DailyDose

జగన్‌పై పవన్ విమర్శలు:తాజావార్తలు-09/14

Ox Eats Mangalasutra - Telugu Breaking News -09/14

* రాజధాని అమరావతిలో పవన్ కళ్యాన్ పర్యాటన రెండో రోజు కొనసాగింది. జగన్ పరిపాలన పారదర్శకంగా లేదని పవన్ ఆరోపించారు
* వైసీపీ 100 రోజుల పాలన పై జనసేన 33 పేజీల పుస్తకాన్ని విడుదల చేసింది
* చిత్తూరు జిల్లాలో ఒక కారులో అగ్ని ప్రమాదం జరిగి ఐదుగురు మృతిచెందారు
* అంబాని కుటుంబానికి ఆదాయపు పన్ను శాఖా నోటీసులు పంపించడం వాణిజ్య వర్గాల్లో కలకలం రేపింది
* గుంటూరులో 55 ఏళ్ల మహిళకు అత్యంత ప్రమాదకరమైన న్యూడిల్లీ బ్యాక్టీరియా సోకినట్లు గుర్తించారు
* పార్లమెంట్ లో వాణిజ్య శాఖా స్టాండింగ్ కమిటీ చైర్మెన్ గా విజయ సాయిరెడ్డి నియామకం అయ్యారు
* మహారాష్ట్రలోని సతారా ఎంపీ ఉదయన్ రాజ్ భోంస్లే ఎన్సీపీ పార్టీకి రాజీనామా చేసి భాజాపాలో చేరారు
* మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు ఆర్ ఎస్ రత్నాకర్ పై తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 35 మంది వివిధ శాఖల అధికారులు , తమను బ్లాక్మెయిల్ చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసారు
* మహారాష్ట్రలోని అహమద్ నగర్ లో ఒక ఎద్దు ఓ మహిళ మెడలోని మంగళసూత్రం లాక్కొని మింగేసింది. దీని ఖరీదు 1.50 లక్షల రూపాయిలు
* కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం భాజాపాలో చేరుతున్నట్లు వార్తలు వెలువడ్డాయి
* చీరాల ఎమెల్యే కారణం బలరం ఎన్నిక చెల్లదంటూ దాఖలైన కేసులో హైకోర్టు ఆయనకు నోటీసులు జారీ చేసింది
* నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఇరువర్గాలకు చెందినా వ్యక్తులు తన్నుకున్నారు
* తోట త్రిమూర్తులు తేదేపాకు రాజీనామా చేస్తూ చంద్రబాబుకు రాసిన లేఖ కలకలం సృష్టిస్తుంది
* ఛత్తీస్ ఘడ్ లో ఇరువురు మావోయిస్టులను పోలీసులు కాల్చి చంపారు
* విశాఖా జిల్లా నర్సీపట్నం పోలీస్ స్టేషన్ మేడ పైన నుండి ఒక నిందితుడు కిందకు దూకాడు. వెంటనే పోలీసులు అతన్ని అరెస్ట్ చేసారు.