DailyDose

కోడెల స్కాంపై విచారణ జరపాలి-తాజావార్తలు–08/27

Investigate Kodela Scam Calls Purandeswari-Telugu Breaking News-08/27

* ఆంధ్రప్రదేశ్‌ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ఫర్నిచర్‌ స్కాంపై విచారణ చేపట్టాలని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి డిమాండ్‌ చేశారు. అసెంబ్లీ ఫర్నిచర్‌ను టీడీపీ నేత కోడెల శివప్రసాదరావు తన ఇంటికి మళ్లించి అప్రతిష్టపాలైన సంగతి తెలిసిందే. ఈ విషయంపై తీవ్రంగా స్పందించిన పురంధేశ్వరి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ నుంచి పక్కదారి పట్టిన ఫర్నిచర్‌ విషయంపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరపాలని కోరారు. అందుకు కారణమైన దోషులు ఎవరైనా సరే.. వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఇక ఏపీకి ప్రత్యేక హోదాకు బదులుగా ప్యాకేజీ ఇచ్చాం.. అని గుర్తు చేశారు. ఏపీకి కేంద్రం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసానిచ్చారు.
*రాజధాని రైతులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాజధాని రైతుల వార్షిక కౌలు చెల్లింపు నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు రూ. 187.4 కోట్లు విడుదల చేస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గత కొన్నిరోజులుగా కౌలు నిధుల విడుదలపై రాజధాని ప్రాంత రైతులు ఆందోళన చేశారు. ఇటీవల మంత్రి బొత్సని కలిసి ఆ నిధులు వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
* యాషెస్‌ సిరీస్‌లో భాగంగా మూడో టెస్టులో ఓటమి అంచుల వరకూ వెళ్లిన ఇంగ్లండ్‌ తిరిగి పుంజుకుని అద్భుతమైన విజయాన్ని నమోదు చేయడంతో ఆ దేశ క్రికెటర్లు, మాజీలు ఉబ్బితబ్బి అయిపోతున్నారు. ఇంగ్లండ్‌ విజయానికి ప్రధాన కారణమైన బెన్‌ స్టోక్స్‌ను మాజీ క్రికెటర్లు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇందులో ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ గ్రేమ్‌ స్వాన్‌ అయితే స్టోక్స్‌ను ‘బావ’ను చేసుకోవాలని ఉందని పేర్కొన్నాడు. అయితే తనకు అక్కా చెల్లెల్లు లేరన్నాడు. ‘నాకు అక్కాచెల్లెల్లు లేరు. కానీ నాకే ఓ సోదరి ఉంటే మాత్రం కచ్చితంగా అతడికిచ్చి పెళ్లి చేసేవాడిని’ అని స్వాన్‌ పేర్కొన్నాడు.
* ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం గెలిచి స్వదేశంలో అడుగుపెట్టిన బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధుకు ఘన స్వాగతం లభించింది. సోమవారం రాత్రి దిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆమె.. మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. సింధుతో పాటు తన నివాసానికి వచ్చిన కోచ్‌ గోపీచంద్‌లను మోదీ అభినgదించారు. దీనిలో భాగంగా సింధు మెడలో పసిడి పతకం వేసి సత్కరించారు.
* పర్యావరణాన్ని కాపాడుకుందాం. అడవుల్ని రక్షించుకుందాం. అమెజాన్ అడవులు అగ్నికి ఆహుతి అవుతుంటే ప్రతి ఒక్కరు గొంతెత్తి నినదించారు. ఆచరణలో చూపాడు హాలీవుడ్ నటుడు లియోనార్డో డికాప్రియో. గత ఏడాది జులైలో ఎర్త్ అలయన్స్ పర్యావరణ ఫౌండేషన్ స్థాపించిన ఆయన దీని ద్వారా 5 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.36 కోట్లు) విరాళం ఇవ్వనున్నట్లు లియోనార్డో ప్రకటించారు.
* సిిటీలో కొన్ని చోట్ల ట్రాఫిక్లో బండి కదలాలంటే చుక్కలు కనిపిస్తాయి. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర అయితే, క్యూ కట్టేస్తాయి. సిగ్నల్ పడి కొన్ని బండ్లు వెళ్లాయో లేదో మళ్లీ రెడ్ పడిపోతుంటుంది. కొన్ని చోట్లయితే, బండ్లు ఎక్కువగా లేకపోయినా గ్రీన్ సిగ్నల్ కొన్ని నిముషాల పాటు రన్ అవుతుంటుంది. ఇంకోవైపు బండ్లు ఎక్కువగా ఉన్నా రెడ్ లైట్ తొందరగా పోదు.
* భారతదేశ తొలి మహిళా మాజీ డీజీపీ కంచన్ చౌదరి భట్టాచార్య కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చౌదరి భట్టాచార్య.. ముంబయిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు.
* జగిత్యాల జిల్లాలోని మల్యాల తహసీల్దార్‌ కార్యాలయంలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. జూనియర్‌ అసిస్టెంట్‌ ఫర్వేజ్‌ రూ.2000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
* ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం గెలిచి స్వదేశంలో అడుగుపెట్టిన తెలుగు తేజం పీవీసింధుకు ఘన స్వాగతం లభించింది. సోమవారం రాత్రి దిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆమె నేడు ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు. ఈ ఉదయం తన నివాసానికి వచ్చిన సింధు, కోచ్‌ గోపీచంద్‌లను మోదీ అభినందించారు. సింధు మెడలో పసిడి పతకం వేసి సత్కరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రధాని తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ‘బంగారు పతకం సాధించి దేశం గర్వపడేలా చేసిన ఛాంపియన్‌ సింధు. ఆమెను కలవడం ఆనందంగా ఉంది. భవిష్యత్‌లో ఇలాంటి ఎన్నో విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నా’ అని మోదీ ట్వీట్‌ చేశారు.
*కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై దర్యాప్తు చేయాలని సీబీఐకి ఫిర్యాదు చేస్తామని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు తెలిపారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన ‘ప్రాణహిత-ప్రాణఘోష’ యాత్రలో భాగంగా నేతలు సోమవారం కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత నదిని సందర్శించారు.
*కశ్మీర్ అంశంలో భారత్ దౌత్యపరంగా పెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఈ సమస్యపై భారత్, పాకిస్థాన్ల మధ్య మధ్యవర్తిత్వం చేస్తానంటూ పదేపదే చెబుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను తీరు మార్చుకునేలా ఒప్పించగలిగింది.
*సికింద్రాబాద్ నుంచి బెంగళూరు, రాయలసీమ వైపు రాకపోకల్ని సులభతరం చేసేందుకు మహబూబ్నగర్ వరకు చేపట్టిన డబ్లింగ్ పనులు కీలకదశకు చేరుకున్నాయి. షాద్నగర్ నుంచి మహబూబ్నగర్ వరకు మట్టిపనులు పూర్తయ్యాయి.
*మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధిని వేగవంతం చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్షా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రంలోని వివిధ శాఖల మంత్రులను కోరారు. ప్రస్తుతం పది రాష్ట్రాల్లోని పది జిల్లాలకే వారి కార్యకలాపాలు పరిమితం అయ్యాయని, ఇక్కడ సైతం పూర్తిగా అవి కనుమరుగయ్యేలా అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని సూచించారు.
*కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఆర్థిక ఉద్దీపనలు సరైన మార్గంలో ఉన్నాయని, ఆర్థిక వ్యవస్థను కచ్చితంగా బలోపేతం చేస్తాయని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు కె.వి.సుబ్రమణియన్ అన్నారు.
*సాగునీటి రంగానికి తెలంగాణ ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తున్నా.. ఇంకోవైపు పెండింగ్ బిల్లులూ ఎక్కువగానే ఉన్నాయి. దీని ప్రభావం కొన్ని ప్రాజెక్టుల పనులపై పడుతోంది. సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్లో అందుకు తగ్గట్లుగా కేటాయింపులు చేసింది.
*రాష్ట్ర ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టాన్ని రూపొందించేందుకు సిద్ధమవుతుండగా తీసుకురావాల్సిన మార్పులు, సంస్కరణలపై ప్రభుత్వానికి ఉద్యోగుల తరఫున సూచనలు చేసేందుకు తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం(ట్రెసా) నమూనా ముసాయిదాను రూపొందిస్తోంది.
*హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) కొత్త కమిషనర్గా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ డీఎస్ లోకేశ్కుమార్ను బదిలీ చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
*ముఖ్యమంత్రి కేసీఆర్కు మెదక్ జిల్లాపరిషత్తు వ్యవసాయ స్థాయీసంఘంలో స్థానం కల్పించారు. కొత్తగా ఈ జడ్పీ ఆవిర్భవించిన తర్వాత, అధ్యక్షురాలు హేమలత గౌడ్ ఆధ్వర్యంలో సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
*హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లే విమానం (ట్రూ జెట్ ఎయిర్లైన్స్ 2టీ-201) ఇక్కడి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఉదయం 8 గంటలకు బయలుదేరింది. 15 నిమిషాలు ప్రయాణించిన అనంతరం, సాంకేతిక లోపం తలెత్తినట్లు సిబ్బంది గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. వారు విమానాన్ని అత్యవసరంగా వెనక్కి రప్పించారు.
*ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు పీజీఈసెట్ చివరి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ఈ నెల 29, 30వ తేదీల్లో జరగనుంది. ఆ రెండు రోజులూ ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని ప్రవేశాల కన్వీనర్ రమేష్బాబు తెలిపారు.
*విశాఖలోని కింగ్జార్జి ఆసుపత్రిలో ప్రతిపాదిత టెర్షరీ కేర్ క్యాన్సర్ యూనిట్ ఏర్పాటుకు అనుమతి లభించింది.
*విశాఖలోని కింగ్జార్జి ఆసుపత్రిలో ప్రతిపాదిత టెర్షరీ కేర్ క్యాన్సర్ యూనిట్ ఏర్పాటుకు అనుమతి లభించింది.
*ట్రిబ్యూటరీ పింఛన్ పథకం(సీపీఎస్)ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబరు 1న తాలూకా కేంద్రాలలో నల్లబ్యాడ్జీలతో నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) ఛైర్మన్, ప్రధాన కార్యదర్శులు జీవీ.నారాయణరెడ్డి, కె.నరహరి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.
(*డీఈడీ రెండో ఏడాది పరీక్షలను సెప్టెంబరు 23 నుంచి 28 వరకు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఎ.సుబ్బారెడ్డి తెలిపారు. 2017-19 బ్యాచ్తో పాటు గతంలో అనుత్తీర్ణులైనవారూ పరీక్షలకు హాజరుకావచ్చన్నారు.
*రాష్ట్రంలో 2050-51 వరకు జనాభా అవసరాలకు అనుగుణంగా వాటర్గ్రిడ్ ఏర్పాటుకు ప్రభుత్వం పరిపాలన అనుమతినిచ్చిందని, డీపీఆర్ రూపొందిస్తున్నామని రాష్ట్ర గ్రామీణ నీటి సరఫరా విభాగం, పారిశుద్ధ్య మిషన్ విభాగం ఇంజినీర్-ఇన్-చీఫ్ (ఈఎన్సీ) ఆర్.వి.కృష్ణారెడ్డి తెలిపారు. గుంటూరులో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.