DailyDose

కానిస్టేబుల్ కాల్చుకొని చనిపోయాడు:నేరవార్తలు-09/18

Telugu Crime News Today - Sep 18 2019

* ఇందల్వాయి పోలీస్‌స్టేషన్‌లో విషాదం చోటుచేసుకుంది. హెడ్‌కానిస్టేబుల్‌ ప్రకాష్‌ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. హెడ్‌కానిస్టేబుల్‌ ప్రకాష్‌… ఎస్‌ఐ రివాల్వర్‌ తీసుకుని కాల్చుకున్నాడు. ఓ కేసు విషయంలో ఎస్సైతో వాగ్వాదం జరిగినట్లుగా తెలుస్తోంది.
* ధవళేశ్వరం ఆనకట్ట దగ్గర మరో 5 మృతదేహాలు లభ్యం.గోదావరి పడవ ప్రమాదంలో గల్లంతైన వారి 5మృతదేహాలు గా నిర్ధారణ. 31కి చేరిన మృతుల సంఖ్య మరో 17 మంది ఆచూకీ కోసం అన్వేషణ మృతుల వివరాలు తెలియాల్సి ఉంది
* కుటుంబ కలహాలతో మద్యం మత్తులో కట్టుకున్న భార్య ను చున్ని తో మెడకు బిగించి దారుణంగా చంపిన భర్త. గుడివాడ నాగవర్పపాడు లో ఘటన పెదపూడి బేబి అనూష (21) మృతి.భర్త పెదపూడి శ్రీకాంత్ పరారీ. కేసు నమోదు చేసిన పోలీసులు
* తల్లిదండ్రులు అప్పు తీర్చలేదని ఎనిమిది నెలల బాలుడు కిడ్నాప్‌‌నకు గురయ్యాడు. సొమ్మును తీసుకొని జైపూర్‌ వస్తే బిడ్డను అప్పగిస్తామని వెల్లడించడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కృష్ణా జిల్లా ఆత్కూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు
* విజయవాడ రైల్వేస్టేషన్ సమీపంలో అనుమానాస్పదం గా తిరుగుతున్న ఇద్దరు కర్నాటక వాసుల్ని అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు. అనుమానితుల నుండి రెండు కేజీల నకిలీ బంగారు ఆభరణాలు స్వాధీనం. అసలు బంగారం కాజేసీ నకిలీ బంగారం అంటకట్టే ముఠా సభ్యులుగా అనుమానిస్తున్న పోలిసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సత్యనారాయణ పురం పోలీసులు.
* వైకాపా ప్రభుత్వానివి కక్ష సాధింపు చర్యలని , తెదేపా నాయకులను వేధిస్తున్నారని మాజీ జడ్పీ చైర్మన్ జ్యోతుల నవీన్ కుమార్ ఆరోపించారు . మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మృతిపట్ల తెదేపా ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా జగ్గం పేటలో నిరసన ప్రదర్శన చేపట్టారుఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకాపా పాలనలో అరాచకాలు తప్ప మరేవీ లేవన్నారు . కోడెల మృతికి – ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు
* కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గోకుల్ తండాగ్రామ సర్పంచ్ లలిత భర్త లింభాద్రి తలను పగులగొట్టారు. లలిత మాట్లాడుతూ , అభివృద్ధి పనుల నిమిత్తం శ్మశాన వాటిక స్థలం కోసం అటవీ భూమిని పరిసిలించిన క్రమంలో గ్రామానికి చెందిన ఓకుటుంబానికీ చెందిన ముగ్గురు కలిసి వెనుక నుంచి బాదడంతో తలపగిందని చెప్పారు. బాదితుడిని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.