DailyDose

కృష్ణానదికి మళ్ళీ వరదపోటు-తాజావార్తలు–09/06

Krishna River Gets New Flood Water-Telugu Breaking News Today-09/06

* శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి ఇన్‌ఫ్లో వస్తుండడంతో అధికారులు జలవిద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. దీంతో శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు 33549 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా వస్తోంది. నాగార్జునసాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 585.20 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టులో 298.0120 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నాగార్జునసాగర్ జలాశయం నుంచి ఎడమకాల్వ ద్వారా 4881 క్యూసెక్కులు, కుడికాల్వ ద్వారా 7878 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 2400 క్యూసెక్కులు, వరద కాల్వ ద్వారా 300 క్యూసెక్కులు, డీటీ గేట్స్ (డైవర్షన్ టన్నల్ ) ద్వారా 10 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతోంది
* కేరళ కొత్త గవర్నర్‌గా అరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం గవర్నర్‌గా అరిఫ్‌ బాధ్యతలు స్వీకరించారు.
*జింబాబ్వే మాజీ అద్యజ్క్షుడు రాబర్ట్ ముగాబే కన్నుమూత.
*బహమాస్ లో భయంకరమైన తుఫాను ఇప్పటి వరకు ముప్పై మంది మరణించారని ఆ దేశ ప్రధాని మినిస్ తెలిపారు.
* జోగులాంబ గద్వాల జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. జూరాలకు ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 1.60 లక్షల క్యూసెక్కులు ఉండగా..జూరాల 13 గేట్ల ద్వారా శ్రీశైలం ప్రాక్టుకు 1.63 లక్షల క్యూసెక్కులు విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం 9.65 టీఎంసీలు కాగా..ప్రాజెక్టులో ప్రస్తుతం నీటి నిలువ 9.23 టీఎంసీలుగా ఉంది. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 318.51 మీటర్లు..కాగా ప్రస్తుత నీటిమట్టం 318.31 మీటర్లుగా ఉంది.
* వైకాపా బాధితుల పునరావాస శిభిరాన్ని సందర్శించిన రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ .బాధితుల వివరాలను శిబిరం ఇన్ చార్జ్ నక్కా ఆనంద బాబు ను అడిగి తెలుసుకున్న నేతలు.గ్రామాల్లో వైకాపా నాయకులు,పోలీసులు వ్యవహరించిన తీరు,కార్యకర్తల పడిన కష్టాలను అడిగి తెలుసుకున్న లోకేష్
* శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి ఇన్‌ఫ్లో వస్తుండడంతో అధికారులు జలవిద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. దీంతో శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు 33549 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా వస్తోంది. గార్జునసాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 585.20 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టులో 298.0120 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నాగార్జునసాగర్ జలాశయం నుంచి ఎడమకాల్వ ద్వారా 4881 క్యూసెక్కులు, కుడికాల్వ ద్వారా 7878 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 2400 క్యూసెక్కులు, వరద కాల్వ ద్వారా 300 క్యూసెక్కులు, డీటీ గేట్స్ (డైవర్షన్ టన్నల్ ) ద్వారా 10 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతోంది. ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా నీటి విడుదల లేదు. రిజర్వాయర్ నుంచి మొత్తం 15219 క్యూసెక్కుల నీరు ఔట్‌ఫ్లోగా విడుదలవుతోంది. శ్రీశైలం రిజర్వాయర్‌లో 877.70 అడుగుల వద్ద 176.7402 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి 90890 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది.
