Politics

కోడెల మృతిపై TNI సమగ్ర కథనాలు

Kodela Sivaprasad Death Mystery Details

కోడెల మరణం పై అనుమానంతో కోడెల కుమారుడు శివరాంపై పోలీసులకు కంప్లయింట్‌ చేసిన కోడెల మేనల్లుడు కంచేటి సాయి


###############
ట్విట్టర్ లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్…జగన్ గారూ! శవాల మీద రాజకీయ లబ్ది కాసులు ఏరుకునే పైశాచిక చేష్టలను వైసీపీ ఎప్పటికీ మానుకోదా? కోడెలగారిని కేసుల పేరుతో వేధించి ఆయన బలవన్మరణానికి కారణమైనందుకు కాస్త కూడా పశ్చాత్తాపం లేకుండా, సిగ్గులేని ప్రచారాలతో రెచ్చిపోతారా? మీరసలు మనుషులేనా? మీకసలు విలువలనేవే లేవా? కోడెలగారిది ఆత్మహత్య కాదు. ఇది ముమ్మాటికీ వైకాపా ప్రభుత్వ హత్యే. దాన్ని కప్పిపుచ్చుకోడానికి కుటుంబ కలహాలు అని, కొడుకే కొట్టి చంపారని నిస్సిగ్గుగా మీ దొంగ ఛానల్ లో కథనాలు ప్రసారం చేస్తారా? కోడెలగారి కొడుకు విదేశాల్లో ఉన్న విషయం మీ గుడ్డి సాక్షి ఛానల్ కి కనపడలేదా?
###############
రేపు ఉదయం 6గంటలకు హైదరాబాద్ లో కోడెల పార్దీవదేహం తో బయలుదేరనున్న చంద్రబాబు,లోకేష్. రోడ్డు మార్గంలో సూర్యాపేట, విజయవాడ మీదుగా మధ్యాహ్నం గుంటూరు పార్టీ కార్యాలయానికి రాక. సందర్శకుల కోసం కొద్ది సేపు పార్టీ కార్యాలయంలో ఉంచి అనంతరం నరసరావుపేట తీసుకెళ్తారు.
###############
ఉస్మానియా హాస్పిటల్ కు చేరుకున్న కోడెల పెద్ద కోడలు పద్మప్రియ. ఉస్మానియా మార్చురీ లో కోడెల మృతదేహానికి కొనసాగుతున్న పోస్ట్ మార్టం. పోస్ట్ మార్టం నివేదిక తర్వాతే కోడెల మృతిపై స్పష్టత వచ్చే ఛాన్స్. పోస్ట్ మార్టం అనంతరం కోడెల మృతదేహాన్ని కార్యకర్తలు, అభిమానుల సందర్శనార్థం NTR trust bhavan కు తరలింపు.
###############
కోడెల మృతి చాలా బాధకరం. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆయన మృతి పై అనేక రకాల వార్తలు వస్తున్నాయి. వివాదాస్పద మృతిలా కనిపిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం నిస్పక్షపాతం విచారణ జరిపించాలి. తక్షణమే వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలి —సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి.రాంబాబు
###############
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతి వార్త విన్న టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు, మాజీ మంత్రి లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

కోడెల మృతి పట్ల వారు సంతాపం ప్రకటిస్తూ.. కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు.

అలాగే గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు, మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, ఆలపాటి రాజా, నక్కా ఆనందబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు అనగాని సత్యప్రసాద్, మద్దాలిగిరి, నేతలు యరపతినేని, దూళిపాళ్ల నరేంద్ర తదితరులు కోడెల మృతి పట్ల సంతాపం ప్రకటించారు.

కోడెల శివప్రసాదరావు (72) సోమవారం మధ్యాహ్నం తన ఇంట్లో ఉరేసుకున్నారు. ఇది గమనించిన కుటుంబసభ్యులు హుటాహుటిన బసవతారకం ఆస్సత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. కాగా.. గత కొన్ని రోజులుగా కోడెలపై కేసులు చుట్టుముట్టడంతో.. రాజకీయ వేధింపులు తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.

కోడెల ఇకలేరన్న విషయం తెలుసుకున్న వీరాభిమానులు, టీడీపీ కార్యకర్తలు విషాదంలో మునిగిపోయారు.
###############
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత , మాజీ స్పీకర్ మరియు మాజీ మంత్రివర్యులు శ్రీ కోడెల శివప్రసాద్ గారి మృతికి సంతాపం తెలియజేసిన విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శ్రీనివాస్ ( నాని)..

ఆయన మృతి వ్యక్తిగతంగా నన్ను తీవ్రంగా కలచివేసిందని,కోడెలశివప్రసాదరావు గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని మనస్పూర్తిగా వేడుకుంటున్నాను.

వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన నాని..
###############
ఏపీ మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు చనిపోయేంతవరకు వైసీపీ ప్రభుత్వం వెంటాడి వేధించిందని టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. కోడెల మెడపై గాట్లు ఉన్నాయని, ఆత్మహత్యగా భావిస్తున్నామని ఆయన అన్నారు. కోడెల బాధ్యతలు నిర్వహించిన బసవతారకం ఆస్పత్రిలోనే.. మృతిచెందడం బాధాకరమని సోమిరెడ్డి విచారం వ్యక్తం చేశారు.
###############
ఈ రోజు ఉదయం 10:30 నిమిషాలకి బంజారాహిల్స్ లోని తన నివాసానికి చేరుకున్న కోడెల…

11 గంటలకి తన రూమ్ కి వెళ్లి తలుపు వేసుకున్న కోడెల..

