Devotional

దుర్గమ్మ దసరాకు భారీ ఏర్పాట్లు

దుర్గమ్మ దసరాకు భారీ ఏర్పాట్లు

1.దుర్గమ్మ దసరా ఏర్పాట్లకు భారీ ఏర్పాట్లు – ఆద్యాత్మిక వార్తలు
ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గామల్లేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 29నుంచి దసరా నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమవుతాయని ఆలయ ఈవో ఎం.వి.సురే్‌షబాబు అన్నారు. 30నుంచి తెల్లవారు జామున 3గంటల నుంచే దర్శనం చేసుకునే అవకాశం ఉందన్నారు. అమ్మవారు 29న స్వర్ణ కవచాలాంకృత దుర్గాదేవిగా, 30న బాలాత్రిపుర సుందరి, అక్టోబరు 1న గాయత్రీదేవి, 2న అన్నపూర్ణాదేవి, 3న లలితా త్రిపురసుందరీ దేవి, 4న మహాలక్ష్మిదేవి, 5న సరస్వతీ దేవి, 6న దుర్గాదేవి, 7న మహిషాసురమర్ధని, 8న శ్రీరాజరాజేశ్వరిదేవిగా దర్శనమిస్తారని వివరించారు. 8న సాయంత్రం 5గంటలకు కృష్ణానదిలో తెప్పోత్సవం నిర్వహిస్తామన్నారు.
2. రూ.2కోట్లతో లక్ష్మీ గణపతి అలంకారం
గుంటూరు ఆర్ అగ్రహారం వాసవీ యూత్ ఆధ్వర్యంలో 21వ గణపతి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా శుక్రవారం స్వామికి రూ.2కోట్ల కరెన్సీతో లక్ష్మీ గణపతి అలంకారం చేశారు. విద్యుద్దీప కాంతులు, కరెన్సీతో అలంకరించిన స్వామిని దర్శించేందుకు భారీగా భక్తులు హాజరయ్యారు.
3. 68,466 ఆర్జిత సేవా టిక్కెట్ల విడుదల
తిరుమల ఆలయంలో డిసెంబరు నెలకు సంబంధించి మొత్తం 68,466 ఆర్జిత సేవాటిక్కెట్లు అందుబాటులో ఉన్నట్లు ఈవో తెలిపారు. ఆన్లైన్ డిప్ విధానం ద్వారా సుప్రభాతం-3,856, తోమాల-60, అర్చన-60, అష్టదళపాద పద్మారాధన-240, నిజపాద దర్శనం-2,300, సాధారణ కోటాలో విశేషపూజ-2,500, కల్యాణోత్సవం-13,775, ఊంజల్సేవ-4,350, ఆర్జిత బ్రహ్మోత్సవం-7,975, వసంతోత్సవం-15,950, సహస్రదీపాలంకరణసేవ- 17,400 టిక్కెట్లు ఉన్నాయని ఆయన వివరించారు.
4. రూ.1.60 కోట్లతో ధన గణపతి
మంగళగిరి పూలమార్కెట్ సెంటర్లో కొలువైన గణనాథుడిని శుక్రవారం రూ.1.60కోట్ల కరెన్సీ నోట్లతో ధన గణపతిగా అలంకరించారు. సంకా బ్రదర్స్ ఆధ్వర్యంలో వర్తక వ్యాపారుల సౌజన్యంతో దత్తాత్రేయ గణపతి విగ్రహం ఏర్పాటు చేశారు.
