Kids

పిల్లలూ…నా కథ చెప్తా రండి

Almond Tree Story - Telugu Kids News And Info Stories

నేను మీకు అంతగా తెలియకపోవచ్చుగానీ…నా గింజలు మీకు బాగా పరిచయమే…అంతేనా? అవంటే మీకు ఎంతో ఇష్టం…వాటితో తయారైన పదార్థాలంటే మరీనూ…ఇంతకీ నేనెవరంటే బాదం చెట్టును…నా సంగతులు చెప్పాలని ఇలా వచ్చా!

నేను మామూలు చెట్లలానే ఉంటా. 13 నుంచి 33 అడుగుల ఎత్తు వరకు పెరిగేస్తా. మా జీవిత కాలం ఇంచుమించు 25 సంవత్సరాలు. ఆకులేమో మూడు నుంచి ఐదు అంగుళాల పొడవు ఉంటాయి. దాదాపు ఐదు నుంచి ఆరు సంవత్సరాల తర్వాత నుంచి మాకు కాయలు కాస్తాయి. అవి పండాక పగలగొడితే వచ్చేదే బాదం పప్ఫు. అక్కడే ఎక్కువ!
* ప్రపంచం మొత్తం మీద ఇంచుమించు 80శాతం బాదంఅమెరికాలోనే పండుతుంది.
* ఇజ్రాయిల్‌ బాదం పెద్దగా, భలే రుచిగా ఉంటుంది. ●

నన్ను తెలుగులో బాదం చెట్టు, ఆంగ్లంలో ఆ(ల్‌)మండ్‌ ట్రీ అంటారని తెల్సు కదా! నాది రోసేసి కుటుంబం. ప్రునస్‌ డల్సిస్‌ నా శాస్త్రీయ నామం. నేను ఎక్కువగా మధ్య ఆసియా దేశాల్లో కనిపిస్తుంటా. ఇంకా అమెరికా, స్పెయిన్‌, ఇటలీ, మొరాకో, ఆస్ట్రేలియా వంటి దేశాల్లోనూ. సూర్యరశ్మి, నీళ్లు నాకెక్కువగా కావాలి. ఇసుక, బంకమట్టి నేలల్లో పెరిగేస్తుంటా. మాలో తీపిబాదం, చేదుబాదం అనే రెండు రకాలున్నాయి. తీపి బాదాన్ని మిఠాయిల్లో, బాదం పాల కోసం ఎక్కువగా వాడేస్తుంటారు. రెండోదాన్ని బాదం నూనె తయారీకి ఉపయోగిస్తారు.

* నా వల్ల మీకు బోలెడంత మేలు జరుగుతుంది. పాలు, పప్పు, నూనె వంటివెన్నో నా నుంచి వస్తాయి. నా పప్పులో ఉండే మెగ్నీషియం కండరాల నొప్పుల్ని దూరం చేస్తుంది. క్యాల్షియం ఎముకల్ని దృఢంగా చేస్తుంది. నా పాలలో విటమిన్‌ ‘ఈ’ ఉంటుంది. ఇంకా ప్రొటీన్‌, ఫాస్ఫరస్‌, పొటాషియం, జింక్‌, కాపర్‌, బి విటమిన్లు, పీచు పదార్థం వంటివెన్నో నా గింజల ద్వారా మీకు అందుతాయి.
* నా నూనెల్ని సౌందర్య ఉత్పత్తుల్లో, కొన్ని రకాల ఔషధాల్లో వాడుతుంటారు.
* నా గింజల్ని ‘మెదడుకు మేత’గా చెబుతుంటారు. అందుకే మీలాంటి పిల్లల్లో జ్ఞాపకశక్తి పెంచడానికి నా పప్పులు తినిపిస్తుంటారు.