DailyDose

ఈ వాణిజ్య కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు-వాణిజ్య-09/07

ఈ వాణిజ్య కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు-వాణిజ్య-09/07

*వినోదంతోపాటు ఇ-గవర్నెన్స్‌ సేవలు, హెల్త్‌ కియోస్కోలు, బ్యాంకింగ్‌ సేవలు, ఫుడ్‌ కోర్టులు, రెస్టారెంట్లు, గేమింగ్‌ జోన్లు, కాఫీ షాపులు, రిటైల్‌ బ్రాండెడ్‌ షాపులు వంటి వాటిని ఒకే చోట అందుబాటులోకి తెచ్చే విధంగా వై స్ర్కీన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ తెలుగు రాష్ట్రాల్లో వై స్ర్కీన్స్‌ ట్రేడ్‌ డెవల్‌పమెంట్‌ కేంద్రాలను (వైఎ్‌సటీడీ) ఏర్పాటు చేస్తోంది. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో యువతకు ఉపాధి లభించే విధంగా ఆయా పట్టణాల్లో వీటిని నిర్మిస్తున్నట్లు కంపెనీ సీఎండీ వై వెంకట రత్న కుమార్‌ తెలిపారు. ఈ కేంద్రాల్లో సినిమా థియేటర్లతోపాటు ఈ సౌకర్యాలు ఉంటాయి. వచ్చే ఆరేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో 165, తెలంగాణలో 75 ట్రేడ్‌ డెవల్‌పమెంట్‌ కేంద్రాలను నెలకొల్పాలని భావిస్తున్నట్లు కుమార్‌ చెప్పారు. తొలిసారిగా 2016లో విజయవాడలో కంపెనీ రెండు చిన్న సినిమా థియేటర్లను నిర్మించింది. 4 నెలల క్రితం పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో వైఎ్‌సటీడీని ప్రారంభించింది. ఒక్కో కేంద్రం ఏర్పాటుకు దాదాపు రూ.5 కోట్లు ఖర్చవుతుందని.. మొత్తం కేంద్రా ల్లో 30-40 శాతాన్ని ఫ్రాంఛైజీ మోడల్‌లో నెలకొల్పుతామని కుమార్‌ వివరించారు. మొదటి దశలో ఏపీలో నరసరావుపేట, శ్రీకాకుళం సహా 14 ప్రాజెక్టులను కంపెనీ చేపట్టనుంది. వచ్చే ఏడాది ఆగస్టునాటికి వీటిని పూర్తి చేయాలని భావిస్తోంది. సొంతగా ఏర్పాటు చేసే కేంద్రాలకు రూ.1,000 కోట్ల వరకూ పెట్టుబడులు అవసరమవుతాయని.. బ్యాంకులు, ఇతర మార్గా ల ద్వారా ఈ నిధులను సమకూర్చు కుంటామన్నారు. నిధులకు సంబంధించి సింగపూర్‌కు చెందిన ప్రైవేట్‌ ఈక్విటీ కంపెనీతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. దీంతో ఒప్పందం కుదుర్చుకోనున్నామని, ఒకటి రెండేళ్లలో పబ్లిక్‌ ఇష్యూకు వచ్చే ఆలోచన కూడా ఉందన్నారు. మాస్టర్‌ ఫ్రాంఛైజీ ద్వారా మహారాష్ట్ర, గుజరాత్‌ తదితర రాష్ట్రాలకు విస్తరించే ఆలోచన ఉన్నట్లు చెప్పారు.కంపెనీలకు ఫైనాన్షియల్‌ లీజింగ్‌, కన్సల్టెన్సీ సేవలందిస్తున్న స్పార్క్‌లింగ్‌ (ఇండియా) ఫిన్‌షేర్స్‌తో వై స్ర్కీన్స్‌ బిజినెస్‌ డెవల్‌పమెంట్‌ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందానికి అనుగుణంగా స్పార్క్‌లింగ్‌ రుణ సదుపాయాల కల్పన మొదలైన సేవలు అందిస్తుంది. ఒక్కో కేంద్రం వల్ల స్థానికంగా 125-150 మందికి ఉపాధి లభిస్తుందని కుమార్‌ అన్నారు. *ఆర్థిక వ్యవస్థ కష్టాల్లో ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పరోక్షంగా అంగీకరించారు. ప్రతి రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అన్ని రకాల సహాయమూ ఈ రంగాలకు అందిస్తామన్నారు.
*ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కష్టాలు మరింతగా పెరుగుతున్నాయి. రుణాల రూపంలో ప్రమోటర్లు, కంపెనీ నిధులను దారి మళ్లించారని ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైౖంది. ‘సిటిజన్స్ విజిల్ బ్లోయర్ ఫోరం’ అనే సంస్థ ఈ పిల్ దాఖలు చేసింది. *రాష్ట్ర వ్యాప్తంగా 5,000 మంది పాఠశాల టీచర్లకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రాథమిక నైపుణ్యాల్లో భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ), తెలంగాణ, శిక్షణ ఇవ్వనుంది.
