Movies

గతాన్ని విడిచిపెట్టాలని నాగ్ టాటూ

Nagarjuna Reveals His Tattoo Details

ఎప్పటికప్పుడు ట్రెండ్‌ను ఫాలో అవుతూ ప్రేక్షకులను అలరించే కథానాయకుడు నాగార్జున. అంతేకాదు, యువ ప్రతిభను ప్రోత్సహించడంలోనూ ఆయన ఎప్పుడూ ముందుంటారు. ఇక కొత్త ఫ్యాషన్‌లను అనుకరిస్తూ తన ఇద్దరి కుమారులకన్నా స్టైల్‌గా కనిపిస్తూ ఉంటారు. ఇటీవలే ఆయన తన 60వ పుట్టినరోజున ఘనంగా జరుపుకొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన ఎడమ చేతిపై ఓ టాటూను వేయించుకున్నారు. తాజాగా ‘బిగ్‌బాస్‌’షోకు యువ కథానాయకుడు నాని రాగా, నాగార్జున చేతిపై ఉన్న టాటూ వెనుక కథను చెప్పాల్సిందిగా కోరారు. ‘ఇది నా 30వ పుట్టినరోజు సందర్భంగా వేయించుకున్న టాటూ. మొన్ననే జరిగింది కదా(నవ్వులు). ఈ టాటూ వెనుక అర్థం ఏంటంటే, నాగుపాము కుబుసాన్ని విడిచి పెట్టేస్తుంది. నేను కూడా గతాన్ని గురించి అస్సలు పట్టించుకోను. దానిపైన ఉన్న కన్ను నాదే. జీవితంలో కొత్త విషయాలను వెతుకుతూ ఉంటానన్న గుర్తుకు కన్ను బొమ్మ. కంపాస్‌(దిక్సూచి) పైన ఉన్న ‘ఎన్’ అనే అక్షరం ఉత్తర దిక్కు కావచ్చు. లేదా నా పేరు కూడా కావొచ్చు. చివరిగా సంతోషం అనేది గుండెల్లోనే ఉంటుందని అని చెప్పడం దీని అర్థం’’ అని చెప్పుకొచ్చారు. ఇక ఈ షోలో నాని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన తన కొత్త చిత్రం ‘గ్యాంగ్‌లీడర్‌’ గురించిన విషయాలను అభిమానులతో పంచుకున్నారు. హాస్యంతో కూడిన రివేంజ్‌ డ్రామా ప్రేక్షకులను అలరిస్తుందని, సెప్టెంబరు 13న విడుదలవుతున్న తన చిత్రాన్ని తప్పకుండా చూడాలని అభిమాలను కోరారు.