Editorials

ఇండియా ముందు మేము జుజుబి-ఒప్పుకున్న ఇమ్రాన్

ఇండియా ముందు మేము జుజుబి-ఒప్పుకున్న ఇమ్రాన్

ఇండియాతో యుద్ధం చేస్తే.. మేమే ఓడిపోతాం: ఇమ్రాన్

ఇండియా శక్తి సామర్థ్యాల ముందు నిలబడే శక్తి పాకిస్థాన్ కు లేదని, సంప్రదాయ యుద్ధమే చేయాల్సి వస్తే, పాకిస్థాన్ ఓడిపోయే అవకాశాలే అధికంగా ఉన్నాయని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అంగీకరించారు.

అల్ జజీరా కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

సాధారణ యుద్ధంలో తాము ఓడిపోయినా, అణుయుద్ధంలో మాత్రం సత్తా చూపుతామంటూ ఇమ్రాన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా చేశారు. 
       
యుద్ధం అంటూ జరిగితే, రెండు దేశాలూ అణ్వస్త్రాలను ఉపయోగిస్తాయని, అదే జరిగితే, దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

తాను యుద్ధాన్ని కోరుకోవడం లేదని అంటూనే ఇమ్రాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

యుద్ధం జరిగితే, తమకు ఓటమి తప్పదని వ్యాఖ్యానించడం గమనార్హం.