* ఉనవ్‌ బాధితురాలి కోసం ఎయిమ్స్‌లో తాత్కాలిక కోర్టును ఏర్పాటు చేయాల్సిందిగా ఢిల్లి హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా బాధితురాలి ఆరోగ్య పరిస్థితిని సుప్రీంకోర్టు పేర్కొంది. బిజెపి ఎమ్మెల్యే కుల్దిసప్‌ సింగ్‌ సెంగార్‌ ఉనవ్‌లో ఒక యువతిపై అత్యాచారం చేశాడు అనంతరం ఆమె ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్‌ జరిగిన విషయం విదితమే. ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో సుప్రీంకోర్టు ఆదేశాల
మేరకు ఆమెను ఎయిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు
* సాధారణంగా ఒక పాఠశాలకు నెలవారీ విద్యుత్ బిల్లు రూ. వందల్లో లేదా వేలల్లో ఉంటుంది. కానీ, ఉత్తరప్రదేశ్లో విద్యుత్శాఖ అధికారులు ఓ ప్రైవేట్ స్కూల్కు ఏకంగా రూ.618 కోట్ల కరంట్ బిల్లు వేశా రు. ప్రధాని మోదీ నియోజకవర్గమైన వారణాసి పట్టణం వినాయక్కాలనీలో ఈ ఘటన జరగడం గమనార్హం. విద్యుత్ బిల్లుచూసి షాక్కు గురైన పాఠశాల యాజమాన్యం.. ఆ శాఖ అధికారులకు ఫిర్యాదుచేసింది. సంబంధిత అధికారులు ఫిర్యాదుపై చర్యలు తీసుకోకపోగా.. ఈ నెల ఏడులోపు బిల్లు చెల్లించకుంటే పాఠశాలకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని హుకుం జారీచేశారు.
* భారత నౌకా దళానికి చెందిన యుద్ధ నౌకలు ఐఎన్‌ఎస్‌ సహ్యాద్రి, ఐఎన్‌ఎస్‌ కిల్తాన్‌లు మూడు రోజుల పర్యటనకు కంబోడియాకు బయలుదేరి వెళ్లాయి. ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాల బలోపేతానికి ఈ పర్యటన ఉపకరిస్తుందని తూర్పు నౌకాదళం పేర్కొంది. రాయల్‌ కంబోడియన్‌ నేవీతో వృత్తిపరమైన అంశాలు, ఉన్నతాధికారులతో సమావేశాలు, అక్కడి ప్రజలతో మమేకమై కార్యక్రమాలు నిర్వహిస్తారని వివరించింది. సహ్యాద్రికి కెప్టెన్‌ అశ్విన్‌ అరవింద్‌, కిల్తాన్‌కు కమాండర్‌ గింటో జార్జ్‌ చాకో సారథ్యం వహిస్తున్నారు.
*బేడ బుడగ జన్గాలను ఎస్సీ కులాల జాబితాలో కలపడం శ్రీకాకుళం జిల్లాలోని బెంతో ఒరియా కులస్తులుకు ఎస్టీ ద్రువపత్రాలు అందజేయడం ఇతర షెడ్యులు కులాల ధ్రువ పత్రాలు మజూరులో ఉన్న సమస్యల పై అద్యయనం చేసేందుకు ప్రభుత్వం ఏక సభ్య కమిషన్ ను ఏర్పాటు చేసింది. విశ్రాంత ఐఏఎస్ అధికారి జేసీ శర్మను కమిషన్ చైర్మన్ గా నియమించింది.
* ఉత్తర ఒడిశా, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. దాని ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని, కోస్తాలో ఒకటి, రెండుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వెల్లడించింది. సముద్రం అల్లకల్లోలంగా వున్నందున తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది
*24 గంటల పాటు నిరంతర బోధన చేసి కల్నల్ వెలుగోటి రాములు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం దక్కించుకున్నారు. కృష్ణాజిల్లా కంకిపాడు మండలం ఈడ్పుగల్లులోని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షెమ శాఖ ఆద్వర్యంలో నడుస్తున్న ఐఐటీ మెడికల్ అకాడమీ గురుకుల విద్యా సంస్థలో గురు పూజోత్సవ్బం సందర్భంగా ఈ రికార్డు సృష్టించారు.
*స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో హిందూస్తాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ రూపొందించిన చిన్న యుద్ద విమానం హిమాలయ పర్వతాలలో సామర్ధ్య పరీక్షలు ముగించుకుంది. అతి శీతల అత్యధిక ఉష్నోగ్రతలున్న వాతావరణంలో ముగించుకుంది. యుద్దానికి ఎల్ యూ హెచ్ సిద్దమైనట్లు హెచ్ ఎ ఎల్ ప్రకటించింది.
*తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అమెరికాలోనూ కొన్నేళ్లుగా సేవలందిస్తూ కీర్తి గడించిన ఆంధ్రాబ్యాంకు ను యునియన్ బ్యాంకు లో విలీనం చేయడం తగదని వామపక్ష నేతలు పేర్కొన్నారు. విలీనాన్ని అడ్డుకునేందుకు పోరాటాలు చేస్తామని వెనక్కి తగ్గేది లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పష్టం చేశారు. గురువారం విజయవాడ పాత బస్తీలోని ఆంధ్రాబ్యాంక్ హోనల్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో వారు వేర్వేరుగా పాల్గొని సంఘీభావం తెలిపారు.
