DailyDose

బంగారం పది గ్రాములు రూ.40400-వాణిజ్య-09/05

10Grams Gold Reaches 40400 INR-Telugu Business News-Sep 6 2019

*వివిధ మార్కెట్లలో గురువారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.39,540, విశాఖపట్నంలో రూ.40,400, ప్రొద్దుటూరులో రూ.38,800, చెన్నైలో రూ.38,980గా ఉంది.
ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.37,670, విశాఖపట్నంలో రూ.37,160, ప్రొద్దుటూరులో రూ.35,920, చెన్నైలో రూ.37,410గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.50,150, విశాఖపట్నంలో రూ.51,300, ప్రొద్దుటూరులో రూ.51,000, చెన్నైలో రూ.54,800 వద్ద ముగిసింది.
*మైక్రో, చిన్న మధ్యతరహా పరిశ్రమల పటిష్ఠతపై అధ్యయనం చేసిన యూకే సిన్హా కమిటీ నివేదికపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఎంఎ్సఎంఈ శాఖ మంత్రి నితిన్ గడ్కరి చెప్పారు.
*ఒకినవా స్కూటర్స్ మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ ‘ప్రైజ్ ప్రో’ ను విడుదల చేసింది. ఈ బైక్ ధర రూ.71,990. సింగిల్ చార్జింగ్తో ఈ బైక్ 90-110 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని ఒకినవా వెల్లడించింది.
*గృహ, వాహన రుణ గ్రహీతలకు శుభవార్త. ఆర్బీఐ తాజా ఆదేశాలతో వచ్చే నెల 1 నుంచి హోమ్, ఆటో లోన్లపై వడ్డీ భారం మరింత తగ్గనుంది.
*హీరో మోటోకార్ప్ త్వరలోనే బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించిన స్ప్లెండర్ ఐస్మార్ట్ 110 మోటార్సైకిల్ను మార్కెట్లోకి విడుదల చేసే సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.
*చైనా ఈ-కామర్స్, ఇంటర్నెట్, టెక్నాలజీ, రిటైల్, ఇన్వె్స్టమెంట్ దిగ్గజం ఆలీబాబా గ్రూప్.. భారత మార్కెట్లోకి అరంగేట్రం చేయనుంది. తన అనుబంధ విభాగమైన యూసీవెబ్ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ-కామర్స్ వ్యాపారాన్ని ప్రారంభించే ప్రయత్నాల్లో ఉంది.
*ఆన్లైన్లోనే 59 నిముషాల వ్యవధిలో రుణాలందించే పీఎ్సబీ లోన్స్ ఇన్ 59 మినిట్స్ పోర్టల్ ద్వారా రిటైల్ రుణాల అనుమతుల ప్రక్రియకు బ్యాంకులు శ్రీకారం చుట్టాయి. ఇప్పటివరకు ఎంఎ్సఎంఈ రుణాలు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ పోర్టల్ ద్వారా గృహ, వ్యక్తిగత రుణాలు కూడా అందించే ప్రక్రియ దీనితో ప్రారంభమైంది.
*హైదరాబాద్కు చెందిన ఐవీఆర్సీఎల్ను విక్రయించడానికి ఆసక్తి గల కంపెనీల నుంచి బిడ్లను ఆహ్వానించారు. ఐబీసీ 2016 నిబంధనల ప్రకారం లిక్విడేటర్ సుతాను సిన్హా ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలను కోరారు.
*లారస్ లాబ్స్కు చెందిన ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ (ఎఫ్డీసీ) హెచ్ఐవీ ఔషధం ‘టీఎల్ఈ 400’కు గ్లోబల్ ఫండ్ (జీఎ్ఫ)కు చెందిన ఎక్స్పర్ట్ రివ్యూ ప్యానెల్ (ఈఆర్పీ) ఆమోదం లభించింది.
*నిఫ్టీ మరింత రికవరీలో ప్రారంభమై ప్రధాన నిరోధం 10900 దాటినా ఇంట్రాడే రియాక్షన్లో పడింది. కాని 10800 కన్నా పైన మైనర్ రికవరీ సాధించి చివరికి ఎలాంటి తేడా లేకుండా బుధవారంనాటి స్థాయిలకు సమీపంలోనే ముగిసింది.
* ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పాటు వచ్చే మూడేళ్లు ఆదాయం, నికర లాభం ఆకర్షణీయంగా పెరగగలవని గాయత్రీ ప్రాజెక్ట్స్ అంచనా వేస్తోంది. ఆదాయంలో 25 శాతం, లాభంలో 30 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నట్లు తెలిపింది.