5. 5 నెలల్లో శ్రీవారి హుండీ ఆదాయం 497.27 కోట్లు
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి హుండీ కానుకలు ఇటీవల భారీగా పెరుగుతున్నట్లు టీటీడీ ఈవో అనిల్కుమార్ సింఘాల్ వెల్లడించారు. శుక్రవారం ఉదయం తిరుమలలో ప్రత్యేకాధికారి ధర్మారెడ్డితో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. గత ఏడాది ఏప్రిల్-ఆగస్టు మధ్య రూ. 450.54 కోట్ల ఆదాయం హుండీ ద్వారా లభించగా.. ఈ ఏడాది ఏప్రిల్-ఆగస్టు మధ్య రూ. 497.29కోట్లు లభించిందన్నారు. అలాగే 2018 ఏప్రిల్- ఆగస్టు మధ్య 344 కిలోల బంగారం, 1,128 కిలోల వెండి కానుకలుగా లభించగా.. ఈ ఏడాది 524 కిలోల బంగారం, 3,098 కిలోల వెండి సమకూరినట్లు వివరించారు.టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న 10 ట్రస్టులకు, ఒక స్కీమ్కు గత మూడేళ్లలో వచ్చిన విరాళాలను పరిశీలిస్తే ఏటికేడు గణనీయంగా పెరుగుతున్నాయని చెప్పారు. 2017 ఏప్రిల్-ఆగస్టు మధ్య రూ. 91.91కోట్లు, 2018 ఏప్రిల్-ఆగస్టు మధ్య రూ. 113.96 కోట్లు విరాళాల రూపంలో లభించగా ప్రస్తుత ఏడాది ఏప్రిల్-ఆగస్టు మధ్య రూ.140.46కోట్లు లభించాయన్నారు. ఒక్క ఆగస్టు నెలలోనే హుండీ ఆదాయం రూ.113.71 కోట్లు సమకూరగా, అద్దె గదుల నుంచి రూ.6.9కోట్ల ఆదాయం వచ్చినట్టు ఈవో తెలిపారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా అందుతున్న విరాళాలను ఎస్సీ, ఎస్టీ గ్రామాల్లో శ్రీవారి దేవాలయాల నిర్మాణానికి వినియోగిస్తున్నట్లు వివరించారు. ప్రోటోకాల్ పరిధిలో ఎల్-1, 2, 3దర్శనాలను కొనసాగించవచ్చని హైకోర్టు చెప్పడంపై ప్రస్తుతం అమలుచేస్తున్న విధానాన్ని న్యాయస్థానానికి వివరించామన్నారు.
6. ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గామల్లేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 29నుంచి దసరా నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమవుతాయని ఆలయ ఈవో ఎం.వి.సురే్‌షబాబు అన్నారు. 30నుంచి తెల్లవారు జామున 3గంటల నుంచే దర్శనం చేసుకునే అవకాశం ఉందన్నారు. అమ్మవారు 29న స్వర్ణ కవచాలాంకృత దుర్గాదేవిగా, 30న బాలాత్రిపుర సుందరి, అక్టోబరు 1న గాయత్రీదేవి, 2న అన్నపూర్ణాదేవి, 3న లలితా త్రిపురసుందరీ దేవి, 4న మహాలక్ష్మిదేవి, 5న సరస్వతీ దేవి, 6న దుర్గాదేవి, 7న మహిషాసురమర్ధని, 8న శ్రీరాజరాజేశ్వరిదేవిగా దర్శనమిస్తారని వివరించారు.
8న సాయంత్రం 5గంటలకు కృష్ణానదిలో తెప్పోత్సవం నిర్వహిస్తామన్నారు.
7. శుభమస్తు
తేది : 7, సెప్టెంబర్ 2019
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : భాద్రపదమాసం
ఋతువు : వర్ష ఋతువు
కాలము : వర్షాకాలం
వారము : శనివారం
పక్షం : శుక్లపక్షం
తిథి : నవమి
(నిన్న రాత్రి 8 గం॥ 49 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 9 గం॥ 26 ని॥ వరకు)
నక్షత్రం : మూల
(ఈరోజు తెల్లవారుజాము 4 గం॥ 59 ని॥ నుంచి
మర్నాడు ఉదయం 6 గం॥ 28 ని॥ వరకు)
యోగము : ప్రీతి
కరణం : బాలవ
వర్జ్యం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 28 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 9 ని॥ వరకు)(ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 28 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 10 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు రాత్రి 11 గం॥ 40 ని॥ నుంచి మర్నాడు తెల్లవారుజాము 1 గం॥ 21 ని॥ వరకు)(ఈరోజు రాత్రి 11 గం॥ 41 ని॥ నుంచి మర్నాడు తెల్లవారుజాము 1 గం॥ 23 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 7 గం॥ 41 ని॥ నుంచి ఈరోజు ఉదయం 8 గం॥ 30 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 9 గం॥ 7 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 39 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 6 గం॥ 2 ని॥ నుంచి ఈరోజు ఉదయం 7 గం॥ 34 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 46 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 18 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 2 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 25 ని॥ లకు
సూర్యరాశి : సింహము
చంద్రరాశి : ధనుస్సు
8. చరిత్రలో ఈ రోజు/సెప్టెంబరు 7*
1533 : ఇంగ్లాండు మహారాణి ఇంగ్లాండ్ యొక్క ఎలిజబెత్ I జననం (మ.1603).
