Editorials

ఓ యువ IAS మనస్సు చంపేశారు

ఓ యువ IAS మనస్సు చంపేశారు

ప్రజాస్వామ్యనికి ఆధార స్తంభాలు గతంలో ఎన్నడూ లేనివిదంగా నాశనమయ్యాయి. ఆ గోడలు కూలుతున్న్జయి. వ్యవస్థలు రాజీపడుతున్నాయి. ఆ గోడలు కూలుతున్నాయి. వ్యవస్థలు రాజీపడుతున్నాయి. ఈ పరిణామాలు దేశాభ్యుదయానికి పెను ప్రమాదాన్ని తెచ్చి పెట్టేలా ఉన్నాయి. భావిష్యతులో అధికారులు పెనుసవాల్ మను ఎదుర్కోక తప్పదు. ఇలాంటి పరిస్థితుల్లో భారతీయ పాలనా సేవల నుంచి వైదొలగడమే మేలనిపిస్తోంది. ప్రజా సంక్షెమ కోసం ప్రయత్నాన్ని కొనసాగిస్తా అని కర్నాటకలోని దక్షిణ కన్నడ జిల్లా అధికారి శశికాంత్ సెంధిల్ ప్రకటించి ఉద్యోగానికి శుక్రవారం రాజీనామా చేశారు. జిల్లా అదికారిగా ఉన్న ఆయన రాజీనామా రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించింది. ఆయన ఎందుకు ఇంతటి తీవ్రమైన నిర్ణయం తీసుకున్నారో అసలు విషయం తెలియక అధికారులు రాజకేయ నాయకులూ తీవ్ర ఆలోచనలు చేస్తున్నారు. రాజీనామాకు వేరేవారూ కారణం కాదని సెంధిల్ లేఖలో పేర్కొన్నారు. పూర్తిగా వ్యక్తిగత కారణాల వల్లే రాజీనామా చేస్తునాన్నని తెలిపారు. ఇంతకాలం దక్షిణ కన్నడ జిల్లా అధికారిగా పని చేశాను. ఇలాంటి పరిస్థితుల్లో రాజీనామా చేస్తున్నందున ప్రజలు క్షమిన్చాలి అని కోరారు. తమిలనడుక్లు చెందిన సెంధిల్ 2009 సంవత్సరపు ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన వారు జిల్లా అధికారి కావాలనే లక్ష్యంతో యూ పీ ఎస్సీ పరీక్షలు రాసి తమిళనాడులో ప్రధమ స్థానంలో జాతీయ స్థాయిలో తొమ్మిదవ ర్యాంక్ సాధించారు. ఐఏఎస్ అధికారిగా ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ఉన్న ఆయన ఇప్పుడు రాజీనామా చేయడం వెనుక ఏం జరిగిందనో మేధావులు తలలు పట్టుకున్నారు.