11:30 గంటలకి రూమ్ తలుపు తట్టిన కుటుంబ సభ్యులు ,తలుపు తెరవకపోవడంతో వెనుక కిటికీ నుండి చూసిన వాచ్ మెన్

అప్పటికే ఉరి వేసుకున్న కోడెల

వాచ్ మెన్ ,గన్ మెన్ సాయంతో 11:45 నిమిషాలకి బంజారాహిల్స్ లోని బసవతారకం ఆసుపత్రికి తరలింపు

12:09 నిమిషాలకి మృతి చెందినట్లు ధ్రువీకరించిన వైద్యులు…


###############
టీడీపీ సీనియర్‌ నేత, ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు మరణం పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, గవర్నర్‌ బిశ్వభూషన్ హరిచందన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కోడెల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

కేసీఆర్‌ సంతాపం..
కోడెల శివప్రసాదరావు మృతిపట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కోడెల మృతిపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ విచారం వ్యక్తం చేశారు.

మాజీ మంత్రి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు మరణించారన్న వార్త తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని ఓ ప్రకటనలో తెలిపారు.

కోడెల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని ప్రకటించారు.
###############
కోడెలది ఆత్మహత్యా? సహజ మరణమా?
విచారణ జరుపుతున్న బంజారాహిల్స్‌ పోలీసులు
కుటుంబసభ్యుల స్టేట్‌మెంట్‌ రికార్డు
ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం
హైదరాబాద్‌ : టీడీపీ సీనియర్‌ నాయకుడు, ఆంధ్రప్రదేశ్‌ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ఆకస్మిక మృతి పట్ల బంజారాహిల్స్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆయన మృతిపై కారణాలను ఆరా తీస్తున్నారు. ఈ మేరకు కోడెల కుటుంబసభ్యుల నుంచి స్టేట్‌మెంట్‌ పోలీసులు రికార్డు చేసినట్టు తెలుస్తోంది. కోడెల అస్వస్థతకు గురికావడంతో ఆదివారం రాత్రి 11.15 గంటలకు ఆయనను డ్రైవర్, గన్‌మెన్ బసవతారకం ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచి ఆయనకు చికిత్స అందించారు. అర్ధరాత్రి 12.15 గంటలకు చికిత్స పొందుతూ కోడెల మృతి చెందారు. కోడెల మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోడెలది ఆత్మహత్య నా? అనారోగ్యం కారణంగా మృతిచెందారా? అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. మరికొద్దిసేపటిలో కోడెల భౌతికకాయానికి వైద్యులు పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు. బసవతారకం ఆస్పత్రి నుంచి కోడెల భౌతికకాయాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి.. అక్కడ పోస్ట్‌మార్టం నిర్వహించనున్నారు.
###############

రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖామంత్రి శ్రీ బొత్సా సత్యనారాయణ కామెంట్స్

– శ్రీ కోడెల శివప్రసాద్ మరణం పట్ల దిగ్భ్రాంతి చెందాం.
– ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియచేస్తున్నాం.
– శివప్రసాద్‌ గారి మరణంపై వార్తలు క్షణక్షణం మారుతూ వస్తున్నాయి.
– కోడెల మృతికి గుండెపోటు కారణమంటూ మీడియాలో వార్తలు వచ్చాయి.
– మళ్ళీ వెంటనే గతరాత్రి ప్రమాదకరమైన ఇంజక్షన్‌ వేసుకున్నారని మరో వార్త ప్రసారం చేశారు.
– ఆ వెంటనే ఆయన గుండెపోటుతో మరణించారని, వత్తిడితో మృతిచెందినట్లు మరో వార్త ప్రసారం చేశారు.
– సీనియర్‌ రాజకీయ నాయకుడి మరణంపై పలు కథనాలు వస్తున్నప్పుడు వాటిపై సమగ్ర విచారణ జరగాలి.
– ఈ మేరకు తెలంగాణా ప్రభుత్వంను కోరుతున్నాము.
– సాక్ష్యాలు తారుమారు కాకుండా చూడాలని కోరుతున్నాం.
– గుండెపోటు… ఇంజక్షన్‌… ఉరి వేసుకున్నారని అంటున్నారు…
– ఏదైనా జరిగితే దగ్గరలోని ప్రముఖ ఆసుపత్రులు వున్నాయి.
– వీటిని కాదని కోడెలను బసవ తారకం కాన్సర్‌ ఆసుత్రికి తీసుకువెళ్లడం పట్ల సందేహాలు వ్యక్తవుతున్నాయి.
– తెలుగుదేశం పార్టీ నాయకులు కోడెల మరణంపై శవరాజకీయాలు చేస్తున్నారు.
– ప్రభుత్వ వత్తిడి వల్లే ఉరివేసుకున్నారంటూ చెబుతున్నారు.
– ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరగాలి.
– ప్రభుత్వం కోడెలపై ఏనాడు వత్తిడి తేలేదు…కావాలని కేసులు పెట్టలేదు.
– కోడెల శివప్రసాద్‌ వల్ల నష్టపోయిన వారు పోలీసులను ఆశ్రయించడం వల్లే కేసులు నమోదయ్యాయి.
– దీనిని రాజకీయం చేయాలని తెలుగుదేశం పార్టీ ఆలోచన చేస్తోంది.
– సంఘటనా స్థలంను కస్టడీలోకి తీసుకుని, కోడెలకు పోస్టుమార్టం చేయడం ద్వారా వాస్తవాలను వెలికితీయాలి.