*మాస్కో స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్కోల్కోవోతో హైదరాబాద్కు చెందిన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినె్స (ఐఎ్సబీ) ఒప్పందం కుదుర్చుకుంది. *వారాంతంలో స్టాక్ మార్కెట్ పరుగులు తీసింది. వాణిజ్య యుద్ధానికి తెరదించేందుకు తిరిగి చర్చలు జరపాలన్న అమెరికా-చైనా నిర్ణయం దేశీయ స్టాక్ మార్కెట్లలో ఉత్సాహాన్ని నింపింది. దీంతో బీఎ్సఈ సెన్సెక్స్ 337.35 పాయింట్ల లాభంతో 36,981.77 వద్ద, 98.30 పాయింట్ల లాభంతో నిఫ్టీ 10,946.20 వద్ద ముగిశాయి. *ఇటీవల గరిష్ఠ స్థాయిలకు చేరిన బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం నాడిక్కడి బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర ఏకంగా రూ.2,695 తగ్గి రూ.46,980కి చేరుకుంది. పది గ్రాముల మేలిమి బంగా రం ధర రూ.311 తగ్గి రూ.38,343కు చేరింది.
*మాస్కో స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్కోల్కోవోతో హైదరాబాద్కు చెందిన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినె్స (ఐఎ్సబీ) ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందం ప్రకారం రెండు బిజినెస్ స్కూళ్లు కలిసి కంపెనీల ఎగ్జిక్యూటివ్లకు శిక్షణ ఇచ్చేందుకు ఎడ్యుకేషనల్ మాడ్యూళ్లను తయారు చేస్తాయి
*చెన్నైలోని ప్లాంట్లో ఐదు రోజుల పాటు ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు ఆటోమొబైల్ దిగ్గజ సంస్థ అశోక్ లేలాండ్ ప్రకటించింది. *తెలంగాణలో అమల్లో ఉన్న స్టార్టప్ విధానాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఏర్పాటు చేసిన యూకె ిసిన్హా కమిటీ తన నివేదికలో ప్రస్తావించింది. సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల ధీర్ఘకాలిక అభివృద్థి కోసం ఎలాంటి వ్యూహాలు అవలంభించాలో, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా ఉపయోగించుకోవాలో సూచించాలంటూ యూకే సిన్హా నేతృత్వంలో ఆర్బీఐ ప్రత్యేక కమిటీ వేసిన విషయం తెలిసిందే.
*సామ్సంగ్ ఎలక్ర్టానిక్స్ తన మొదటి ఫోల్డబుల్ (మడతపెట్టే) స్మార్ట్ఫోన్ ‘గెలాక్సీ ఫోల్డ్ 5జీ’ని దక్షిణ కొరియా మార్కెట్లోకి శుక్రవారం విడుదల చేసింది. ఇది ఐదోతరం (5జీ) మొబైల్ కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది. దీని ధరను కంపెనీ 1,977 డాలర్లుగా నిర్ణయించింది.
*అల్లా టప్పా కంపెనీల షేర్ల (పెన్నీ షేర్లు)లో ట్రేడింగ్ జరిపి, వ్యవస్థీకృత పన్నుల ఎగవేతకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం చాలా మంది ఇలాంటి షేర్ల లావాదేవీలు జరిపి, దీర్ఘకాలిక మూలధన లాభాలు (ఎల్టీసీజీ) లేదా స్వల్ప కాలిక మూలధన నష్టాల (ఎస్టీసీఎల్) పేరుతో పన్నుల ఎగవేతలకు పాల్పడుతున్నారు.
*సాధారణ బీమా విభాగంలోని మూడు ప్రభుత్వ రంగ సంస్థలకు కేంద్రం రూ.12,000 కోట్ల మేర మూలధనం సమకూర్చనున్నట్లు తెలిసింది. నేషనల్ ఇన్సూరెన్స్, ఓరియెంటల్ ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్కు ఈ నిధులు లభించనున్నాయి.