Movies

అది విధి ప్రభావం

అది విధి ప్రభావం

‘‘నటిని కావడం మొదలుకొని, నాకొచ్చే అవకాశాల వరకూ అన్నీ అనుకోకుండానే జరుగుతుంటాయి. అందుకే కెరీర్‌ పరంగానైనా… వ్యక్తిగతంగాఅయినా దేని గురించీ ఎక్కువగా ఊహించుకోను’’ అంటోంది మెహరీన్‌. ‘ఎఫ్‌2’తో ఘన విజయాన్ని అందుకొన్న ఈ నాయిక ప్రస్తుతం ‘ఎంత మంచివాడవురా’, ‘చాణక్య’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. విధిని బలంగా నమ్ముతానని చెబుతోంది మెహరీన్‌. ‘‘చిన్నప్పుడు చాలా ప్రాక్టికల్‌గా ఆలోచించేదాన్ని. అలాంటి వాతావరణంలోనే పుట్టి పెరిగా. కానీ పెద్దయ్యేకొద్దీ నా జీవితంలో ఊహించని సంఘటనలు జరిగాయి. నటిని కావాలని ఎప్పుడూ అనుకోలేదు, కానీ అయ్యాను. నలుగురితో అంత సులభంగా కలిసిపోలేని నేను ఇంత పెద్ద ప్రపంచంలోకి అడుగుపెట్టా. ఇలా ఒకొక్కటి జరుగుతున్నకొద్దీ విధి ప్రభావం ఎలాంటిదో అర్థమైంది. అందుకే నా కష్టాన్ని ఎంతగా నమ్ముతుంటానో, విధిని నమ్మడం అంతే అలవాటైంది. విజయాలు వచ్చినా పొంగిపోను. విజయాన్ని ఆస్వాదించడం కంటే నన్ను నమ్మిన పరిశ్రమకు, ఇంత ప్రేమని పంచిన ప్రేక్షకులకి సంతృప్తినిచ్చేలా పని చేయాలనే ఆలోచనతోనే ఉంటాన’’ని చెప్పింది మెహరీన్‌.