Politics

బాబు-పీకెలపై విసారెడ్డి స్వీటు ట్వీటు

YSRCP Vijayasai Reddy Tweets On Pawan Kalyan And NCBN

చంద్రబాబు, పవన్ కల్యాణ్ లపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి సెటైర్లు!

యజమాని, ఆర్టిస్ట్ ఒకే స్క్రిప్ట్ చదువుతున్నారు

ఎందుకు ఓడిపోయానో చంద్రబాబు తెలియదంటున్నాడు

ఈవీఎంల వల్లే గెలిచారని పవన్ అంటున్నారు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తన దాడిని ముమ్మరం చేశారు. అమరావతి విషయంలో ఇటీవల పవన్ చేసిన విమర్శలకు ఘాటుగా స్పందించారు. యజమాని చంద్రబాబు, ఆయన ప్యాకేజీ ఆర్టిస్ట్(పవన్ కల్యాణ్) ప్రస్తుతం కలిసి ఒకే స్క్రిప్ట్ చదువుతున్నారని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.

తాను ఎందుకు ఓడిపోయానో తెలియడం లేదని చంద్రబాబు చెబుతుంటే, కాలం కలిసిరావడం వల్ల, ఈవీఎంల వల్లే వైసీపీ గెలిచిందని ఆయన పార్టనర్ అంటున్నాడని దుయ్యబట్టారు. అలాగైతే 23 సీట్లలో టీడీపీని, జనసేనను ఓ చోట ఎవరు గెలిపించారని ప్రశ్నించారు. ఈ మేరకు ట్వీట్ చేసిన విజయసాయిరెడ్డి చంద్రబాబు, పవన్ కల్యాణ్ లను ట్యాగ్ చేశారు.