*విశాఖపట్నం విమానాశ్రయం డైరెక్టర్గా మొలకలపల్లి రాజకిషోర్ గురువారం బాధ్యతలు స్వీకరించా రు. ఈయన రాజమండ్రి నుంచి జనరల్ మేనేజర్గా పదోన్నతి పొంది ఇక్కడికి వచ్చారు. ఈ రంగంలో ఆయనకు 26 ఏళ్ల అనుభవం ఉంది. చెన్నై విమానాశ్రయం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విభాగం లో తొమ్మిదేళ్లు, హైదరాబాద్ జీఎంఆర్ విమానాశ్రయంలో కొన్నాళ్లు, రాష్ట్ర విభజ న తరువాత విజయవాడ విమానాశ్రయం డైరెక్టర్గా కొన్నాళ్లు పనిచేశారు. రాజమండ్రిలో నాలుగేళ్లు పనిచేసి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.
*గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ రూఫ్టాప్ రెండో దశలో.. 3 కిలోవాట్లలోపు రూఫ్టాప్ సోలార్కు 40 ు దాకా రాయితీ ఇస్తామని కేంద్ర నూతన, పునరుత్పాదక విద్యుత్ మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. ఆ పైన ప్రతి కిలోవాట్కు కేవలం 20 శాతం మాత్రమే రాయితీ ఇస్తామని ఉత్తర్వులిచ్చింది. 10 కిలోవాట్ల దాకా ప్లాంటు పెట్టుకుంటే తొలి మూడు కిలోవాట్లకు 40ు రాయితీ వర్తిస్తుందని, ఆ తర్వాత మిగిలిన 7 కిలోవాట్లకు 20 శాతం రాయితీ అమలవుతుందని తెలిపింది.
*రాష్ట్రంలోని 12,751 గ్రామ పంచాయతీల్లో శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న 30 రోజుల కార్యాచరణలో ప్రతి వ్యక్తికి సగటున రూ.167 చొప్పున ప్రభుత్వం ఖర్చు చేయనుంది. ఇందులో కేంద్రానివి రూ.100 కాగా, మిగిలిన రూ.67 రాష్ట్రానివి.
*కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ గురువారం ప్రకటించిన విశిష్ట విద్యాసంస్థల జాబితాలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చోటు దక్కించుకుంది. దీంతోపాటు బనారస్ విశ్వవిద్యాలయం, మద్రాస్, ఖరగ్పూర్ ఐఐటీలు, ఢిల్లీ వర్సిటీకీ ఈ హోదా దక్కింది. ఇక ఈ హోదాను ఇచ్చేందుకు సంబంధించిన సంసిద్ధతా పత్రాల్ని(లెటర్ ఆఫ్ ఇంటెంట్) పొందిన ప్రైవేటు విద్యాసంస్థల జాబితాలో అమృత విశ్వ విద్యాపీఠం(తమిళనాడు), జామియా హమ్దర్ద్ వర్సిటీ(ఢిల్లీ), కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ(ఒడిసా), భారతీ ఇన్స్టిట్యూట్(మొహాలీ), వేలూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(తమిళనాడు) ఉన్నాయి
*గురుకుల ప్రిన్సిపాల్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థులనే ఇంటర్వ్యూకి ఎంపిక చేసినట్లు టీఎ్సపీఎస్సీ కార్యదర్శి ఎ.వాణీప్రసాద్ తెలిపారు. అభ్యర్థుల సర్టిఫికెట్లను జిల్లాస్థాయిలోని డీఈవోలు, డీఐఈవోలు ఆమోదించాకే తుది జాబితాను తయారుచేశామన్నారు. గురుకుల ప్రిన్సిపాల్స్ ఇంటర్వ్యూ జాబితాపై ‘అనర్హులే అర్హులు’ శీర్షికన గురువారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై టీఎ్సపీఎస్సీ వివరణ ఇచ్చింది.
*రాష్ట్రంలోని పట్టణాల్లో మరో 1.20 లక్షల ఎల్ఈడీ వీధి దీపాలు ఏర్పాటు చేయనున్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన 68 మునిసిపాలిటీల్లో వీటిని అమర్చనున్నారు. 72 మునిసిపాలిటీల్లో ఇప్పటికే 3.44 లక్షల ఎల్ఈడీ బల్బులు అమర్చారు.
