ScienceAndTech

మరో కీలక ఘట్టం విజయవంతం

Chandrayaan-2 Crosses Another Phase Successfully

చంద్రయాన్-2లో మరో కీలక ఘట్టాన్ని ఇస్రో విజయవంతంగా పూర్తి చేసింది. నిన్న ఆర్బిటర్ నుంచి విడిపోయిన విక్రమ్ ల్యాండర్‌కు చెందిన తొలి కక్ష్యను విజయవంతంగా తగ్గించింది. ఇవాళ ఉదయం 8:50 గంటలకు నాలుగు సెకన్ల పాటు ఈ విన్యాసం కొనసాగింది. ఆన్‌‌బోర్డ్ ప్రొపల్షన్ సిస్టమ్‌ను ఉపయోగించి ఈ విన్యాసాన్ని చేపట్టినట్టు ఇస్రో వెల్లడించింది. దీంతో విక్రమ్ ల్యాండర్ ప్రస్తుతం 104 కి.మీ. x 128 కి.మీ. కక్ష్యలో చేరింది. రేపు మరోసారి కక్ష్య తగ్గింపు ప్రక్రియ చేపడతామని ఇస్రో వెల్లడించింది. కాగా నిన్న చంద్రయాన్-2 వ్యోమనౌక నుంచి విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా విడిపోయిన సంగతి తెలిసిందే. భూ క్షక్ష్యలో దాదాపు 23 రోజులు తిరిగిన చంద్రయాన్2 వ్యోమనౌక.. గత నెల 14న చంద్రుడివైపు తన ప్రయాణాన్ని ప్రారంభించింది. జూలై 22న సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి చంద్రయాన్2 ప్రయోగాన్ని చేపట్టారు. ఈ నెల 7న చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-2 దిగనుంది.