DailyDose

మరో అనీల్ అంబానీ సంస్థ దివాలా-వాణిజ్యం-09/16

GCX Files Bankruptcy-Telugu Business News Today-09/16

* ఎయిరిండియా గత ఆర్ధిక సంవత్సరంలో రూ.4600 కోట్ల నిర్వహణ నష్టాన్ని చవిచూసింది. ఇంధన (ఏటీఎఫ్) ధరలు పెరగడానికి తోడు విదేశీ మారకపు ద్రవ్య విలువల్లో వచ్చిన మార్పు ఇందుకు కారణమని సంస్థ తెలిపింది. దేశీయంగా 72 ప్రాంతాలకు, అంతర్జాతీయంగా 41 గమ్యస్థానాలకు ప్రయానికులను చేరవేస్తున్న ఎయిరిండియా, 2019-20 మొదటి త్త్రెమాసికంలో రూ.175-200 కోట్ల నిర్వహణ నష్టాన్ని మూటగట్టుకుంది. జెట్ విమానాలు రద్దవడం వాళ్ళ సీట్ల భర్తీ పెరిగినా, బాలాకోట్ లో దాడుల అనంతరం తమ ఆకాశ మార్గం లో ప్రయాణానికి భారత విమానాలను పాకిస్తాన్ అనుమతిన్చానందున, వేరే మార్గాల్లో వెళ్లేందుకు, రోజుకు రూ.3-4 కోట్ల అదనపు వ్యయం అవ్వడమే ఇందుకు కారణమని ఎయిరిండియా పేర్కొంది.
* పసిడి అక్టోబర్ కాంట్రాక్టు గత వారం రూ.38553 వద్ద నష్టాలతో ఆరంభమైంది. ఆ తర్వాత పుంజుకొని వారం గరిష్టమైన రూ.38697కు చేరింది. మళ్ళీ అమ్మకాలు వెల్లువెత్తడంతో కాంట్రాక్టు రూ. 37449కు పడిపోయింది
* దేశీయంగా ప్రయాణికుల వాహన విపణిలో మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ), టాటా మోటార్స్ వాటాలు తగ్గగా, హ్యందాయ్, మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం) ల వాటా పెరిగిందని వాహన తయారీదార్ల సంఘం (సియాం) గణాంకాలు వెల్లడిస్తున్నాయి
* బంగాళాఖాతంలోని కేజీ-డీ6 సహజవాయువు క్షేత్రంలో తమ భాగస్వామి అయిన కెనడా సంస్థ నికో రిసోర్సెస్కు ఉన్న 10 శాతం వాటాను రిలైయన్స్ ఇండస్ట్రీస్-బ్రిటన్ కు చెందినా బీపీ స్వాధీనం చేసుకున్నాయి
* ఈ ఆర్థిక సంవత్సరంలో అత్యల్ప జీఎస్టీ వసూళ్లు
* దివాలాకు వచ్చిన జీసీఎక్స్‌ లిమిటెడ్‌ – అనిల్‌ అంబానీకి చెందిన మరో కంపెనీ దివాలా పిటిషన్‌ దాఖలు చేసింది. ప్రపంచలోనే అతిపెద్ద అండర్‌ వాటర్‌ కేబుల్‌ నెట్‌వర్క్‌కు యజమాని అయిన జీసీఎక్స్‌ లిమిటెడ్‌ 350 మిలియన్‌ డాలర్లు విలువైన బాండ్ల చెల్లింపులు చేయడంలో విఫలం అయింది. ఈ బాండ్లకు ఆగస్టు 1న మెచ్యూర్‌తేదీ ఉంది. ఇప్పటికే అడాగ్‌ తీవ్రమైన రుణ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఆస్తుల విక్రయం ద్వారా 3.1బిలియన్‌ డాలర్లను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకొంది.

  • * సౌదీలో సగానికి పైగా నిలిచిన చమురు ఉత్పత్తి!
    * చమురు ధరలు ముంచేశాయ్‌ – కుప్పకూలిన భారత స్టాక్‌మార్కెట్లు
    * నేటి డాలరు మారకపు ధర రూ.71.56
    * నేటి బంగారం 10 గ్రాముల ధర రూ.39,160
    * నేటి వెండి కేజీ ధర రూ.48800