Editorials

తెలుగువారి గుండెలపై మరో పోటు…ఆంధ్రాబ్యాంక్ కనుమరుగు-TNI ప్రత్యేకం

Huge Backlash From Andhrites Over Merging Andhra Bank With Union Bank

సోనియమ్మ తెలుగు ప్రజలను విడగొట్టి పుణ్యం కట్టుకుంది. రాజకీయంగా నామరూపాలు లేకుండా ఆమెతో పాటు ఆమె సారథ్యంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా కాలగర్భంలో కలిసిపోతోంది. ప్రస్తుతం మన తెలుగు ఆడపడుచు నిర్మలా సీతారామన్ మరోసారి తెలుగువారి గుండెలను పిండివేసే ప్రకటన చేశారు. దాదాపు వంద సంవత్సరాల చరిత్ర ఉన్న ఆంధ్రాబ్యాంక్‌ను మరొక బ్యాంకులో విలీనం చేస్తున్నట్లు మన తెలుగు మహిళ నోటి వెంటే ప్రధాని మోడీ చెప్పించారు. ఇది చాలా దుర్మార్గం, దుశ్చర్య. ఇప్పటికే తెలంగాణాలో ఉన్న స్టేట్ బ్యాంకు ఆఫ్ హైదరాబాద్‌ను, స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాను విలీనం చేశారు. మరొకసారి మోడీ ప్రభుత్వం తెలుగువారి గుండె చప్పుడు అయినటువంటి ఆంధ్రాబ్యాంక్‌ను మూసివేసే ప్రయత్నాల్లో పడింది. ఇది ప్రతి తెలుగువారి గుండెలను కలిచివేస్తుంది. ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలని తెలుగు ప్రజలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. తెలుగువ్రి మనోభావాలను మరోసారి దెబ్బతీస్తే కాంగ్రెస్ ఖర్మే మీకూ పడుతుంది అంటూ భాజపా ప్రభుత్వాన్ని తెలుగు ప్రజలు శాపనార్ధాలు పెడుతున్నారు. 42మంది లోక్ సభ సభ్యులు దాదాపు ఇరవై మంది రాజ్యసభ సభ్యులు ఉభయ తెలుగు రాష్ట్రాల తరపున పార్లమెంటులో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు మనవాడే. వెంకయ్యనాయుడు తలచుకుంటే ఆంధ్రాబ్యాంక్ విలీనం ఆగిపోతుంది. మన పార్లమెంటు సభ్యులు కూడా వెంకయ్యనాయుడితో కలిసి ఆంధ్రాబ్యాంక్ విలీన ప్రయత్నాల్ని అడ్డుకోవాలి. తప్పనిసరి పరిస్థితుల్లో మరొక బ్యాంకులో ఆంధ్రాబ్యాంక్‌ను విలీనం చేయవలసి వస్తే ఆంధ్రాబ్యాంక్ పేరునే కొనసాగించాలి. ఇప్పటి వరకు మన ప్రజాప్రతినిదులలో మచిలీపట్నం ఎంపీ బలచౌరీ మాత్రమే ఆంధ్రాబ్యాంక్ విలీనం నిర్ణయాన్ని గట్టిగా వ్యతిరేకించారు. కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలుపుతూ లేఖలు రాశారు. తెలుగు జాతి గుండె చప్పుడైన ఆంధ్రా బ్యాంకును కొనసాగించాలని బాలశౌరి డిమాండ్ చేశారు. మిగిలిన పార్లమెంట్ సభ్యులు కూడా బాలశౌరి మార్గాన్నే అనుచరించారు. ఆంధ్రాబ్యాంక్ అలాగే కొనసాగే విధంగా చర్యలు చేపట్టాలి. —కిలారు ముద్దుకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్.