Sports

జీతం ₹10కోట్లు

Coach Ravi Shastry To Get Paid 10Crores As Salary

టీమిండియా ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి వార్షిక వేతనం దాదాపు 20 శాతం వరకు పెరిగిందని సమాచారం. ఆయనతో పాటు సహాయ సిబ్బంది వేతనాలు సైతం పెరిగాయని తెలిసింది. గతేడాది వరకు శాస్త్రికి బీసీసీఐ ఏడాదికి రూ.8 కోట్లు చెల్లించేది. ప్రపంచకప్‌తో అతడి పదవీ కాలం ముగిసింది. వెస్టిండీస్‌ సిరీస్‌ కోసం 45 రోజులు గడవు పొడగించారు. కొత్త కోచ్‌, సహాయ సిబ్బంది ఎంపికకు నోటిఫికేషన్‌ జారీ చేశారు. కపిల్‌దేవ్‌, అన్షుమన్‌ గైక్వాడ్‌, శాంత రంగస్వామి నేతృత్వంలోని క్రికెట్‌ సలహా కమిటీ అభ్యర్థులకు ముఖాముఖి నిర్వహించింది. మళ్లీ రవిశాస్త్రినే కొత్త కోచ్‌గా ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో ఆయన వార్షిక వేతనం 20% వరకు పెంచారట. అంటే రూ.9.5 కోట్ల నుంచి రూ.10 కోట్లకు వరకు పొందే అవకాశం ఉంది.