Kids

బేబీ ఆయిల్ మీ ఇష్టం వచ్చినట్టు వాడకండి

బేబీ ఆయిల్ మీ ఇష్టం వచ్చినట్టు వాడకండి

బేబీ ఆయిల్‌… పేరులోనే అది పిల్లల కోసం తయారు చేసిందని అర్థమైపోతుంది. కానీ అందాన్ని మెరుగుపరిచే సాధనాల్లో ఇది కూడా ఒకటి తెలుసా.
* ముఖానికి వేసుకున్న అలంకరణ తీసేయడానికి ఖరీదైన మేకప్‌ రిమూవర్‌లే వాడక్కర్లేదు. కొద్దిగా బేబీ ఆయిల్‌ని టిష్యూపై వేసుకుని ముఖం తుడుచుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి తేమ అంది ఆరోగ్యంగా ఉంటుంది.
* పొడి చర్మతత్వం ఉన్నవారు చర్మం తడిపొడిగా ఉన్నప్పుడు ఈ నూనె రాసుకోవాలి. చర్మానికి తేమ అంది… తాజాగా మారుతుంది. కాలి పగుళ్లకూ ఇది చక్కగా పనిచేస్తుంది.
* వ్యాక్సింగ్‌ చేయించుకున్నాక దద్దుర్లు రాకుండా ఉండాలంటే… కొద్దిగా ఆ నూనె రాసి మర్దన చేస్తే చాలు. చర్మం సాంత్వన పొందుతుంది. మృదువుగానూ మారుతుంది.
* కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడినప్పుడు ఈ ఆయిల్‌ని కొద్దిగా తీసుకుని అక్కడ మృదువుగా మర్దన చేస్తే సరి. ఇలా కొన్నిరోజులు చేస్తే రక్తప్రసరణ సరిగ్గా జరిగి అవి పోతాయి.
* కొందరు పెదాల్ని తరచూ తడుపుతూ ఉంటారు. ఇంకొన్నిసార్లు వాతావరణం వల్ల రంగు మారడం, పగుళ్లూ, మృతకణాలు వంటివి ఇబ్బందిపెడతాయి. ఇలాంటప్పుడు బేబీ ఆయిల్‌లో కొద్దిగా తేనె, పంచదార కలిపి మృదువుగా రుద్దితే సరిపోతుంది.