Politics

చంద్రబాబు దూరం పెట్టినందుకే కోడెల ఆత్మహత్య

Kodali Nani On Kodela Sivaprasada Raos Death

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌ది రాజకీయ హత్య అని ఆరోపించారు ఏపీ మంత్రి కొడాలి నాని.

తనను నమ్ముకొన్న పార్టీ, అధినేత దూరం పెట్టడంతో అవమానంతో ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు.

కోడెల శివప్రసాద్‌ను ఏపీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందని 3 నెలలో ఎందుకు చంద్రబాబు మీడియా ముఖంగా చెప్పలేదని ప్రశ్నించారు.

కోడెల, అతని కుమారుడు శివరామకృష్ణ, కూతురు విజయలక్ష్మీపై కేసు పెట్టింది బాధితులేనని స్పష్టంచేశారు.

ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్ కేసులు నమోదు చేయలేదని తేల్చిచెప్పారు.

ఎప్పుడు మీ వెన్నంటే ఉన్న కోడెలను మీరు దారుణంగా అవమానించారని తెలిపారు.

పార్టీలో కొందరి చేత కోడెల శివప్రసాద్ తప్పుచేశారని మాట్లాడించారని ఆరోపించారు.

వర్ల రామయ్య లాంటి వ్యక్తులతో పార్టీ కార్యాలయంలో మాట్లాడించి .. కోడెలను ఒంటరి చేసింది మీరు కాదా అని చంద్రబాబును ప్రశ్నించారు కొడాలి నాని.

అంతేకాదు శాసనసభ ఫర్నీచర్‌కు సంబంధించి ఏ చర్య తీసుకున్నా తాము కాదనబోమని ఓ పత్రికలో చంద్రబాబు పేరుతో వచ్చిన వార్తను చదివి వినిపించారు కొడాలి నాని.

కోడెల శివప్రసాద్‌ను చంద్రబాబు దారుణంగా అవమానించారు.

అందుకోసమే ఆయన అవమాన భారాన్ని తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నారు.