1914 : తెలుగు సాహిత్యంలో పేరడీలకు ఆద్యుడు జరుక్ శాస్త్రి జననం (మ.1968).
1925 : ప్రముఖ నటీమణి భానుమతి జననం (మ.2005).
1953 : మలయాళ సినిమా అగ్రనటుల్లో ప్రముఖుడు మమ్ముట్టి జననం.
1976 : తెలుగు సినిమా సంగీత దర్శకులు భీమవరపు నరసింహారావు మరణం.(జ.1905)
1986 : తెలుగు సినిమా నిర్మాత, రచయిత మరియు దర్శకుడు పి.ఎస్. రామకృష్ణారావు మరణం (జ.1918).
1990 : ప్రఖ్యాతి గాంచిన రేడియో వ్యాఖ్యాత మరియు సాహిత్య రచయిత ఉషశ్రీ మరణం (జ.1928).
1983 : భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల జననం.
1991: తెలంగాణాలో కమ్యూనిష్ట్ పక్ష స్థాపన, నిర్మాణ, నిర్వహణలో, రైతు,కార్మిక,విద్యార్థి సంఘాల నిర్వహణలోప్రముఖ పాత్ర వచించిన రావి నారాయణ రెడ్డి మరణం (జ. 1908 )
2004 : తొలి తెలుగు టాకీ చిత్రమైన భక్తప్రహ్లాదలో ప్రహ్లాదునిగా నటించిన బాలనటుడు కృష్ణాజిరావు సింధే మరణం (జ.1923).
9. ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గామల్లేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 29నుంచి దసరా నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమవుతాయని ఆలయ ఈవో ఎం.వి.సురే్‌షబాబు అన్నారు. 30నుంచి తెల్లవారు జామున 3గంటల నుంచే దర్శనం చేసుకునే అవకాశం ఉందన్నారు. అమ్మవారు 29న స్వర్ణ కవచాలాంకృత దుర్గాదేవిగా, 30న బాలాత్రిపుర సుందరి, అక్టోబరు 1న గాయత్రీదేవి, 2న అన్నపూర్ణాదేవి, 3న లలితా త్రిపురసుందరీ దేవి, 4న మహాలక్ష్మిదేవి, 5న సరస్వతీ దేవి, 6న దుర్గాదేవి, 7న మహిషాసురమర్ధని, 8న శ్రీరాజరాజేశ్వరిదేవిగా దర్శనమిస్తారని వివరించారు.
10. దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయం ఈవో M.V సురేష్ బాబు

దసరా ఉత్సవాలు 29 -9- 2019 నుండి 8-10-2019 వరకు జరుగుతాయి.దీనికి సంబంధించి అన్ని ఏర్పాటు పూర్తిస్థాయిలో చేశాం.మొదటిరోజు స్నపనాభిషేకం అనంతరం ఉదయం 9 గంటలకు దర్శనం ప్రారంభించబడును.మిగతా రోజుల్లో ఉదయం 3 గం నుండి రాత్రి 11 వరకు వరకు దర్శనం ఉంటుంది.మూల నక్షత్రం రోజు ఉదయం రెండు గంటల నుండి రాత్రి 11 గంటల వరకు దర్శనం ఉంటుంది.దుర్గ గుడికి వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా క్యూలైన్లను ఏర్పాటు చేయడం జరిగింది..కొండ కింద ఉన్న వినాయకుడి దగ్గర నుండి క్యూ లైన్ ఏర్పాటు చేశాము..ని క్యూ లైన్లో వాటర్ ప్యాకెట్ షామియానా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయడం జరిగింది..భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది..ముఖ్యమైన ప్రదేశాలు నుంచి మైకు ప్రచార కేంద్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది..భక్తుల భద్రత దృశ్య సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం.జిల్లా కలెక్టర్ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయడం జరిగింది.వృద్దులు మరియు దివ్యాంగులకు ప్రత్యేక వాహనాలు వైపుకు రాజీవ్ గాంధీ పార్కు వద్ద ఉచిత బస్సులు ఏర్పాటు చేయటం రైల్వే స్టేషన్ వద్ద దేవాలయం సంబంధించిన బస్సు ఏర్పాటు చేయడం జరిగింది..
11. దసరా ఉత్సవాలు వైభవోపేతం
అమ్మలగన్నయమ్మ బెజవాడ కనకదుర్గమ్మ వైభవమంతా దసరా ఉత్సవాలలోనే కనిపిస్తుంది. రాష్ట్రంలో రెండో అతిపెద్ద పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 29న ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ప్రారంభమై.. వచ్చే నెల 8వ తేదీ వరకు పది రోజులపాటు అంగరంగ వైభోగంగా దసరా ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలలో అమ్మవారు రోజుకొక అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ ఉత్సవాలను విజయవంతం చేయడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దేవస్థానం అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
**ఇంద్రకీలాద్రిపై స్వయంభువుగా వెల సిన జగన్మాత దుర్గమ్మను దర్శిం చుకునేందుకు రోజూ వేలాదిగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నా.. కోరిన కోరి కలు తీర్చే దుర్గమ్మ వైభవాన్ని దసరా ఉత్స వాల్లోనే చూడగలం. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా పొరుగున ఉన్న తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఒడిషా తదితర రాష్ట్రా ల నుంచి కూడా భక్తులు పెద్దఎత్తున తరలి వస్తారు. ఈ ఏడాది దసరా ఉత్సవాలను గతంలో కన్నా వైభవంగా నిర్వహించి విజయవంతం చేసేందుకు అధికారులు కూడా ఏర్పాట్లలో తలమునకలయ్యారు. ఆ వైభవాన్ని కనులారా తిలకించడంతోపాటు అమ్మ కటాక్షం పొందేందుకు ఈ ఏడాది 12 నుంచి 13 లక్షల మంది భక్తులు వస్తారని దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా అమ్మవారి జన్మనక్షత్రమైన మూ లానక్షత్రం రోజున జగజ్జనని దర్శనం కోసం భక్తులు పోటెత్తుతారు.
గత ఏడాది మూలానక్షత్రం రోజున సుమారు మూడున్నర లక్షల మంది భక్తులు అమ్మను దర్శించుకున్నారు. ఏడాది ఆ సంఖ్య నాలుగు లక్షలు దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఆరోజు భక్తులందరికీ అమ్మవారి దర్శనభాగ్యం కల్పించడం, తగిన భద్రత, సౌకర్యాలు కల్పించడం అధికారులకు సవాలే.
**ఈవో పర్యవేక్షణలో ఏర్పాట్లు
ఈ ఏడాది దసరా ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అమ్మ వారి దర్శనభాగ్యం కల్పించడంతోపాటు అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని ఇటీవలే బాధ్యతలు చేపట్టిన దుర్గగుడి ఈవో ఎంవీ సురేష్‌బాబు పట్టుదలతో ఉన్నారు. గురు వారం క్యూలైన్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. దేవస్థానం పరిపాలన సిబ్బంది, వైదిక కమిటీ, అర్చకులతో ఇప్పటికే దఫదఫాలుగా సమావేశాలు నిర్వహిస్తూ కొండపైన, కొండ దిగువన దసరా ఉత్సవాలకు చేయాల్సిన ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. గత ఏడాది వచ్చిన భక్తుల కంటే ఈసారి మరింత ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున పక్కాగా ఏర్పాట్లు చేయాలని దేవస్థానం ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు.
**భక్తులకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు, క్యూలైన్లు, వాటర్‌ ప్రూఫ్‌ షెడ్ల నిర్మాణం, ఉచిత వైద్య శిబిరాలు, వృద్ధులు, వికలాంగులకు ఉచిత రవాణా సౌకర్యం, వీఐపీలు, ఉభయదాతలకు ప్రత్యేక దర్శనాలు, లైటింగ్‌, పూలాలంకరణ, వాహనాలకు పార్కింగ్‌ ఏర్పాట్లు, తలనీలాల సమర్పణకు ప్రత్యేక కేశఖండనశాల ఏర్పాటు, అదనపు మరుగుదొడ్లు, భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే ఘాట్‌ల వద్ద గజ ఈతగాళ్లు, అమ్మవారి హంసవాహనం, తెప్పోత్సవాల నిర్వహణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసి దసరా ఉత్సవాలను విజయవంతం చేసేందుకు అందరూ కంకణబద్ధులు కావాలని కోరారు. మరోవైపు జిల్లా కలెక్టరు ఇంతియాజ్‌ కూడా దసరా ఉత్సవాల ఏర్పాట్లపై దృష్టి సారించారు. ఇప్పటికే దుర్గగుడి అధికారులతోపాటు వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
**ఏర్పాట్లకు టెండర్లు ఖరారు..
ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలకు పటిష్టమైన ఏర్పాట్లు చేసేందుకు దేవస్థానం ఇంజనీరింగ్‌ విభాగం అధికారులు రూ.1.50 కోట్లతో అంచనాలు రూపొందించి టెండర్ల ప్రక్రియను పూర్తి చేశారు. ఇప్పటికే కెనాల్‌ రోడ్డులోని వినాయకుని గుడి వద్ద నుంచి క్యూలైన్ల నిర్మాణ పనులు మొదలయ్యాయి. దుర్గమల్లేశ్వరస్వామి వార్ల ఆలయాల తోపాటు ఇంద్రకీలాద్రి కొండపైన, దిగువన పరిసరాలన్నీ విద్యుద్దీపాలతో అలంకరించనున్నారు. భక్తుల సౌకర్యార్థం కొండపైన, కింద వాటర్‌ప్రూఫ్‌ షెడ్లు, షామియానాలు ఏర్పాటు చేయనున్నారు. భక్తులు అమ్మవారికిఇ తలనీలాలు సమర్పించేందుకు వీలుగా కృష్ణానది ఒడ్డున పద్మావతి ఘాట్‌ వద్ద ప్రత్యేక కేశఖండనశాల ఏర్పాటు చేయనున్నారు. కృష్ణానదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే దుర్గా ఘాట్‌, కృష్ణవేణి ఘాట్‌, పద్మావతి ఘాట్‌, దోబీఘాట్‌లలో ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. ఇంద్రకీ లాద్రి కొండపైన, దిగువన పరిసరాల తోపాటు కెనాల్‌ రోడ్డు పరిసరాలలో అదనపు సీసీ కెమెరాలు ఏర్పాటు, వృద్ధులు, దివ్యాంగుల కోసం ఉచిత వాహన సౌకర్యం, భక్తులకు సమస్త సమాచారాన్ని అందిస్తూ ఎప్పటికప్పుడు మైక్‌ అనౌన్స్‌మెంటుకు టెండర్లు ఖరారయ్యాయి.
