారీ చేశారు.
6. త్రిపుల్‌ తలాక్‌పై కేంద్రానికి సుప్రీం నోటీసులు
ముమ్మారు తలాక్‌ను నేరంగా పరిగణిస్తూ తీసుకొచ్చిన కొత్త చట్టం ప్రామాణికతను పరిశీలిస్తామని సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. ఈ చట్టాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై నేడు విచారణ జరిపిన న్యాయస్థానం.. కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ముస్లిం మహిళల(వివాహ హక్కుల పరిరక్షణ) చట్టం 2019 రాజ్యాంగవిరుద్ధంగా ఉందని, రాజ్యాంగంలోని నిబంధనలను ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
7. ఒలింపిక్స్‌కి ముందు నాడాకి భారీ షాక్‌
జాతీయ డోప్‌ టెస్టింగ్‌ ల్యాబొరేటరీ(ఎన్‌డీటీఎల్‌) అధికారిక గుర్తింపుని ఆర్నెళ్ల పాటు రద్దు చేస్తూ వరల్డ్‌ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ(వాడా) నిర్ణయం తీసుకుంది. ఒలింపిక్స్‌కి మరో ఏడాది మాత్రమే గడువు ఉన్న తరుణంలో వాడా తీసుకున్న నిర్ణయం తీవ్ర కలవరం రేకెత్తిస్తోంది. దేశీయంగా డోపింగ్‌ నిరోధం పట్ల తీసుకుంటున్న ముమ్మర చర్యలకు ఇది పెద్ద అడ్డంకిగా మారునుంది.
8. ‘సాహో’ ఇమోజీ చూశారా..
ప్రభాస్‌ కథానాయకుడిగా నటించిన ‘సాహో’ సినిమా విడుదల తేదీ దగ్గరపడుతోంది. ఈనేపథ్యంలో చిత్రబృందం ‘సాహో’ ఇమోజీని విడుదల చేసింది. ప్రభాస్‌ గాగుల్స్‌ పెట్టుకుని సీరియస్‌గా చూస్తున్న లుక్‌ను ఇమోజీగా రూపొందించారు. ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాకు ఇమోజీలు రాలేదు. ఆ ఘనత సాధించిన తొలి తెలుగు చిత్రం ‘సాహో’ కావడం విశేషం.
9. అంతర్జాతీయంగా భారత్‌ కీలకపాత్ర పోషించాలి
కశ్మీర్‌ విషయంలో మూడో వ్యక్తి జోక్యం అవసరం లేదని.. అది పూర్తిగా భారత్‌-పాక్‌ ద్వైపాక్షిక అంశమని ఫ్రాన్స్‌ తన వైఖరిని మరోసారి పునరుద్ఘాటించింది. మూడు దేశాల పర్యటనలో భాగంగా ఫ్రాన్స్‌లో ఉన్న ప్రధాని మోదీతో భేటీ అయిన సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మెక్రాన్‌ వారి అభిప్రాయాన్ని సుస్పష్టం చేశారు.
10. ప్రభాస్‌తో డ్యాన్స్. బాలీవుడ్‌ భామ హంగామా.