DailyDose

తెలుగులో మోడీ సంతాపం:తాజావార్తలు-09/15

తెలుగులో మోడీ సంతాపం:తాజావార్తలు-09/15

* బోటు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ప్రధాని మోడీ తీవ్ర సంతాపం తెలిపారు. తెలుగులో ట్వీట్ చేశారు.
* బోటు ప్రమాద మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ఏపీ ప్రభుత్వం 10 లక్షల ఆర్ధిక సాయాన్ని ప్రకటించింది
* బోటు ప్రమాదంలో 15 మంది వరంగల్ వాసుల గల్లంతు
* భార్యను హత్య చేసి తరువాత ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి. ఈ ఘటన భద్రాచలం వద్ద జరిగింది
* యాదాద్రి సమీపంలోని రామాజీపేట వద్ద బైక్ పై వెళ్తున్న భార్యాభర్తలను ఒక కారు డీ కొట్టడంతో వారు అక్కడికక్కడే మృతిచెందారు
* ఉల్లి ధరలకు మళ్ళీ రెక్కలు వచ్చాయి. మార్కెట్ లో కేజీ ఉల్లి ధరలు 40 నుండి 50 రూపాయిలకు చేరాయి
* దాదాపు తొమ్మిది నెలల తర్వాత హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు చంద్రబాబు విచ్చేశారు
* మార్షల్ చిత్రానికి అవార్డులు తప్పనిసరిగా వస్తాయని నటుడు శ్రీకాంత్ ఆశాభావం వ్యక్తపరిచారు
* గుజరాత్ లోని దిర్నార్ అటవీ ప్రాంతం సమీపంలో రోడ్ల పైకి ఏడూ సింహాలు వచ్చి తిరగటం ఆ ప్రాంత ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది
* యురేనియం తవ్వకాలకు అనుమతులు ఇవ్వటం లేదని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు
* కరీంనగర్, ఖమ్మంలలో ఐటీ టవర్ లను నిర్మిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు