Movies

మూగ మణి

Anushka Acting As A Dumb Artist With Madhavan

అనుష్క ప్రస్తుతం నటిస్తున్న వెరైటీ మూవీ ‘నిశ్శబ్దం’. హేమంత్ మధుకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సాక్షి అనే మూగ ఆర్టిస్ట్ పేరుతో అనుష్క నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. కాగా ఈ సినిమాలో సస్పెన్స్ ఎలిమెంట్స్ చాలా బాగా వచ్చాయని, అవి ఈ సినిమాకి పెద్ద హైలైట్ గా నిలుస్తాయని సమాచారం. ముఖంగా సెకెండ్ హాఫ్ లో వచ్చే ప్రీ క్లైమాక్స్ మరియు కొన్ని ఆసక్తికరమైన ట్విస్ట్లు సినిమాకి ఏంటో పెద్ద ప్లస్ పాయింట్స్ అని అంటున్నారు. ఇక మాధవన్ ఈ సినిమాలో ఒక డిఫరెంట్ రోల్ లో నటిస్తున్నాడట. సినిమాలో అనుష్క మరియు మాధవన్ మధ్య వచ్చే సన్నివేశాలు ఏంతో ఆకట్టుకుంటాయని అంటున్నారు. ఇంకా ఈ సినిమాలో అనుష్క , మాధవన్ ల తో పాటు సుబ్బరాజు, అంజలి, షాలిని పాండే తో పాటు ప్రముఖ హాలీవుడ్ నటుడు మైఖేల్ మాడిసన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. యువ సంగీత దర్శకుడు గోపి సుందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. రచయితా కోన వెంకట్ బ్యానర్ , కోన ఫిలిం కార్పోరేషన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.