DailyDose

భారీగా పెరిగిన బంగారం ధర:వాణిజ్యం-09/17

Gold Prices Surge-Telugu Business News Today-09/17

* చమురు మంటలు మళ్ళీ బంగారం ధరలకు ఆజ్యం పోశాయి. ఇటీవల మేలిమి(999 స్వచ్ఛత) బంగారం 10 గ్రాముల ధర రూ.40,000 పైకి వెళ్ళినా, క్రమేనా దిగి వచ్చి రూ.38,000 సమీపానికి చేరింది. అయితే చమురు ధరలు ఒక్కసారే ఎగబడటంతో, పసిడి ధరలు కూడా పెరిగాయి
* మూలిగే నక్కపై తాటి పండు పడినట్లు.. చందంగా మారుతుంది మన ఆర్ధిక వ్యవస్థ స్థితి. అసలే మందగమనం వెంటాడుతోంది.. జూన్ త్రైమాసికంలో వృద్ధి రేటు 5 శాతానికి పరిమితమైంది. రూపాయి మారకపు విలువ క్షీణిస్తూ కలవార పెడుతోంది
* డ్రోన్లతో జరిపిన దాడులు కారణంగా సౌదీ అరేబియా ముడి చమురు ఉత్పత్తిలో సగానికి పైగా ప్రభావం పడనుంది. రోజుకు 5.7 మిలియన్ బ్యారెళ్ళు ఉత్పత్తి తగ్గనుంది. సౌదీ వద్ద తగినన్ని నిల్వలు ఉండటంతో ప్రస్తుతానికి సరఫరా విషయంలో అవరోధాలు ఎదురుకాకపోవచ్చు. అయితే అంతర్జాయంగా దహరాలు పెరగాదంతో దేశీయంగా పెట్రోలియం ఉత్పత్తులపై ప్రభావం పడుతుంది. సమీప భవిష్యత్తులో పెట్రోలు, డీజిల్ ధరలు లీటరుకు రూ.5-6 వరకు పెరిగే అవకాశం ఉందని హెచ్పీ సీఎల్ చైర్మెన్ ఎంకే సురానా పేర్కొన్నారు
* అమెరికాకు చెందినా ఐటీ సేవల సంస్థ న్యూడేసిక్ దేశంలో తన నాలుగో కార్యాలయాన్ని హైదరాబాదులో ప్రారంభించింది
* ఎయిరిండియా రుణాలు తీర్చేందుకు ఎయిరిండియా అసెట్స్ హోల్డింగ్స్ (ఏఐఏహెచ్ ఎల్) బాండ్ల జారీ ద్వారా సోమవారం రూ.7000 కోట్లు సమీకరించింది
* హైదరాబాద్ కేంద్రంగా కార్యాకలాపాలు సాగిస్తున్న విత్తనా తయారీ సంస్థ, కావేరీ సీడ్ కంపెనీ మరో దఫా షేర్ల బైబ్యాక్ చేపట్టడానికి సన్నద్ధమవుతుంది
* ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ ఉద్యోగులకు స్వచ్చంద పదవీ విరమణ పధకం(వీఆర్ ఎస్) ప్రకటించింది. ఉత్పాదకత, సామర్ధ్యాలను పెంచుకోవడంలో భాగంగా వీఆర్ ఎస్ ప్రకటించినట్లు తిలిపింది
* తెలంగాణా, ఆంధ్రప్రదేశ్. ఉత్తర ప్రదేశ్ ల్లో తమ అనుబంధ సంస్థ హిల్ కౌంటీ ప్రాపర్టీస్ కు చెందిన 494 ఎకరాల భూమిని ఐఎల్ అండ్ ఎఫ్ ఎస్ గ్రూపు అమ్మకానికి పెట్టింది
* ల్యాన్సోప్రజోల్ ఔషధాన్ని 15 ఎంజీ డోసులో యూఎస్ మార్కెట్లో విడుదల చేసినట్లు డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ వెల్లడించింది
* దసరా, దేపావళి పండగలను పురస్కరించుకొని అమెజాన్ ఈ నెల 29 నుంచి అక్టోబర్ 4 వరకు గ్రేట్ ఇండియా ఫెస్టివల్ పేరిట భారీ డిస్కౌంట్ అమ్మకాలు జరపనుంది
* 2019-20 తోలి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 5 శాతం మాత్రమే నమోదు కావడం ఆశ్చర్యం కలిగించింది
* నేటి డాలరు మారకపు ధర రూ.71.80
* నేటి వెండి కిలో ధర రూ.48765