Movies

ఇదే పంథా

Keerthy Suresh Will Continue Her Style Of Picking Stories

‘మహానటి’తో జాతీయ ఉత్తమ నటి అనిపించుకుంది కీర్తి సురేష్. ఈ సినిమా విడుదలైనప్పటి నుంచీ కీర్తికి మెచ్చుకోళ్లు అందుతూనే ఉన్నాయి. ఉత్తమనటి పురస్కారంతో అవి మరింతగా పెరిగాయి. ‘‘మహానటి’ సినిమా, ఆ పాత్ర నా కెరీర్ని మారుస్తాయని ముందు నుంచీ నమ్ముతూనే ఉన్నా. సెట్లో పని చేస్తున్నప్పుడే ఆ పాత్రపై ఓ రకమైన భక్తి భావం కలిగేది. అది క్రమేపీ పెరిగింది. ఓ మంచి సినిమాలో నటించిన తరవాత స్వతహాగానే నా పాత్రలపై అంచనాలు పెరుగుతాయి. దాన్ని బరువు అనుకుంటే ఎలా? ‘మునుముందు ఈ పేరుని కాపాడుకుంటూనే ఉండాలి సుమా’ అని నాకు నిరంతరం గుర్తు చేసే సూచికగానే భావించాలి. నేను చేసిన సినిమాలు తక్కువే. కానీ అందులో కథానాయిక పాత్రలకు చాలా ప్రాధాన్యం ఉంది. పేరుకు మాత్రమే ఉండే పాత్రల్ని ఎప్పుడూ పోషించలేదు. ఇక ముందూ ఇదే పంథాలో కథల్ని ఎంచుకుంటాను’’ అంది కీర్తి.