Politics

పరిశ్రమల శాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం ఛైర్మన్‌గా కేకే

K Kesava Rao Appointed As Industrial Corp Chairman

పరిశ్రమల శాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం ఛైర్మన్‌గా రాజ్యసభ సభ్యుడు, తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె. కేశవరావు నియమితులయ్యారు. ఈ మేరకు లోక్‌సభ సెక్రటరీ జనరల్ శనివారం ప్రకటన విడుదల చేశారు. ఈ కమిటీలో 21 మంది ఎంపీలు, 10 మంది రాజ్యసభ సభ్యులు ఉంటారు. లోక్‌సభలో ప్రాధాన్యం ఉన్నటువంటి కమిటీకి తనను ఛైర్మన్‌గా ఎంపిక చేయడం పట్ల కేశవరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి తనను ఛైర్మన్‌గా నిమమించిన విషయాన్ని తెలియజేశారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ కేశవరావుకు శాలువా కప్పి అభినందించారు.