**అమ్మవారి అలంకారాలు ఇలా..
ఈనెల 29న స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి
30న బాలాత్రిపుర సుందరి
అక్టోబరు 1న శ్రీ గాయత్రి దేవి
2న.. శ్రీ అన్నపూర్ణదేవి
3న.. శ్రీ లలితా త్రిపురసుందరీదేవి
4న.. శ్రీ మహాలక్ష్మీదేవి
5న.. శ్రీ సరస్వతీదేవి
6న.. దుర్గాదేవి (దుర్గాష్టమి)
7న.. మహిషాసురమర్ధిని
8న.. శ్రీ రాజరాజేశ్వరిదేవి
12. యాదాద్రి ఆలయంలో ఆ శిల్పాలను వెంటనే తొలగించాలి : రేవూరి ప్రకాశ్ రెడ్డి
ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో తెలంగాణను దోచుకుంటున్నారని బీజేపీ నేత రేవూరి ప్రకాశ్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రాజెక్టుల పేరుతో ఆంధ్ర కాంట్రక్టార్లకు దోచిపెడుతున్నారని, త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణలో కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందని మండిపడ్డారు. ఏబీఎన్‌తో ఆయన మాట్లాడుతూ… యాదాద్రిలో కేసీఆర్, ఇతర శిల్పాలను సంప్రదాయానికి విరుద్ధమని, వెంటనే వాటిని తొలగించాలని డిమాండ్ చేశారు. గతంలో మనమడితో రాముడికి తలంబ్రాలు మోయించారని, కేసీఆర్ పాలన రాచరిక పాలన తలపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.టీఆర్‌ఎస్ రెండు ముక్కలు కావడం ఖాయమని, ఈటల, రసమయి వ్యాఖ్యలు చూస్తే రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులున్నాయో అర్థమౌతోందని అన్నారు. రాష్ట్రంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి తలెత్తిందని, రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని విమర్శించారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని, కాంగ్రెస్‌కు దిక్కూదివాన లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీ పాత్రను పోషించడం లేదని, బీజేపీయే ప్రత్యామ్నాయమని రేవూరి స్పష్టం చేశారు.
13. ఖైరతాబాద్‌లో పెరిగిన భక్తుల సందడి
ఖైరతాబాద్‌ గణపతి వద్ద భక్తుల తాకిడి పెరిగింది. వీహెచ్‌పీ అంతర్జాతీయ పూర్వ అధ్యక్షుడు రాఘవరెడ్డి, భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి హనుమంతరావు, కార్యదర్శి శశిధర్‌, భాస్కర్‌లు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరంగల్‌ మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు కుటుంబ సమేతంగా వచ్చి పూజలు చేశారు.
12. ఖైరతాబాద్‌ గణేశ్‌ నిమజ్జన ప్రాంతం మార్పు
ఖైరతాబాద్‌ మహాగణపతి నిమజ్జనం ఈ సారి మరింత ప్రత్యేకంగా ఉంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. ఈసారి మహాగణపతిని క్రేన్‌ నంబర్‌ నాలుగు వద్ద కాకుండా, ఆరో నంబర్‌ క్రేన్‌ వద్ద నిమజ్జనం చేస్తున్నామని గ్రేటర్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తెలిపారు. మం త్రి, మేయర్‌ జీహెచ్‌ఎం సీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ విశ్వజిత్‌, ఖైరతాబాద్‌ జోనల్‌ కమిషనర్‌ ముషారఫ్‌ ఫారుఖీ, ఏసీపీ వేణుగోపాల్‌రెడ్డి, ఇతర అధికారులతో కలిసి ఎన్టీఆర్‌ మా ర్గంలో వివిధ శాఖల కోసం ఏర్పాటు చేసిన క్యాంపు కార్యాలయాలను ప్రారంభించారు. ఖైరతాబాద్‌ ద్వాదశాదిత్య మహాగణపతిని నిమజ్జనం చేసే ప్రాంతంలో చేపడుతున్న చర్యలను సమీక్షించారు.ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ జీహెచ్‌ఎంసీ పరిధిలో 55వేల వినాయక విగ్రహాలు మండపాల్లో పూజలు అందుకుంటున్నాయని, వాటిని విడతల వారీగా నిమజ్జనానికి తరలిస్తారని తెలిపారు. గతంలో ఎదురైన సంఘటనలను పరిగణలోనికి తీసుకుని ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. నిమజ్జనాన్ని తిలకించేందుకు వచ్చే భక్తులకు, శోభాయాత్రలతో వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఖైరతాబాద్‌ వినాయక విగ్రహ నిమజ్జనాన్ని అన్ని శాఖలతో పా టు గణేశ్‌ ఉత్సవ కమిటీ, ప్రజా ప్రతినిధుల అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకుని మధ్యాహ్నం వరకు నిమజ్జనం అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.