*గురుకుల ప్రిన్సిపాల్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థులనే ఇంటర్వ్యూకి ఎంపిక చేసినట్లు టీఎ్సపీఎస్సీ కార్యదర్శి ఎ.వాణీప్రసాద్ తెలిపారు. అభ్యర్థుల సర్టిఫికెట్లను జిల్లాస్థాయిలోని డీఈవోలు, డీఐఈవోలు ఆమోదించాకే తుది జాబితాను తయారుచేశామన్నారు. గురుకుల ప్రిన్సిపాల్స్ ఇంటర్వ్యూ జాబితాపై ‘అనర్హులే అర్హులు’ శీర్షికన గురువారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై టీఎ్సపీఎస్సీ వివరణ ఇచ్చింది.
*తెలుగు రాని ప్రభుత్వ, ప్రభుత్వేతర ఉద్యోగుల కోసం తెలుగు అకాడమీ ‘తెలుగు పరిచయ’ కోర్సును అందిస్తోంది. ఈనెల 18 నుంచి ఈ కోర్సు తరగతులు ప్రారంభమవుతాయని అకాడమీ డైరెక్టర్ సత్యనారాయణరెడ్డి తెలిపారు.
*గ్రూప్-4 రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈనెల 9 నుంచి అక్టోబరు 18 వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నట్లు టీఎ్సపీఎస్సీ తెలిపింది. అభ్యర్థులు రెడ్డి ఉమెన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో హాజరుకావాలని సూచించింది.
*జూరాల ప్రాజెక్టుకు వరద నీరు పెరుగుతోంది. గురువారం 1.10 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చింది. దీంతో 13 గేట్ల ద్వారా 1.29 లక్షల క్యూసెక్కులను శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి గురువారం 1,85,076 క్యూసెక్కులను విడుదల చేసినట్లు జూరాల ప్రాజెక్టు అధికారులకు సమాచారాన్ని అందించారు. ఆల్మట్టి నుంచి 1,85,095 క్యూసెక్కులనీటిని విడుదల చేస్తున్నారు. జూరాలకు మరింతగా వరద పెరిగే అవకాశం ఉండటంతో గేట్లను రెండోసారి తెరిచారు తుంగభద్రకు కూడా వరద నీరు 39,142 క్యూసెక్కులకు పెరిగింది.
*కోర్టు ధిక్కార కేసులో కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ డీఈవోలకు హైకోర్టు రెండు నెలల సాధారణ జైలు శిక్ష, రెండు వేల రూపాయల చొప్పున జరిమానా విధించింది. న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్రావు గురువారం ఈ మేరకు తీర్పు ఇచ్చారు.
* రాష్ట్రంలోని 4 పురపాలక సంఘాల స్థాయిని పెంచుతూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు
*కర్నూలు జిల్లా పాణ్యం మండలంలో డిప్యూటీ తహశీల్దారుగా పనిచేస్తోన్న పత్తి శ్రీనివాసులు ఇంట్లో ఏసీబీ అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు. కోవెలకుంట్ల, నంద్యాలల్లోని నివాసాలతోపాటు పాణ్యం మండలం కొండజూటురులోని మామగారి నివాసంలోనూ అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు.
*బందరు పోర్టు నిర్మాణ ఒప్పందాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడం చట్ట విరుద్ధమని పేర్కొంటూ ‘నవయుగ మచిలీపట్నం పోర్ట్ లిమిటెడ్’ సంస్థ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై విచారణ ఈ నెల 12వ తేదీకి వాయిదా పడింది.
* ఎగువన కురుస్తున్న వర్షాలకు కృష్ణా, తుంగభద్ర నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. జూరాల నుంచి శ్రీశైలానికి 1.23లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 885అడుగులు కాగా గురువారం సాయంత్రం 6గంటలకు 877.90 అడుగుల వద్ద 177.5578 టీఎంసీల నిల్వ నమోదైంది. జలాశయం నుంచి మొత్తం ఔట్ఫ్లో 61,200క్యూసెక్కులుగా ఉంది.
*ఉత్తర ఒడిశా, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. దాని ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని, కోస్తాలో ఒకటి, రెండుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వెల్లడించింది.
సముద్రం అల్లకల్లోలంగా వున్నందున తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.