NRI-NRT

నాట్స్ టెంపా ఆధ్వర్యంలో ఆర్థిక సదస్సు

NATS Tampa Bay Chapter Conducts Financial Planning Meet-నాట్స్ టెంపా ఆధ్వర్యంలో ఆర్థిక సదస్సు

నాట్స్ టెంపా ఆధ్వర్యంలో స్థానిక న్యూ టెంపా రీజనల్ లైబ్రరీలో ఆర్ధిక అక్షరాస్యతపై సదస్సు నిర్వహించారు. శ్రీథర్ గౌరవెల్లి ఈ సభలో ప్రసంగించి పలు సూచనలు సలహాలు అందించారు. ఉన్నతవిద్యకు ఎలా నిధులు పొందాలి..? అమెరికాలో బీమా పద్ధతులు, ట్యాక్స్ ప్రణాళికలో ఎలాంటి వ్యూహాలు ఉండాలి..? గృహాలు, ఎస్టేట్ లు కొనటానికి ఎలా ప్లాన్ చేసుకోవాలి..? ఆరోగ్య సంరక్షణకు ఎలా మనీ ప్లాన్ చేసుకోవాలి..? సంపాదించే డబ్బును చక్కటి ప్రణాళికతో దేనికెంత ఖర్చు చేయాలి..? పొదుపు ఎలా చేసుకోవాలి..? ఇలాంటి అంశాలపై శ్రీధర్ కూలంకుషంగా వివరించారు. టెంపా నాట్స్ సమన్వయకర్త రాజేశ్ కండ్రు నాయకత్వంలో ఏర్పాటు చేసిన ఈ సదస్సుకు వంశీలతో పాటు పలువురు నాట్స్ నాయకులు, వాలంటీర్లు ఈ సదస్సు విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు.