ScienceAndTech

ఈ-సిగరెట్లపై ఇండియా నిషేధం

India Bans E-Cigarettes

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. ఇ-సిగరెట్లపై నిషేధం విధించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఇక నుంచి వీటి తయారీ, దిగుమతి, ఎగుమతి, రవాణా, విక్రయాలు, పంపిణీ, నిల్వ చేయడం, ప్రచారం వంటి అంశాలపై నిషేధం విధించినట్లు ఆమె వెల్లడించారు. ఇ-సిగరెట్ల వల్ల యువతపై తీవ్రమైన చెడుప్రభావం పడుతోందని తెలిపారు. అలాగని తాము సాధారణ సిగరెట్లను ప్రోత్సహించడం లేదని చెప్పారు. అమెరికా అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకొన్నట్లు నిర్మల వివరించారు. పొగాకు వినియోగం తగ్గించాలనేది ప్రభుత్వ ఆశయమన్నారు. ఈ ప్రతిపాదనను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రతిపాదించగా.. కేంద్రం ఆమోదించింది. పిల్లలు, యువతలో ఇదొక వ్యసనంగా మారకుండా జాగ్రత్తలు తీసుకొనేందుకు ఈ నిర్ణయం తీసుకొన్నట్లు సమాచారం. ఈ నిషేధాన్ని ఉల్లంఘించిన వారిపై భారీగా జరిమానా కూడా విధించే అవకాశం ఉంది. ఈ ఆర్డినెన్స్‌ తయారు చేసిన బృందానికి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షత వహించారు. మోదీ ప్రభుత్వం తొలి 100 రోజుల అజెండాలో ఇ-సిగరెట్ల నిషేధం కూడా ఉంది.