ScienceAndTech

మీ మ్యాక్‌బుక్‌ను విమానంలోకి అనుమతించరు

మీ మ్యాక్‌బుక్‌ను విమానంలోకి అనుమతించరు

యాపిల్‌ మ్యాక్‌బుక్‌ప్రో పాతవెర్షన్లను చెక్‌ ఇన్‌ లగేజీలో, హ్యాండ్‌ లగేజీలో అనుమతించేందుకు భారత్‌తో సహా పలు దేశాల విమానయాన సంస్థలు అంగీకరించడంలేదు. వీటిలోని బ్యాటరీల కారణంగా ప్రమాదాలు జరగవచ్చనే సందేహాలతో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు సమాచారం. జూన్‌లో యాపిల్‌ స్వచ్ఛందంగా 15అంగుళాల మ్యాక్‌ బుక్‌ ప్రో లాప్‌టాప్‌లను రీకాల్‌ చేసింది. 2015-17మధ్యలో ఉత్పత్తి చేసిన వాటిల్లో అమర్చిన బ్యాటరీ పేలే ప్రమాదం ఉందని అమెరికా కన్జ్యూమర్‌ ప్రొడక్ట్‌ సేఫ్టీ కమిషన్‌ పేర్కొంది. దీంతో యాపిల్‌ వీటిని రీకాల్‌ చేసింది. ఈ నేపథ్యంలో ఆదివారం సింగపూర్‌ ఎయిర్‌ లైన్స్‌ తమ వినియోగదారులు లగేజీలో యాపిల్‌మ్యాక్‌ బుక్‌ ప్రోను తీసుకురావద్దని వెల్లడించింది. అమెరికాలోని ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మిన్‌స్ట్రేషన్‌ కూడా వీటిని విమానాల్లోకి తేవడంపై నిషేధం విధించింది. ఇటీవల యాపిల్‌ లెక్కల ప్రకారం 26 కేసుల్లో యాపిల్‌ మ్యాక్‌బుక్‌ ప్రో విపరీతంగా వేడెక్కినట్లు తేలింది. వీటిల్లో ఐదుగురు వినియోగదారులకు స్వల్పగాయాలు కావడంతో పాటు, పొగ వెలువడటం వంటి ఘటనలు చోటు చేసుకొన్నాయి. అమెరికాలో 4,32,000లు, కెనడాలో 26,000 విక్రయించారు.