DailyDose

ఎయిరిండియా ప్రైవేట్ పరం-వాణిజ్య-08/30

Air India To Be Privatized-Telugu Business News Today-08/30

* ఎయిరిండియా ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం కృతనిశ్చయంతో ఉందని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పురి తెలిపారు. ఈ సంస్థను కొనుగోలుచేయడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు.
* కొత్త ఐఫోన్లు వచ్చేస్తున్నాయి. ఐఫోన్ ప్రియులకు శుభవార్త. మరికొద్ది రోజుల్లో కొత్త మోడల్‌ ఐఫోన్లు రాబోతున్నాయి. సెప్టెంబరు 10న జరిగే కార్యక్రమంలో సరికొత్త ఐఫోన్లను ఆవిష్కరించేందుకు కంపెనీ సిద్ధమవుతోంది.
*పశువులు, కోళ్ల దాణాను ఉత్పత్తి చేసే నరిషర్ (అన్మోల్ ఫీడ్స్) కొత్తగా చేపలు, రొయ్యల మేత విభాగంలోకి ప్రవేశించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మార్కెట్లోకి తాజాగా రెండు కొత్త ఉత్పత్తులను విడుదల చేసింది.
*అంకురాలకు పెట్టుబడులు అందించి, ప్రోత్సహించేందుకు టి-హబ్ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
*హైదరాబాద్కు చెందిన ఔషధాల తయారీ సంస్థ అయిన గ్రాన్యూల్స్ ఇండియా తన భాగస్వామ్య సంస్థలో వాటా విక్రయించనుంది.
*భారత్లో ఆన్లైన్ అమ్మకాలతో పాటు సంప్రదాయ విక్రయశాలలు కూడా ప్రారంభించేందుకు చర్యలు వేగవంతం చేశామని అమెరికా సాంకేతిక దిగ్గజం యాపిల్ వెల్లడించింది.
*ఎయిరిండియా ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం కృతనిశ్చయంతో ఉందని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి హర్దీప్సింగ్ పురి తెలిపారు.
* సిమెంటు ఉత్పత్తి సంస్థ రామ్కో సిమెంట్స్ 2020 చివరి నాటికి 2 కోట్ల టన్నుల ఉత్పత్తి సామర్థ్యానికి చేరుకోవాలని లక్ష్యం విధించుకుంది.
* కంపెనీని స్థాపించిన వ్యవస్థాపకుడిని.. స్వయంగా ఆ కంపెనీయే తొలగించడం ఎక్కడా జరగదేమో. కానీ సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ విషయంలో అదే జరిగింది.
* గత ఆర్థిక సంవత్సరానికి ఏజీఎం నిర్వహించేందుకు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ నుంచి డిసెంబరు 30 వరకు గడువును పొందినట్లు కాక్స్ అంగ్ కింగ్స్ తెలిపింది.
* ఎస్సెల్ గ్రీన్ ఎనర్జీ, ఎస్సెస్ ఇన్ఫ్రాప్రాజెక్ట్స్కు చెందిన 205 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లను రూ.1300 కోట్లకు కొనుగోలు చేయనున్నట్లు అదానీ గ్రీన్ ఎనర్జీ వెల్లడించింది.
* ప్రైవేట్ ప్లేస్మెంట్లో బాండ్ల జారీద్వారా రూ.10,000 కోట్ల సమీకరణకు వాటాదార్ల అనుమతి పొందినట్లు పవర్గ్రిడ్ తెలిపింది.