Food

చేదు కూరగాయలతో అలర్జీల ఆటకట్టు

Bitter Veggies Aids To Fight Against Allergies

అలర్జీ చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య కొన్నిరకాల పదార్థాలకు చర్మం అతిగా స్పందించడం వల్లే ఇది ఎదురవుతుంది. ఆహార పదార్థాలు, సౌందర్య ఉత్పత్తులు, గాలి ద్వారా వచ్చే కొన్ని పొగలు, పుప్పొడి రేణువులు, కాలుష్యం, ఫంగస్‌, ఎండ వంటివి ఇందుకు కారణాలు. ఆయుర్వేదంలో దీన్ని ‘అసాత్మ్యం’ అంటారు. అంటే ‘శరీరానికి సరిపడనివి’ అని అర్థం. ఒక్కొక్కరి శరీరతత్వం ఒక్కోలా ఉంటుంది. కొందరికి కొన్ని పదార్థాలు సరిపడవు. అటువంటప్పుడే చర్మంపై పొక్కులు, ఎర్రబడటం, దురద, పొక్కుల నుంచి రసి కారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్నిసార్లు ఓ పట్టాన తగ్గదీ సమస్య.

అలర్జీకి కారణం తెలుసుకునేందుకు ప్రయత్నించాలి. ఏదైనా ఆహారం తీసుకున్నప్పుడు ఈ సమస్య వచ్చిందని గుర్తించగలిగితే, ఆ పదార్థాలకు దూరంగా ఉండాలి. కొన్నిసార్లు సౌందర్య ఉత్పత్తుల వినియోగం, జుట్టుకు వేసే రంగులు తగ్గించాలి. రోజూ పది గ్లాసుల మంచినీటిని తాగాలి. గ్లాసు పచ్చి కూరగాయల రసం తీసుకోవాలి. టొమాటో, క్యారెట్‌, కీరదోస, నిమ్మరసాల్లో ఏదో ఒకటి నిత్యం తాగితే మంచిది. కారం, మసాలా, తేలికగా జీర్ణంకాని ఆహారాన్ని తగ్గించుకోవాలి. చేదుగా ఉండే మెంతులు, మెంతికూర, కాకరకాయ, గోరు చిక్కుడు వంటివి ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిది.