Food

ఆ మిగిలిపోయిన అన్నాన్ని ఫ్రిజ్‌లో దాచుకుని తినకండి

Please do not preserve left over rice-It is very unhealthy to eat it

ఒకేసారి ఎక్కువగా వండేసి మిగిలిపోయిన ఆహార పదార్థాలను ఫ్రిజ్‌లో పెట్టేయడం చాలామంది చేసేదే. అలా నిల్వచేయడం వల్ల వాటిలోని పోషకాలు బయటకు వెళ్లిపోతాయి. అలాంటి ఆహారం తినడం వల్ల రకరకాల జబ్బులు వస్తాయి. క్యాన్సర్‌ వచ్చే ప్రమాదమూ లేకపోలేదు.
* బేకరీ ఉత్పత్తులు… చాలామంది పేస్ట్రీలు, చాక్లెట్లు, స్వీట్లు… అన్నింటిని తెచ్చి ఫ్రిజ్‌లో కుక్కేస్తారు. చక్కెర, మైదాలతో తయారైన ఈ బేకరీ ఉత్పత్తులు ఎక్కువ సమయం ఫ్రిజ్‌లో భద్రపరిచి తినడం వల్ల గుండె సంబంధ సమస్యలు, రక్తపోటు, మధుమేహం లాంటి అనారోగ్యాలు తలెత్తవచ్చు. వాటిని తెచ్చుకున్న ఒకటి రెండురోజుల్లోనే పూర్తిచేయడం మంచిది.
* అన్నం… మిగిలిపోయిన అన్నాన్ని ఫ్రిజ్‌లో పెట్టి ఆ తరువాత తినడం వల్ల జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తుతాయి. అన్నం మాత్రం ఎప్పటికప్పుడు వేడిగా వండుకుని తినడమే ఉత్తమం.
* ఉప్పు, మసాలాలు… ఊరగాయలు, సాస్‌లు, చట్నీల్లో ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది. వీటిని ఫ్రిజ్‌లో భద్రపరిచి అదేపనిగా తీసుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉండదు. వాటిని పూర్తిగా మానేయాలని లేదు. మితంగా తీసుకోవాలి. పచ్చళ్లను మాత్రం ఎప్పటిప్పుడు ఇంట్లోనే తాజాగా చేసుకోవాలి.
* పండ్లు… వీటినీ ఎక్కువకాలంపాటు ఫ్రిజ్‌లో భద్రపరిచి ఆ తరువాత తింటే అనారోగ్యం దరిచేరుతుంది. ఎప్పటికప్పుడు తాజా పండ్లను మాత్రమే తినాలి. ఏ మాత్రం కమిలిపోయినట్లు కనిపిస్తున్నా.. వాటిని పారేయడమే మంచిది.
* పెరుగు… చాలాకాలం నిల్వ చేసిన పెరుగు తీసుకుంటే ఎసిడిటీ సమస్య ఎదురయ్యే అవకాశం ఎక్కువ. ఒకవేళ అది మిగిలిపోయినా దాన్ని కూరల్లో, గ్రేవీల్లో వేసుకోవడం, స్మూథీలా తయారు చేసుకోవడం మంచిది.